Jagadhatri Serial Today Episode: జగధాత్రికి ఇచ్చిన గంట టైం అయిపోయిందని ఇప్పటి వరకు నెక్లెస్ ఇవ్వలేదని అందుకే ధాత్రిని అరెస్ట్ చేయమని నిషిక పోలీసులకు చెప్తుంది. దీంతో పోలీసులు ధాత్రిని అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే ధాత్రి ఇంకా గంటకు ఒక్క నిమిషం ఉందని చెప్పి తోటమాలిని అక్కడ తవ్వమని చెప్పడంతో అతను తవ్వుతుండగా అక్కడ నెక్లెస్ బాక్స్ దొరుకుతుంది. బాక్స్ తీసుకుని ధాత్రి అందులోని నెక్లెస్ తీసి టేబుల్ మీద పెడుతుంది.
ధాత్రి: ఇన్‌స్పెక్టర్ గారు టైంకి టేబుల్ మీద పెట్టాను.
ఎస్సై: కరెక్టుగా 60 నిమిషాల్లో నగ కనిపెడతా అన్నారు. కనిపెట్టి 59 నిమిషాల 59 సెకన్లలో కరెక్టుగా టేబుల్ మీద పెట్టేశారు.
నిషిక: వావ్ సూపర్ జగధాత్రి నీ రియాలిటీ షో అబ్బా ఎంత బాగా నీ కథని మా కళ్లకు కట్టినట్టు చూపించావు. ఇక్కడ నగ ఉందన్న విషయం జగధాత్రికి ఎలా తెలిసింది. తను దాచిపెట్టకపోతే కరెక్టుగా అరెస్ట్ చేస్తారు అన్నప్పుడే ఎలా బయటకు తీసింది.
ధాత్రి: ఈ నగ మీ కళ్ల ముందు పెడితే నా నిజాయితీని నమ్ముతారు అనుకున్నాను. కానీ దొంగను కనిపెడితేనే నమ్ముతారు అంటే భూమిలో దాచిన నెక్లెస్ నే తీసిన దాన్ని కళ్ల ముందు ఉన్న దొంగను పట్టించడం పెద్ద కష్టం కాదు నిషి. వదిన అక్కడ ఏమైనా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయోమో చూడండి.
కౌషికి: ఉన్నాయి.
ధాత్రి: అయితే పాతిపెట్టిన వాళ్లు మన ఇంట్లో వాళ్లే
ఎస్సై: ఎవరో బయటివాళ్లు దొంగతనం చేసి ఇక్కడ పాతి పెట్టి ఉండొచ్చు కదా?
అంటూ ఎస్సై ప్రశ్నించగానే బయటి వాళ్లు ఇంత రిస్క్ చేసి ఇక్కడ పాతిపెట్టరు అని ఇది కచ్చితంగా ఇంట్లో వాళ్లే చేశారని చెబుతూ ప్రసాదం పెట్టినప్పుడు బూచి చేతి వేళ్లకు మట్టి ఉండటం గుర్తు చేసుకున్న ధాత్రి ఈ దొంగతనంలో బూచి అన్నయ్యకు కూడా షేర్ ఉంది అనడంతో బూచి తాను నెక్లెస్‌ను పాతిపెట్టడం గుర్తు చేసుకుంటాడు.
కౌషికి: మరిది గారు మీ చేతులు ఒకసారి చూపించండి.
బూచి: అంటే వాళ్లలాగా నా చేతులు అంత అందంగా ఉండవు వదినగారు.
అనగానే కౌషికి కోపంగా బూచిని తిడుతుంది. దీంతో బూచి తన చేతులు చూపిస్తాడు. బూచి చేతులకు మట్టి ఉండటం చూసి
ధాత్రి: అన్నయ్యా మీ గోర్లకు మట్టి ఉంది అంటే
కాచి: ఏంటి మీరు అంటూ దీర్ఘాలు తీసున్నావు. ఇప్పుడాయనే ఆ గోతి తీసి నెక్లెస్ దాచాడు అంటున్నావా?
ధాత్రి: నేను చెప్పడం లేదు కాచి అక్కడ సాక్ష్యాలు చెప్తున్నాయి.
అనగానే కాచి ధాత్రిని తిట్టి లోపలికి వెళ్లిపోతుంటే కౌషికి కోపంగా నిజం చెప్పమని అడగ్గానే నిషిక అడ్డుపడుతుంది. దీంతో కౌషికి కాచి చెంపపగులగొట్టగానే బూచి భయపడతాడు అది చూసి ధాత్రి దొంగతనం ఎందుకు చేశావు అన్నయ్య అంటూ బూచిని డైరెక్టుగా అడగ్గానే బూచి నిజం చెప్తాడు.
ఎస్సై: మీరు సూపర్ మేడం... మేము ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా గంటలో పోయిన నగని కనిపెట్టేవాళ్లమే కాదు. కానిస్టేబుల్స్ అతన్ని అరెస్ట్ చేయండి.
బూచి: వదిన నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పండి వదిన. సిస్టర్ మీరైనా వద్దని చెప్పండి సిస్టర్.
కాచి: అక్కా ఆయనకు ఏం తెలియదు అక్కా. ప్లీజ్ అక్కా ఆయన్ని వదిలేయమని చెప్పు అక్క.
కౌషికి: నింద పడింది నామీద కాదు. నింద మోసింది నేను కాదు. నిజాన్ని బయట పెట్టింది నేను కాదు. అలాంటప్పుడు పోలీసులను ఆపే అధికారం నాకెక్కడిది.
బూచి: జగధాత్రి సిస్టర్ ప్లీజ్ నన్ను కాపాడండి సిస్టర్.
అనగానే ధాత్రి సరేనని కేసు వద్దని పోలీసులకు చెప్పగానే పోలీసులు వెళ్లిపోతారు. తర్వాత అందరూ వెళ్లిపోతారు. ధాత్రి, నిషిక గురించి ఆలోచిస్తుంటే ఇంతలో సాధు ఫోన్ చేసి మీనన్ గురించి అలెర్ట్ చేస్తాడు. దీంతో మీనన్ గురించి ఆలోచిస్తుంది ధాత్రి. ఘట్టమనేని అఖిలాండేశ్వరితో మీనన్‌కు డీలింక్స్ ఉండొచ్చని ధాత్రి అనుమానిస్తుంది. దీంతో అఖిలాండేశ్వరి క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మధురము కదా... రెండు అప్డేట్స్ ఇచ్చిన 'ఫ్యామిలీ స్టార్' విజయ్ దేవరకొండ