Jagadhatri Serial Today Episode: హాస్పిటల్‌లోకి వెళ్లిన కేదార్‌ డాక్టర్‌ తో తన బర్త్‌ సర్టిఫికేట్‌ గురించి మాట్లాడుతుంటాడు. యువరాజ్‌ బయటి నుంచి దొంగచాటుగా చూస్తుంటాడు. పాతికేళ్ల క్రితం బర్త్‌ సర్టిఫికెట్‌ ఇప్పుడు ఎలా దొరుకుంతుందని డాక్టర్‌ చెప్పడంతో కేదార్‌ డాక్టర్‌ ను రిక్వెస్ట్‌ చేస్తాడు. తన పుట్టుక ప్రశ్నార్థకంగా మారిందని నా బర్తు సర్టిఫికెట్‌ ఇప్పుడెంతో అవసరం అని చెప్తాడు. దీంతో డాక్టర్‌ సరే అయితే మీరు డాక్టర్‌ కృష్ణన్‌ ని కలవండి నేను చెప్తాను. అనడంతో కేదార్‌ బయటకు వచ్చి డాక్టర్‌ కృష్ణన్‌ కోసం వెళతాడు. బయటి నుంచి అంతా విన్న యువరాజ్‌ డాక్టర్‌ గెటప్‌లో ఉన్న రౌడీని పిలిచి ఇప్పుడు నువ్వు డాక్టర్‌ కృష్ణ వెళ్లి వాన్ని ఆ గదిలోకి తీసుకురా అని చెప్తాడు. మిగతా రౌడీలను పిలిచి వాడు ఆ రూంలోంచి బయటకు రాకూడదు అని చెప్పగానే అందరూ సరే అని వెళ్తారు. రౌడీ, కేదార్‌ దగ్గరకు వెళ్లి తానే డాక్టర్‌ కృష్ణన్‌ అని పరిచయం చేసుకుని కేదార్‌ను రూంలోకి తీసుకెళతాడు. మరోవైపు గాగుల్స్‌ పెట్టుకుని రూంలోకి వెళ్లిన ధాత్రి..


ధాత్రి: వదిన నన్ను ఒకసారి కాచి రూంలోకి తీసుకెళ్లవా?


కౌషికి: సరే పదా అటు..


కాచి: అమ్మా మా రూంలోకి వెళ్లారేంటి డోర్‌ కూడా క్లోజ్‌ చేశారేంటి?


నిషిక: మనం రాకూడదని వాళ్లు చేసేది చూడకూడదని..


కాచి: అసలు లోపల ఏం జరుగుతుంది.


కౌషికి: నెక్లెస్‌ పోయింది నిషిక రూంలో అయితే తీసింది నిషిక అన్న డౌట్‌ ఉంటే కాచి రూంలోకి ఎందుకు తీసుకొచ్చావు జగధాత్రి.


ధాత్రి: ఇది నిషిక ఒక్కతే చేసిన పని కాదు వదిన


కౌషికి: ఎందుకు అలా అనిపిస్తుంది.


ధాత్రి: నిషిక అప్పుడు ఆ రూంలో లేదు. కానీ నిషిక అరుపులు ఆ రూంలోంచే వినిపించాయి. అప్పుడు నేను ఆ రూంలోకి వెళ్లాను. నేను రూంలోకి వెళ్లబట్టే ఆ నేరం నా మీద మోపబడింది.


అంటూ రూం మొత్తం సర్చ్‌ చేయమని ఏమైనా డౌట్‌గా ఉంటే తనకు చెప్పమని అడుగుతుంది. రూం మొత్తం వెతికినా ఏం దొరక్కపోయేసరికి బాల్కనీలో వెతుకుతారు. అక్కడ గాజుముక్క దొరకడంతో ఈ గాజు ఎవరిదో వాళ్లే నిషికకు హెల్ప్‌ చేసి ఉంటారని కిందకు వెళ్తారు ధాత్రి, కౌషికి. మరోవైపు టెన్షన్‌గా  చూస్తున్న..


వైజయంతి: ఏందమ్మీ ఆ రూంలో  ఏం చేస్తా ఉన్నారు.


నిషిక: ఎక్కడ ఎక్కువ ఎంత సేపు ఉంటే మనకు అంత మంచిదిలే అత్తయ్యా.. దానికి టైం వేస్ట్‌ అవ్వడమే కదా మనకు కావాల్సింది కూడా..


ధాత్రి: ఈ గాజుముక్క ఎవరిది?


నిషిక: ఏంటే తమాషాగా ఉందా?


ధాత్రి: లేదు నిషి చాలా సీరియస్‌గా అడుగుతున్నాను.


నిషిక: ఇప్పుడు నీకు ఆ గాజుముక్క దొరికింది కాబట్టి వాళ్లే నెక్లెస్‌ దొంగతనం చేశారు అంటావు.. అంతేగా..


 ధాత్రి: ఎందుకు నిషి అంత భయపడుతున్నావు.


నిషిక: పిచ్చిపిచ్చిగా మాట్లాడకు నేనెందుకే భయపడతాను.


అనగానే ధాత్రి మరోసారి గట్టిగా ఈ గాజుముక్క నీదేనా కాచి అని అడుగుతుంది. కాదు అని చేతులు చూపించగానే అది కాచి గాజుముక్కే అని తెలిసిపోతుంది. దీంతో కాచి భయపడుతుంది. వెంటనే నిషిక గాజుముక్క కాచిది అయినంత మాత్రాన నెక్లెస్‌ దొంగతనం కాచి చేసింది అంటారా? అని వెనకేసుకొస్తుంది. దీంతో ధాత్రి తనను మరోసారి బాల్కనీ దగ్గరకు తీసుకెళ్లమని కౌషికికి చెప్తుంది. మరోవైపు కేదార్‌ను రూంలోకి తీసుకెళ్లిన రౌడీలు కొట్టి పడేస్తారు. యువరాజ్‌ స్టోర్‌ రూంలోకి వెళ్లి సర్టిఫికెట్‌ వెతుకుతుంటాడు. మరోవైపు బాల్కనీలోకి వెళ్లిన ధాత్రి, కౌషికి నెక్లెస్‌ కోసం వెతుకుతుంటారు. మరోవైపు స్టోర్‌ రూంలో యువరాజ్‌ కు, కేదార్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ దొరకగానే కాల్చేస్తాడు. ఇంతలో కేదార్‌ స్టోర్‌ రూంలోకి వచ్చి బర్తు సర్టిఫికెట్‌ కాలిపోవడాన్ని చూసి ఏడుస్తూ కూలబడిపోతాడు. దీంతో ఇవాళ్టీ  ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: కుమారి అక్క.. బ్రేక్ తీస్కో, మా వంటలక్క వచ్చేసింది - ఫ్యాన్స్‌కు ఆ సీక్రెట్ చెప్పేసిన డాక్టర్ బాబు