Jagadhatri Serial Today Episode: హీరోయిన్ హత్య కేసులో కేదార్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదే న్యూస్ టీవీలో వస్తుంది. వజ్రపాటి ఇంట్లో అందరూ చూస్తారు. యువరాజ్ వెటకారంగా కౌషికిని నీ బంగారు తమ్ముడు చూడు ఎవరినో చంపి జైలుకు వెళ్తున్నారు అంటాడు. సుధాకర్ అడ్డు పడితే.. మీ పేరు వాడి పేరు కలిపి టీవీలో చెప్తున్నారు అంటూ తిడతాడు. నిషిక కూడా వీళ్లిద్దరికీ ఆ కేదార్, ధాత్రిలు అంటేనే ఇష్టం అంటుంది.
కౌషికి: ఇన్ని రోజుల నుంచి కేదార్ ను చూశాం ఎప్పుడూ అలా కనిపించలేదు కదా మీరెందుకు అలా మాట్లాడుతున్నారు.
బూచి: నిజం అంత నిక్కచ్చిగా చెప్తున్నా.. మీరు నమ్మకపోతే ఎలా వదిన.
నిషిక: మన మాటలు వీళ్లు ఎప్పుడు నమ్మారు అన్నయ్యా.. అయినా ఆ టైంలో కేదార్‌కు అక్కడ పనేంటి..?
యువరాజ్: వాడు అందరినీ రోడ్డు మీద నిలబెడతాడని చెప్తే విన్నారా..?
నిషిక: మనం చెప్తే వీళ్లకు అర్థం కాదు యువరాజ్. ఏదో ఒక రోజు మనలో ఎవరిని చంపుతారో అర్థం కావడం లేదు.
సుధాకర్: తప్పు నిషి.. వాళ్లకు ఈ ఇంటితో రిలేషన్ పక్కన పెడితే.. వాళ్లకు నీకు బ్లడ్ రిలేషన్ ఉంది.
నిషిక: నమ్మాలా..? ఎలా నమ్మాలి మామయ్యా.. అప్పుడు జగధాత్రి తల్లి హంతకురాలు. ఇప్పుడు దాని మొగుడు హంతకుడు.
ఇంతలో ధాత్రి వస్తుంది. కోపంగా నిషికను తిడుతూ నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు. ఆరోజు ఈరోజు ఎవరికి తోచింది వాళ్లు నమ్మి మాట్లాడారు. అంటుంది. నిజం నీకు తెలిస్తే.. నిరూపించగలవా..? అంటూ ప్రశ్నిస్తుంది నిషిక. దీంతో కౌషికి కోపంగా ఆపండి అంటూ సాటి మనిషి కష్టంలో ఓదార్చాల్సింది పోయి ఇలా మాట్లాడతారా..? అని తిడుతుంది. ఇప్పుడే మన లాయర్ తో మాట్లాడి కేదార్‌కు బెయిల్ తీసుకురమ్మని చెప్తాను అని కౌషికి లాయర్‌కు ఫోన్ చేయబోతుంటే.. నిషిక ఆపేస్తుంది. మీరు హంతకులకు అండగా నిలబడితే మేము ఓప్పుకోము అంటుంది. ఇంతలో ధాత్రి తనకు ఎవ్వరి సాయం అవసరం లేదని వెళ్లిపోతుంది. మరోవైపు పోలీసులు కేదార్‌ను స్టేషన్ కు తీసుకెళ్తారు.
పోలీసు: ఎక్కడికి కేదార్. నీ భార్య.. నీ సతీమణి ది గ్రేట్ జగధాత్రి గారు వస్తారు కదా..? అప్పుడు లోపలికి వెళదాం.
కేదార్: నువ్వు నేను ఇలా ఎంత సేపు ఉన్నా తను రాదులే కానీ పద వెళ్దాం.
పోలీసు: అంత కచ్చితంగాఎలా చెప్పగలుగుతున్నావు.
కేదార్: తుఫాను వచ్చే ముందు.. సింహం వేటకు వెళ్లే ముందు. నా భార్య వచ్చే ముందు చాలా సంకేతాలు వస్తాయి ఆఫీసర్.
పోలీసు: మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాక కూడా నీ ధైర్యం ఏంట్రా..?
కేదార్: జగధాత్రి.. నా ధైర్యం పేరు.. నీ భయం పేరు జగధాత్రి.. నేరస్తుడిలా తీసుకొచ్చావని నువ్వు అనుకుంటున్నావు. దొరలాగా నా భార్య నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తుంది.
అని చెప్పగానే పోలీసు షాక్ అవుతాడు. వెంటనే కేదార్‌ను లోపలికి తీసుకెళ్లి సెల్ లో వేస్తారు. సాధు ఫోన్ చేసి కేదార్ ఒంటి మీద చేయి పడిందో అంటూ వార్నింగ్ ఇవ్వబోతుంటే… ఎస్సై వినిపించడం లేదు సార్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో ధాత్రి ఫోన్ చేసి కేదార్‌కు భోజనం తీసుకొస్తున్నాను అంటే వద్దని అందరిలాగే నీ భర్తకు భోజనం పెడతామని చెప్పి ఫోన్ స్విచ్చాప్ చేస్తాడు ఎస్సై. కేదార్‌కు ఎలా ఫుడ్ పెట్టాలో.. ఆ మొండి ఆఫీసర్‌కు గడ్డి ఎలా పెట్టాలో నాకు తెలుసు అనుకుంటుంది. అంతా విన్న యువరాజ్ ఇప్పుడు ధాత్రి తీసుకెళ్లే భోజనంలో పాయిజన్ కలిపి ఆ నేరం ధాత్రి మీద పడుతుంది అనుకుని స్టేషన్ తనకు తెలిసిన కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి విషయం చెప్తాడు యువరాజ్. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!