Kollywood Actor Sivakarthikeyan About Sandeep Reddy Vanga : 'యానిమల్' మూవీ తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఓ డిఫరెంట్ యాటిట్యూడ్ తో కూడిన హీరోయిజాన్ని తన సినిమాలలో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తీసింది 2 సినిమాలే అయినా వాటితో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. సందీప్ రెడ్డి వంగ నుంచి గత ఏడాది చివర్లో వచ్చిన 'యానిమల్' సినిమాని ఎంతోమంది బాగుందని మెచ్చుకున్నారు. అంతకంటే ఎక్కువ మంది విమర్శించారు కూడా. ఈమధ్య కొంతమంది తమిళ సెలబ్రిటీలు అయితే 'యానిమల్' మూవీపై, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఓ కోలీవుడ్ స్టార్ హీరో మాత్రం సందీప్ రెడ్డి వంగా గురించి అందుకు భిన్నంగా మాట్లాడడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది.


ఆయన సినిమాలకంటే ఆయనిచ్చే ఇంటర్వ్యూలకే అభిమానిని - శివకార్తికేయన్


'యానిమల్' పాన్ ఇండియా వైడ్ సక్సెస్ అవ్వడంతో సందీప్ రెడ్డివంగా చాలా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం కొన్ని ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్తున్నాడు. ఇదేవిధంగా తమిళనాడులో తాజాగా జరిగిన ఓ అవార్డ్స్ వేడుకకు హాజరయ్యాడు. ఇదే ఈవెంట్ కి వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ సందీప్ రెడ్డి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు." సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ నాకు చాలా నచ్చుతుంది. ముఖ్యంగా సినిమాలో ఆయన మ్యూజిక్ ని యూజ్ చేసుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. యానిమల్ మూవీ చూసేటప్పుడు నాకు థ్రిల్లింగ్ గా అనిపించింది. ఆయన సినిమాల కంటే ఆయనిచ్చే ఇంటర్వ్యూలకే నేను అభిమానిని. ఆయన సమాధానాలు చెప్పే విషయంలో చాలా ముక్కుసూటిగా ఉంటారు" అని చెప్పుకొచ్చాడు. గత కొద్దిరోజులుగా తమిళ సెలబ్రిటీలు సందీప్ రెడ్డి వంగా పై విమర్శలు చేస్తుంటే మొదటిసారి శివ కార్తికేయన్ ఆయన గురించి ఇలా పాజిటివ్ గా మాట్లాడడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 






ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్


శివ కార్తికేయన్ కెరీర్లో ఇప్పటివరకు పలు కమర్షియల్, కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాలు చేశాడు మధ్యలో కొన్ని ప్రయోగాత్మక పాత్రల్లోనూ నటించాడు. ఇక ఈసారి ఓ ఆర్మీ ఆఫీసర్ బయోపిక్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గా శివ కార్తికేయన్ బర్త్డే సందర్భంగా ఆ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. 'అమరన్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ ముకుంద్ వి అనే మేజర్ జనరల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి రెస్పాన్స్ వచ్చింది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మూవీస్ బ్యానర్ పై యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.


Also Read : యువిలో శర్వా డబుల్ హ్యాట్రిక్ ఫిల్మ్ - క్యారెక్టర్ రివీల్ చేశారుగా!