Jagadhatri  Serial Today Episode:   హీరోయిన్‌ త్రిష మేనేజర్‌ అంబులెన్స్ లో పారిపోతుంటాడు. సమాచారం తెలుసుకున్న ధాత్రి, కేదార్‌ పట్టుకోవడానికి వెళ్తారు. ఇంకొంచెం టైం అయితే నేను చేరుకోవాల్సిన డెస్టినేషన్‌ వస్తుంది అని మేనేజర్‌ మహేంద్ర మనసులో అనుకుంటాడు. ఇంతలో అంబులెన్స్‌ ఆగిపోతుంది. మళ్లీ ఏమైందిరా అంటూ డ్రైవర్‌ను కసురుకుంటాడు మహేంద్ర. అంబులెన్స్‌ ముందు ధాత్రి, కేదార్‌ ఉంటారు. వాళ్లను చూసిన మహేంద్ర షాక్‌ అవుతాడు.


ధాత్రి: హాస్పిటల్‌ ఇంకా దొరికినట్టు లేదు..


కేదార్‌: మహేంద్ర మర్యాదగా లొంగిపో.. మా నుంచి తప్పించుకోలేవు..


మహేంద్ర: ఇంకా చూస్తారేంట్రా వాళ్ల సంగతి చూడండి..


రౌడీలు: అలాగే అన్న..


అంటూ ధాత్రి, కేదార్‌ల మీదకు వెళ్తారు. రౌడీలను కేదార్‌ కొడుతుంటే ధాత్రి చూస్తుంది. కేదార్‌, రౌడీలను కొట్టడం చూసిన మహేంద్ర మరోవైపు నుంచి పారిపోవాలనుకుంటాడు. ఇంతలో ధాత్రి వచ్చి అంబులెన్స్‌ డోర్స్‌ తెరచి మహేంద్రను పట్టుకుంటుంది. పారిపోయింది చాలు ఇక పద మనం తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అంటుంది. మరోవైపు కౌషికి, సురేష్‌కు ఫోన్‌ చేస్తుంది.


సురేష్‌: హలో కౌషికి.. ఎలా ఉన్నావు కౌషికి..


దివ్యాంక: ఏంటి కౌషికి నేను సురేష్‌ కలిసి ఎంత హ్యాపీగా ఉంటున్నామో కనుక్కోవడానికి ఫోన్‌ చేశావా..? నువ్వు దూరంగా ఉన్నావు కదా చాలా హ్యాపీగా ఉన్నాము. ఏం సురేష్‌.. చెప్పు ఎందుకు ఫోన్‌ చేశావు.


కౌషికి: నేను సురేష్‌తో మాట్లాడటానికి ఫోన్‌ చేశాను.


దివ్యాంక: మనషులం ఇద్దరమేమో కానీ మనసులు ఒక్కటే.. సరేష్‌తో ఏం చెప్పాలనుకున్నా నాతో చెప్పు.. చెప్పాలనుకున్నది త్వరగా చెప్పు కౌషికి.. మేము బయటకు వెళ్లాలి.


కౌషికి: నేను ఒక ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నాను దానికి సురేష్‌ సంతకం కావాలి.


దివ్యాంక: ఏంటి సరిగ్గా వినిపించడం లేదు. 


కౌషికి: నాది ఒక ప్రాపర్టీ నా  పేరు మీద సురేష్‌ పేరు మీద కొన్నాను.. ఇప్పుడు దాన్ని అమ్మాలనుకుంటున్నాను. దానికి సురేష్‌ సంతకం కావాలి.


 దివ్యాంక: సురేష్‌ పెట్టడు..


కౌషికి: ఆ విషయం చెప్పాల్సింది సురేష్‌..


దివ్యాంక: సురేష్‌ చెప్తాడు విను..


 అంటూ దివ్యాంక కత్తి తీసుకుని తనను తాను పొడుచుకుంటానని బెదిరిస్తుంది. దీంతో సురేష్‌ ఇష్టం లేకపోయినా.. దివ్యాంక కు బయపడి ఫోన్‌ తీసుకుంటాడు.


సురేష్‌: దివ్యాంక మాటే నా మాట కౌషికి..


అని సురేష్‌ చెప్పగానే.. కౌషికి షాక్‌ అవుతుంది. మరోవైపు మహేంద్రను కస్టడీలోకి తీసుకున్న దాత్రి, కేదార్‌ స్టేషన్‌లో కూర్చోబెట్టి ఇంటరాగేషన్‌ చేస్తుంటారు.



ధాత్రి: మర్యాదగా ఏం జరిగిందో నిజం చెప్పు.. ఎందుకు హీరోయిన్‌ ను చంపావు. ఎవరు చెబితే ఇదంతా చేశావు. నీతో పాటు ఆ రోజు రూంలో ఎవరో ఉన్నారని మాకు తెలుసు. అదెవరో చెప్పు..


అని ఇంటరాగేషన్‌ చేస్తుంది. మరోవైపు మంత్రి తన బామ్మర్ది తో  త్రిపాఠికి ఫోన్‌ చేసి కస్టడీలో ఉన్న మహేంద్రను చంపితే ప్రమోషన్‌ ఇప్పిస్తానని చెప్పు అంటాడు. అదే విషయం మంత్రి బామ్మర్ధి త్రిపాఠికి ఫోన్‌ చేసి చెప్తాడు.  సరేనన్న  త్రిపాఠి ఇంటరాగేషన్‌ రూంలోకి వెళ్తాడు.


ధాత్రి: నిజం చెప్పు మహేంద్ర ఆ రూంలో ఎవరు ఉన్నారు..?


మహేంద్ర: మేడం నిజంగా నాకు ఏం తెలియదు.


త్రిపాఠి: ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను. ఎంత అడిగినా తెలియదు అంటున్నావు. నిజం చెప్పు


అంటూ కొడుతాడు. గన్‌ తీసి మహేద్రకు ఎయిమ్‌ చేస్తాడు. ఇంతలో కేదార్‌ అడ్డుగా వచ్చి త్రిపాఠిని ఆగమంటాడు. ధాత్రి కూడా త్రిపాఠి ఏం చేస్తున్నావు.. మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు.. ఇది నా కేసు నేను డీల్‌ చేస్తాను. మీరు వెళ్లండి అంటుంది. త్రిపాఠి వెళుతూ మహేంద్రను చూసి ఏంట్రా అలా చూస్తున్నావు అంటూ గన్‌ లోడ్‌ చేసి కాలుస్తాడు. ధాత్రి, కేదార్‌ షాక్‌ అవుతారు. దీంతో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!