Nuvvu Nenu Movie Re-release: టాలీవుడ్‌ దివంగత హీరో ఉదయ్‌ కిరణ్‌ మరణాన్ని ఇప్పటికీ అతడి ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. అతడు మరణించి పదేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఇక ఆయన నటించిన చిత్రాలు అప్పట్లో ఎంతటి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో మనసంత నువ్వే, నువ్వు నేను చిత్రాలు ఇప్పటికి ఎవర్‌గ్రీన్‌ అనే చెప్పాలి. ఇప్పటికి ఈ సినిమాలు పాటలు ప్రేమికుల ఫోన్‌లో, కాలర్‌ ట్యూన్‌గా మారుమోగుతూనే ఉంటాయి. ముఖ్యంగా నువ్వు నేను సినిమా అప్పట్లో ఎంతటి బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిందో తెలిసిందే. 2001 అగస్ట్‌ 10న ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.


ఈ మూవీ రిలీజై రెండు దశబ్దాలు గడిచిన ఇప్పటికీ ఈ  సినిమాలోని సన్నివేశాలు, పాటలు ఎక్కడో ఒకచోట మారుమోగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తుండటంతో.. ఉదయ్‌ కిరణ్‌ ఫ్యాన్స్‌ కోసం మేకర్స్‌ 'నువ్వు నేను' మూవీని మరోసారి థియేటర్లోకి తీసుకువస్తుస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ మూవీ రీరిలీజ్‌పై చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రీరిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసి అధికారిక ప్రకటన ఇచ్చాను. ఎమోషనల్‌ లవ్‌ డ్రామాగా వచ్చిన నువ్వు నేను మూవీ అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. మరోసారి యువత కోసం, ఉదయ్‌ కిరణ్‌ ఫ్యాన్స్‌ కోసం మార్చి 21న  వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా రీ-రిలీజ్‌ కానుంది. ఇది తెలిసి ఉదయ్‌ కిరణ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఆ రోజున థియేట్లో రచ్చ చేసేందుకు యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  


'నువ్వు నేను' కథ


నువ్వు నేను మూవీని డైరెక్టర్‌ తేజ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఉదయ్‌ కిరన్‌-అనిత హసనందానీ హీరోహీరోయిన్లుగా ఎమోషనల్‌ లవ్ డ్రామాగా తేజ ఈ సినిమాను రూపొందించిన విధానానికి యూత్‌ ఫిదా అయ్యింది. ధనవంతుడైన అబ్బాయి, మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడటం.. వారిని విడగొట్టేందుకు పెద్దలు చేసే ప్రయత్నాలు.. పెద్దవారిని ఎదరించి ఒక్కటవ్వాలని చూసే ఈ ప్రేమజంటకు ఎదురైన కష్టాలు, అవాంతారాల చూట్టూ నువ్వు-నేను మూవీ సాగుతుంది. ఈ సినిమాలో ఇది బాగాలేదు అనేది ఏం లేకుండ చాలా క్లీన్‌గా తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్‌, కామెడీ, ఎమోషన్స్‌, పాటలు అన్నీ కూడా సినిమాల్లో నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. ముఖ్యంగా ఆర్పీ పట్నాయ్‌ అందించిన సంగీతం ఈ సినిమాకు మెయిన్‌ హైలెట్‌ అని చెప్పాలి. పాటలు, మ్యూజిక్‌లోనూ ప్రేమికుల ప్రతిస్పందనల వినిపించాయి. మ్యూజిక్‌ పరంగానూ నువ్వు-నేను బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. అంతటి ఘనవిజంయ సాధించిన ఈ సినిమా 23 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లోకి రాబోతుంది. మరి రీరిలీజ్‌లోనూ ఈ మూవీ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. 


ఇప్పటికీ మిస్టరీగానే ఉదయ్‌ కిరణ్‌ డెత్‌


అయితే 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' చిత్రాలతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఉదయ్ కిరణ్. అప్పట్లో ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అందుకే ఉదయ్ ను లవర్ బాయ్ గా పిలిచేవారు. అలాంటి ఒక హీరో  తర్వాత వరుసగా కొన్ని ఫ్లాప్ లు రావడంతో కుంగిపోయాడు. అదే సమయంలో వివాహం అయింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పట్లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవ్వడం, కొత్త సినిమాలేవీ రాకపోవడంతో చనిపోయాడని కొంతమంది, ఉదయ్ ఆత్మహత్య వెనుక పెద్దల హస్తం ఉందని కొంతమంది, భార్యతో విభేదాల వల్లే ఇలా చేశాడని ఇంకొంతమంది ఇలా ఎవరికి నచ్చనట్టు వారు కామెంట్లు చేశారు. కానీ ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో ఇప్పటికీ తెలియరాలేదు.