Jagadhatri  Serial Today Episode:  కౌషికితో స్టేషన్‌కు వచ్చిన సూరి తను యువరాజ్‌ పై పెట్టిన కేసు  వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతాడు. దీంతో ధాత్రి, కేదార్‌ షాక్‌ అవుతారు. ఇద్దరూ కలసి ఎంత కన్వీన్స్‌ చేసినా సూరి వినడు. దీంతో ధాత్రి, కేదార్‌ సాధు దగ్గరకు వెళ్లి సూరిని ఎంత కన్వీన్స్‌ చేసినా ఒప్పుకోవడం లేదని చెప్తారు. అయితే ముందు నువ్వు కంపెనీ సీఈవో అవ్వు తర్వాత యువరాజ్‌ను మీనన్‌ కేసులో పట్టుకుందామని సాధు చెప్పడంతో సరేనని వెళ్లి యువరాజ్‌ను తీసుకురమ్మని కిరణ్‌కు చెప్తుంది ధాత్రి.


కౌషికి: ఏంటి జేడీ వాయిస్ లో బేస్‌ మారింది. ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్‌ మారింది? ఇదంతా ఏడుపే అయినా ఓడిపోయి ఏడిస్తే ఏం బాగుంటుంది చెప్పు.


ధాత్రి: కౌషికి గారు నేను నా ప్రత్యర్థులకు చెప్తూ ఉంటాను. వాళ్ల గెలుపుని నా ఓటమి అనుకోవద్దని. ఎందుకంటే నేను వెనక్కి తగ్గానని కాదు. వేటకు సిద్దమవుతున్నానని ప్రణాళిక మారుస్తున్నానని


కౌషికి: నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయినా నీకింకా పొగరు తగ్గలేదు.


ధాత్రి: మీరు అనుకున్నారు కాబట్టి యువరాజ్‌ బయటికి రావడం లేదు. నేను అనుకున్నాను కాబట్టే బయటకు వస్తున్నాడు. అయినా ఇది నా ఓటమి కాదు. గెలుపని మీకు అర్థం అయిన రోజు ఇవాళ నేను ఎందుకు ఇలా అంటున్నానో తెలుస్తుంది.


 అంటూ ఇద్దరూ ఒకరి మీద ఒకరు చాలెంజ్‌ చేసుకుంటుంటారు. ఇంతలో కిరణ్, యువరాజ్‌ను తీసుకొస్తాడు. కౌషికి, యువరాజ్‌ వెళ్లిపోతారు. తర్వాత జగధాత్రి, జేడీ ఇద్దరూ ఒకటేనని వదినకు తెలిసిన రోజు ఎలా ఉంటుందోనని భయపడుతున్నాను అంటుంది ధాత్రి. తర్వాత ఇంటికి వెళ్దాం పద అని కేదార్‌, ధాత్రి కలిసి వెళ్తారు. ఇంట్లో అందరూ మీటింగ్‌ పెట్టుకుని ఉంటారు.


కౌషికి: సూరి గారితో నేను మాట్లాడాను. యువరాజ్‌ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలన్నా? యువరాజ్‌ వల్ల ఆయనకు అయిన గాయం మానాలన్నా? మన కంపెనీకి కేదార్‌ను సీఈవో చేసి ఆ కంపెనీని తన పేరు మీదకు మార్చాలని చెప్పారు. సమస్య, సమాధానం రెండు మీ ముందే ఉన్నాయి. ఏం చేయాలో మీరే చెప్పండి.


వైజయంతి: ముందు నుయ్యి.. వెనక గొయ్యి అంటే ఎలా అమ్మీ..


నిషిక: అయినా ఈ ఇంటికి వాళ్లకు ఏం సంబంధం ఉందని మనం వాళ్లకు ఆస్థి ఇవ్వాలి. మన కంపెనీలన్నీ వాళ్ల పేరు మీద రాయాలా? ఏంటే చేసేదంతా చేసి నంగనాచిలా నుంచున్నావు.


కేదార్‌: నిషి ప్లీజ్‌ జగధాత్రిని ఏమీ అనకు. తన తప్పు ఏమీ లేదు.


నిషిక: మీ తప్పేం లేదు నాయనా? మిమ్మల్ని ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చి ఇన్ని రోజులు ఉండనిచ్చాం కదా? తప్పంతా మాదే.


ధాత్రి: నువ్వన్నట్లు నా ఉద్యేశం ఆస్థి కాజేయడమే అయితే ఆ పని చేయడానికి నేను ఇన్ని రోజులు ఆలోచించాల్సిన అవసరం లేదు.  కేదార్‌ కావాలనుకుంటుంది ఈ ఆస్థి కాదు. ప్రేమ కొడుకు అనే గుర్తింపు.


   అనగానే వైజయంతి కోపంగా ధాత్రిని తిడుతుంది. సూరిని చెప్పినట్లు చేయకుంటే పోలీసులు మళ్లీ యువరాజ్‌ ను అరెస్ట్‌ చేస్తారు. మీరేం అంటారు బాబాయ్‌ అంటూ కౌషికి, సుధాకర్‌ను అడగ్గానే కంపెనీ కోసం కొడుకుని దూరం చేసుకోలేను కదా కౌషికి అంటాడు సుధాకర్‌.  దీంతో యువరాజ్‌ ఇరిటేటింగ్‌గా కేదార్‌కు వార్నింగ్‌ ఇచ్చి వెళ్తుంటే ధాత్రి, యువరాజ్‌కు వార్నింగ్‌ ఇస్తుంది. తర్వాత కేదార్‌ను కౌషికి కంపెనీ సీఈవోగా అనౌన్స్‌ చేస్తుంది. కేదార్‌ బాండ్‌ పేపర్స్‌ మీద సంతకం చేస్తాడు. దీంతో వైజయంతి, నిషిక, కమలాకర్‌ కోపంగా వెళ్లిపోతారు. మిగతావారందరూ కేదార్‌కు కంగ్రాట్స్‌ చెప్తారు. సుధాకర్‌ వచ్చి విష్‌ చేసి వెళ్లడంతో కేదార్‌ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. తర్వాత యువరాజ్‌ ఆవేశపడుతుంటే వైజయంతి, నిషిక, కమలాకర్‌ వచ్చి ఓదారుస్తారు. కేదార్‌ ను  కంపెనీ నుంచి ఎలా వెళ్లగొట్టాలో ప్లాన్‌ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: డబుల్ ఇస్మార్ట్‘తో ‘మిస్టర్ బచ్చన్‘ క్లాష్- ఛార్మి అన్ ఫాలో, హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్