Jagadhatri  Serial Today Episode: ధాత్రి, కేదార్‌ లకు వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నానని కౌషికి చెప్తుంది. దీంతో వెంటనే అంటే ఎప్పుడు అని నిషిక అడుగుతుంది. దీంతో రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని అప్పుడే చేయాలని నిర్ణయించుకున్నట్లు కౌషికి చెప్తుంది. ఈరోజు నుంచే పనలు మొదలు పెట్టాలని చెప్తుంది. దీంతో నిషిక కోపంగా కౌషికిని తిడుతుంది.


వైజయంతి: ఒకపక్క నా కొడుకు అరెస్ట్‌ అయి పోలీస్‌ స్టేషన్‌ లో ఉంటే నువ్వు ఇంట్లో సంబరాలు చేస్తాను అంటావా?


కరుణాకర్‌: కౌషికి యువరాజ్‌ మర్డర్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు వాడిని ఎలా బయటికి తీసుకురావాలా? అని మేము ఆలోచిస్తుంటే నువ్వేంటి వీళ్ల ఇద్దరి పెళ్లి ఎలా చేయాలి? అని ఆలోచిస్తున్నావు.


 అనగానే బాబాయ్‌ యువరాజ్‌ నా తమ్ముడు వాణ్ని బయటకు తీసుకురావడం నా బాధ్యత. కానీ యువరాజ్‌ అరెస్ట్‌ కు వీళ్ల పెళ్లికి సంబంధం ఏంటి అనగానే సుధాకర్‌ వచ్చి పరిస్థితులు చక్కబడ్డాక పెళ్లి చేద్దాం అని చెప్పగానే నువ్వు తప్పు చేశావు బాబాయ్‌ అలాగని నిన్ను, యువరాజ్‌ను కాపాడుకునే బాధ్యత నాదే అని మనసులో అనుకుంటుంది కౌషికి. సుధాకర్‌ దగ్గరకు వెళ్లి ఈ పెళ్లి చేయకపోతే మన పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు అనడంతో సుధాకర్‌ మౌనంగా ఉండిపోతాడు. తర్వాత అందరూ వెళ్లిపోతారు.


ధాత్రి: వదిన నాకెందుకో ఈ పెళ్లి చేయడం కరెక్టు కాదనిపిస్తుంది.


కేదార్‌: అవును అక్కా ఇంత మందిని బాధపెట్టి మేము పెళ్లి చేసుకున్నా ఏమి ఉపయోగం. యువరాజ్‌ ఇంటికి వచ్చాక అందరి ఆశీస్సులతో చేసుకుంటాము. అయినా ఇప్పుడు మా పెళ్లికి తొందరేం వచ్చింది.


 యువరాజ్‌ ఇంటికి రావడానికి ముందే మీ పెళ్లి అయిపోవాలి అని మనసులో అనుకుని కొత్త బట్టలు ధాత్రి, కేదార్‌ లకు ఇచ్చి కౌషికి వెళ్లిపోతుంది. బట్టలు తీసుకుని రూంలోకి వెళ్లిన ధాత్రి, కేదార్‌ లు కౌషికి గురించి ఆలోచిస్తారు.   


ధాత్రి: మనల్ని ఇంట్లో నుంచి తరిమేసిన వదినలో .... మనల్ని  ఇంటికి తీసుకొచ్చిన వదినలో ఎంత మార్పు వచ్చిందో గమనించావా కేదార్‌.


కేదార్‌: అవును ధాత్రి, యువరాజ్‌ అరెస్ట్‌ అయినా అది పక్కన పెట్టి మన పెళ్లి ఎందుకు చేయడానికి పూనుకుందో అర్థం కావడం లేదు.


ధాత్రి: కుటుంబం కోరింది మాత్రమే చేసే వదిన ఇప్పుడు ఇంత మంది వద్దంటున్నా.. బాధపడతామంటున్నా  లెక్కచేయకుండా మన పెళ్లి చేస్తామనడం వెనక ఏదో బలమైన కారణం ఉంటుంది.


కేదార్‌: తీసుకున్న  నిర్ణయం మన మంచికే చేస్తున్నా.. ఈ మంచి వల్ల ఈ ఇంట్లో ఎన్ని కలహాలు వస్తాయో.. ఎన్ని మనస్పర్థలు వస్తాయోనని చాలా భయంగా ఉంది ధాత్రి.  


అనగానే అది సరే కానీ యువరాజ్‌ను మన ఆఫీసుకు తీసుకొచ్చారంట మనం వెళ్లి యువరాజ్‌ను కలవాలి అని ధాత్రి చెప్పగానే అవును మనకు ఎక్కువ టైం లేదని కేదార్‌ అంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఆఫీసుకు వెళ్తారు.


సాధు: యువరాజ్‌ను మన కస్టడీకి తీసుకొచ్చాం. వాటీజ్‌ ద ప్లాన్‌ జేడీ.


ధాత్రి: యువరాజ్‌ను అడ్డు పెట్టుకుని మనం మీనన్‌ను చేరుకోబోతున్నాం సార్‌.


సాధు: యువరాజ్‌ అరెస్ట్‌ అయ్యాడని తెలియగానే మీనన్‌ అండర్‌ గ్రౌండ్‌ కు వెళ్లిపోతాడు కదా?


ధాత్రి: మీనన్‌ ను వెతుక్కుంటూ మనం వెళ్లం సార్‌ మీననే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాం సార్‌


 అని చెప్పి మాస్కులు వేసుకుని యువరాజ్‌ ఉన్న కస్టడీ రూంలోకి వెళ్తారు. యువరాజ్‌ను ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీలో యువరాజ్‌ మీనన్‌తో తనకు సబంధం ఉందని ఒప్పుకుంటాడు. దీంతో మీనన్‌ నెక్ట్‌ ప్లాన్‌ ఏంటని అడగ్గానే రేపు పొద్దున హనుమాన్‌ జయంతి ఉత్సవాల్లో మినిస్టర్‌ను కిడ్నాప్‌ చేయబోతున్నాడని చెప్తాడు యువరాజ్‌. దీంతో కేదార్‌, ధాత్రి, సాధు దగ్గరకు వెళ్లి మినిస్టర్‌ కిడ్నాప్‌ విషయం చెప్తారు. ఇంతలో కౌషికి, కరుణాకర్‌, వైజయంతి ముగ్గురు కలిసి సాధు ఆఫీసుకు వస్తారు. వాళ్లను చూసిన కౌషికి షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: నటి హేమకు మంచు విష్ణు షాక్!‌ - 'మా' సభ్యత్వం రద్దు చేస్తూ కీలక నిర్ణయం..