Jagadhatri  Serial Today Episode: ఇంట్లో అందరూ కూర్చుని భోజనం చేస్తుంటే యువరాజ్‌ కోపంగా ధాత్రిని తిడుతుంటాడు. ఇంతలో సుధాకర్‌ యువరాజ్‌ను మందలిస్తాడు. దీంతో యువరాజ్‌ షాక్‌ అవుతాడు. ఇంతకు ముందు వాళ్లను చూస్తేనే కోపంతో రగిలిపోయేవాడివి ఇవాళ వాళ్లకు సపోర్టుగా మాట్లాడుతున్నావేంటి అని యువరాజ్‌ ప్రశ్నిస్తాడు.  వైజయంతి కూడా సుధాకర్‌ను తిడుతుంది. కౌషికి లాగానే వీళ్లు మీకు కూడా ఏదో మందు పెట్టి ఉంటారని అనడంతో సుధాకర్‌ భోజనం చేయకుండా లేచిపోతారు. నిషిక కూడా ఎవ్వరూ ఈ భోజనం చేయకండి ఇందులో కూడా ఏ మందో కలిపి ఉంటారనడంతో అందరూ భోజనం చేయకుండా లేచి వెళ్లిపోతారు. మరోవైపు సుధాకర్‌ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే నిషిక, యువరాజ్‌, వైజయంతి వస్తారు.


వైజయంతి: బా.. నీతో ఇవాళ మనసు విప్పి మాట్లాడాలని ఉంది. అసలు ఆ కేదార్,  జగధాత్రి నీకు ఏమౌతారు. వాళ్లని నీవు ఆ కౌషికి అట్టా వెనకేసుకొస్తారు. మొన్నటిదాకా వాళ్లను చూస్తే కారాలు మిరియాలు నూరేవాడివి. ఇప్పుడేమో ప్రేమలు అభిమానాలు పంచుతున్నావు.


యువరాజ్‌: మీరు జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి చూస్తుంటే అసలు మీ కొడుకు వాడా నేనా అన్నట్లు అనుమానం వస్తుంది.


సుధాకర్‌: ఒరేయ్‌ నాన్నా మీరు నన్ను తప్పుగా అర్తం చేసుకుంటున్నారు.


నిషిక: ఇప్పుడే సరిగ్గా అర్థం చేసుకుంటున్నాము మామయ్య.


సుధాకర్‌: వాళ్లు ప్రేమతో వండిన కూరలు రుచిగా ఉన్నాయని చెప్పాను. వాళ్లల్లో స్వార్థం లేదని చెప్పాను. అది తప్పా?


యువరాజ్‌: తప్పే నాకు అమ్మకి, నిషికాకి ఇష్టం లేదని తెలుసుగా వాళ్లని దగ్గరకు రానివ్వడం చాలా పెద్ద తప్పు.


నిషిక: మిమ్మల్ని కౌషికి వదినను వాళ్లు మాయ చేస్తున్నారు మామయ్య. మీరిద్దరూ చాలా తెలివైన వాళ్లు కదా మీకెందుకు ఇది అర్థం కావడం లేదు.


సుధాకర్‌: మాయ చేసే ఉద్దేశమో.. మోసం చేసే గుణమో వాళ్లకు లేదు నిషిక. వాళ్లు నిజంగా ఈ కుంటుంబాన్ని ప్రేమిస్తున్నారు.


అనడంతో వైజయంతి సుధాకర్‌ను కోపంగా తిడుతుంది. దీంతో మీరే నాకు ఎక్కువ అంటే నేనేం చేయాలో చెప్పండి అని సుధాకర్‌ అడగడంతో మీరు వాళ్లతో మాట్లాడొద్దు, వాళ్లను దూరం పెట్టండి అని నిషిక చెప్తుంది. దీంతో సుధాకర్‌ షాక్‌ అవుతాడు. మీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు. అనడంతో వైజయంతి సుధాకర్‌కు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. తర్వాత రాగిణి వాళ్ల అమ్మా సుభద్ర.. సుధాకర్‌ వాళ్ల ఇంటికి వస్తారు. అందరి పలకరింపులు అయిపోయాక సుధాకర్‌ ను పలకరిద్దామని వచ్చామని చెప్పడంతో రాగిణి  నిషిక కోసం నెక్లెస్‌ తెచ్చానని చూపిస్తుంది. నెక్లెస్‌ ఎలా చేయించావని సుభద్ర అడిగితే ధాత్రి వాళ్ల అమ్మా నగలు కరిగించి చేయించానని చెప్తుంది దీంతో ధాత్రి బాధపడుతుంది. దీంతో రాగిణి కోపంగా ధాత్రిని తిడుతూ మీ అమ్మా నేరస్థురాలు, అక్రమార్కురాలు అంటూ తిడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన దివ్యాంక అంతా చూస్తుంటుంది.


ధాత్రి: అత్తయ్యా ప్లీజ్‌ మా అమ్మా గురించి తప్పుగా


దివ్యాంక: అమ్మో ఇంతకంటే పెద్ద జోక్‌ నేనెప్పుడూ వినలేదు తెలుసా? అందరిని నేరస్థులు అని ఆరోపిస్తూ.. తప్పుడు కేసులలో మనుషులను ఇరికించే జగధాత్రి వాళ్ల అమ్మా.. అందరికంటే పెద్ద నేరస్తురాలన్న మాట.


ధాత్రి: దివ్యాంక గొడవ నీకు నాకు మాత్రమే మధ్యలో మా అమ్మ గురించి నీకెందుకు? గతం గురించి కానీ మా అమ్మా గురించి కానీ నీకేం తెలియదు.


నిషిక: మీ అమ్మా గొప్ప గతం గురించి నేను చెప్పనా? మీ అమ్మ వల్ల ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్ల గురించి చెప్పనా? ఆ కుటుంబానికి మీ అమ్మా మిగిల్చిన కష్టం గురించి చెప్పనా?


అంటూ అందరూ తిడుతుంటే దివ్యాంక మీ అమ్మా గురించి హిస్టరీలో మోస్ట్‌ కరప్టెడ్‌ పోలీస్‌ అంటూ హెడ్‌లైన్‌ వేస్తాం అనగానే ధాత్రి, దివ్యాంక మీదకు వెళ్లబోతుంటే సుభద్ర  పక్కకు తీసుకెళ్లిపోతుంది. తల్లిని తల్చుకుని ఏడుస్తున్న ధాత్రిని ఓదారుస్తుంది. మరోవైపు  దివ్యాంక జైలు నుంచి బయటకు రావడంతో  నువ్వు చాలా గ్రేట్‌ జైలుకు ఇలా వెళ్లి అలా వచ్చావు అని మెచ్చుకుంటారు. దీంతో నా గురించి మీకింకా పూర్తిగా తెలియదు. ఇప్పటి నుంచి నేనేంటో ఆ ధాత్రికి తెలిసేలా  చేస్తానంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    


Also Read: రీరిలీజ్‌కు సిద్ధమైన ఉదయ్‌ కిరణ్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ - ఆ రోజే థియేటర్లో 'నువ్వు నేను' సందడి