Jagadhatri Serial Today Episode: మినిష్టర్ ఇంటికి వెళ్లి రాఘవను ఇంటరాగేషన్ చేస్తారు కేదార్, ధాత్రి. ఇంట్లోని సీసీటీపీ ఫుటేజీ పరిశీలిస్తారు. అందులో ఏదో అనుమానం రావడంతో ధాత్రి ప్రిజ్ గురించి రాఘవను అడుగుతుంది. అయితే రాఘవ భయపడుతూ సమాధానం చెప్పడంతో కేదార్, ధాత్రి రాఘవను అనుమానిస్తారు. వెంటనే మినిష్టర్ ను ఎందుకు చంపావని నిలదీయడంతో రాఘవ నేను ఎం చేయలేదని అంతా మల్లయ్యకే తెలుసని అంటాడు. మల్లయ్య ఎవరని కేదార్, ధాత్రి అడగ్గానే నాన్నగారిని ఎప్పుడూ సీక్రెట్‌గా కలుస్తాడని రాఘవ చెప్తాడు. అయితే ఆ మల్లయ్య డీటెయిల్స్ చెప్పమని ధాత్రి అడుగుతుంది. దీంతో మల్లయ్య డీటెయిల్స్ తనకు తెలియవని కానీ ఆయన నెంబర్ డాడీ ఫోన్‌లో ఉందని.. నంబర్ తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు రాఘవ.
కేదార్: ఎంటి ధాత్రి ఇది ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్తున్నారు. ఏం అర్థం కావడం లేదు.
ధాత్రి: కేడీ వాడు కచ్చితంగా మనల్ని కన్పీజ్ చేసి ఇప్పుడు పారిపోయాడు.
రాఘవ: నేనెక్కడికి పారిపోతా మేడం..
అంటూ రౌడీలను తీసుకుని వస్తాడు రాఘవ.
ధాత్రి: నిన్ను ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నీమీద నాకు డౌట్ వచ్చిందిరా? నా గెస్ కరెక్టే కేడీ.
అనగానే కేదార్ రాఘవను కొడతాడు. రౌడీలు కేదార్, ధాత్రిల మీదకు వస్తారు. రౌడీలను చితక్కొట్టిన తర్వాత కేదార్ రివాల్వర్ తీసి రాఘవకు ఎయిమ్ చేసి నిజం చెప్పమని అడుగుతారు. దీంతో రాఘవ మినిస్టర్‌ను ఎలా చంపింది మొత్తం క్లియర్‌గా వివరిస్తాడు. ఒక కిల్లర్ తో మినిష్టర్‌ను పొడిపించి ఆ నేరం సుధాకర్ మీద పడేటట్లు చేశానని ఒప్పుకుంటాడు రాఘవ. ఇంతలో పోలీసులు వస్తారు. రౌడీలను రాఘవను అరెస్ట్ చేస్తారు. పోలీసులు మీరెవరని కేదార్, ధాత్రిని అడగ్గానే తాము సాదు టీం అని చెప్తారు. మినిస్టర్ గారిని తామే చంపానని రాఘవే ఒప్పుకున్నాడు అని ధాత్రి చెప్పగానే పోలీసులు సరే మిగతాది తాము చూసుకుంటామని చెప్తారు. మరోవైపు కౌషికికి మీనన్ ఫోన్ చేస్తాడు.
మీనన్: కౌషికి నీ భయం చూసి మీ బాబాయ్ మీద ప్రేమ ఉందనుకున్నా? కానీ లేదని అర్థం అయ్యింది. అందుకే మా మనుషులకు మీ బాబాయ్ ని చంపేయమని చెప్పా
కౌషికి: చంపేయమని చెప్పడం ఏంటి? నాకిచ్చిన టైం లోపు పెన్‌డ్రైవ్ నీకు ఇస్తానని చెప్పాను కదా?
మీనన్: ఈ మీనన్ అంటే ఎవరనుకున్నావు కౌషికి నాతోనే గేమ్స్ ఆడాలని చూస్తున్నావా? పెన్‌డ్రైవ్ చేతికి రాగానే మొదటి కాల్ నాకే వస్తుందనుకున్నా? కానీ అలా జరగలేదు ఎందుకు?
కౌషికి: సారీ పెన్‌డ్రైవ్ నీకిచ్చేస్తాను. ఇంకోసారి ఇలా జరగదు. నన్ను నమ్ము.
మీనన్: మీ బాబాయ్ ప్రాణాలతో కావాలంటే గంటలో పెన్‌డ్రైవ్ తీసుకుని జైలుకు వచ్చేయ్.
అని చెప్పగానే సరే అని ఫోన్ పెట్టేస్తుంది కౌషికి. సురేష్ కష్టం, ధాత్రి నమ్మకం అలాగని నాన్న ప్రాణాలు ఎలా ఇప్పుడు అని ఆలోచిస్తూ ధాత్రికి ఫోన్ చేసి తనకు మీనన్ ఫోన్ చేశాడని జరిగిన విషయం చెప్తుంది కౌషికి. దీంతో సరే మీరు జైలు దగ్గరకు రండి నేను కేదార్ అక్కడికి వస్తాము.
కౌషికి: వద్దు మీరు అక్కడికి వచ్చారని తెలిస్తే బాబాయ్‌ని ఏమైనా చేస్తాడు. ఆ పెన్‌డ్రైవ వాడికి ఇచ్చేస్తే సురేష్ పడిన కష్టం అంతా వృథా అయిపోతుంది. నువ్వేమైనా ఐడియా ఇస్తావని నీకు కాల్ చేశాను.
ధాత్రి: మీరేం భయపడకండి వదిన నేను కేదార్ లోపలికి రాము. మీరు ధైర్యంగా జైలుకు వెళ్లండి.
అని ధాత్రి చెప్పగానే కౌషికి సరే అని పెన్‌డ్రైవ్ తీసుకుని వెళ్లిపోతుంది. చాటు నుంచి కౌషికి మాటలు విన్న యువరాజ్ జైలులో ఏమి జరగబోతుంది అని వెనకే వెళ్లి గమనించాలి అని వెళ్లిపోతాడు. మరోవైపు ధాత్రి కోపంగా అల్లుణ్ని అత్తారింటికి పంపిచే టైం వచ్చింది అని మా అమ్మ చావుత సమాధి చేసిన నిజాలను బయటకు తీసుకొచ్చి మా అమ్మ నిజాయితీని నిరూపిస్తాను అని జైలుకు బయలుదేరుతారు. మరోవైపు మీనన్ సింగ్ గెటప్ వేసుకుని జైలులోకి వెళ్లి సుధాకర్ షెల్‌లో కూర్చుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: అంబానీ పెళ్లి వేడుకల్లో మోడ్రన్ ఔట్ఫిట్స్లో సందడి చేసిన జాన్వీ కపూర్