Jagadhatri Serial Today Episode: నిన్న రాత్రి ఇంట్లో ఎవరో దొంగతనం చేశారని వారిని పట్టుకోవాలని ధాత్రి అంటుంది. ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది. అందరికీ మంచి జీతాలు ఇస్తున్నాను కదా అంటుంది కౌషికి. కానీ ఎవరో కావాలనే నిన్న రాత్రి నిషిక రూంలో నెక్లెస్ దొంగతనం చేశారని ధాత్రి అనుమానిస్తుంది. అయితే నిషిక రూంలో అరిచినట్లు నువ్వు విన్నది నిజమేనా అని కౌషికి అడుగుతుంది. నేను నిషిక అరుపు విన్నాను కానీ నెక్లెస్ దొంగతనానికి ఈ అరుపుకు ఏదైనా సంబంధం ఉందేమో మనం తెలుసుకోవాలని ధాత్రి అంటుంది. దీంతో కౌషికి వాళ్లు అటువైపు రాకుండా నేను మేనేజ్ చేస్తాను మీరు వెళ్లి రూంలో ఒకసారి చెక్ చేయండి అని కౌషికి చెప్తుంది. ఇంతలో పోలీసులు వస్తారు. ఎవరు రమ్మన్నారు అని సుధాకర్ అడిగితే నిషిక తానే రమ్మన్నాను అంటుంది.
నిషిక: ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగ దొరికింది కానీ దొంగతనం చేసిన నెక్లెస్ ఇవ్వను అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిలవాల్సింది పోలీసులనే కదా మామయ్య.
కౌషికి: నువ్వు జగధాత్రి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? నీకేమైనా పిచ్చి పట్టిందా నిషి.
అనగానే నిషికి కోపంగా ఈ మాట ధాత్రికి చెప్పాల్సింది అంటుంది. ఇంతలో పోలీసులు ధాత్రిని స్టేషన్‌కు రావాలని చెప్పడంతో కేదార్ ఏ ఆధారంతో ధాత్రిని స్టేషన్‌కు తీసుకెళ్తారు అని అడగడంతో నిషిక నిన్న రాత్రి నేను లేనప్పుడు నా రూంలోకి ఎందుకు వెళ్లినట్లు అంటూ అడుగుతుంది దీంతో కౌషికి పోలీసులను వెళ్లిపోమ్మని చెప్పడంతో పోలీసులు వెళ్లిపోతారు.
కౌషికి: పోలీసులను పిలిచే ముందు నాకు ఒక్కమాట చెప్పాలని అనిపించలేదా? ఏం చేసినా చూసి చూడనట్లు ఉంటున్నాను అంటే నీకు నచ్చింది చేసుకోమని కాదు. బాధ్యత తెలుసుకుంటావని..
నిషిక: చెప్పలేదు అంటున్నారు కానీ ఎందుకు చెప్పలేదో అడగడం లేదు ఎందుకు వదిన ఎందుకో నేను చెప్పనా నేరం ఆరోపణ అయ్యింది ధాత్రి మీద కాబట్టి. నేను ఎంత చెప్పినా మీరు పోలీసులను పిలవటానికి ఒప్పుకోరు కాబట్టి.
కౌషికి: జగధాత్రి దొంగతనం చేయలేదు.
నిషిక: జగధాత్రే దొంగతనం చేసింది. అరిచినంత మాత్రానా నిజం అబద్దం కాదు.
అంటూ నిషిక కోపంగా వెళ్లిపోతుంది. దీంతో ఆ నగను ఎలా కనిపెట్టాలో నాకు బాగా తెలుసు టైం పన్నెండు అవుతుంది. వన్ కల్లా ఆ నగను టేబుల్ మీద పెడతాను అంటుంది ధాత్రి. దీంతో కౌషికి, ధాత్రి, కేదార్ కలిసి నిషిక రూంలోకి వెళ్లి రూం అంతా వెతుకుతారు. రూంలో ఏ ఆధారం దొరకలేదని అచ్చం పోలీసులు మాట్లాడుకున్నట్లు కేదార్, ధాత్రి మాట్లాడుకోవడంతో కౌషికి అనుమానిస్తుంది.
కౌషికి: మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు. మీరు స్కూల్ టీచర్స్ కదా మరేంటి పోలీసు ఆఫీసర్లలా మాట్లాడుతున్నారు. అడుగుతుంటే అలా ఉండిపోయారేం.?
ధాత్రి: అంటే వదిన సినిమాల్లో చూపిస్తారు కదా
కేదార్: నాకు తెలిసిన ఎస్సై ఉన్నారని చెప్పాను కదా అక్కా ఆయనతో క్రైం జరిగిన చోటికి వెళ్లినప్పుడు విన్నాను.
కౌషికి: ఓ చూసే ఇంత నేర్చుకున్నారంటే మీరు చాలా గ్రేట్..
అనగానే ధాత్రి సరే అంటూ లోపలికి వెళ్లి లాకర్ చెక్ చేసి ఇంట్లో వాళ్లే నెక్లెస్ తీశారని అది ప్రూవ్ చేయడానికి మీ హెల్ఫ్ కావాలని ధాత్రి, కౌషికిని అడుగుతుంది. దీంతో తానేం చేయాలో చెప్పమని కౌషికి అడుగుతుంది. దీంతో ఏం చేయాలో ధాత్రి, కౌషికికి చెప్తుంది. మరోవైపు హాల్లో కూర్చున్న నిషిక, వైజయంతి, కాచి, బూచి ధాత్రిని తిడుతుంటారు. సుధాకర్ కోపంగా అందర్ని తిట్టి ఊరుకోండని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: 'ఇష్క్' కాంబో ఈజ్ బ్యాక్... ఫ్లాప్ * ఫ్లాప్ = హిట్?