Jagadhatri Serial Today Episode: గుడిలో పెళ్లి చేసుకుంటున్న దివ్యాంక, సురేష్ ల దగ్గరకు గన్‌తో వెళ్లిన కౌషికి కోపంగా దివ్యాంకను చంపబోతుంది. దివ్యాంక భయంతో సురేష్ వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. సురేష్ పక్కకు తప్పుకో అంటుంది కౌషికి. పక్కకు తప్పుకునే ధైర్యం నాకు ఉంది. కానీ ఆ ట్రిగర్ నొక్కే ధైర్యం నీకుందా..? అని అడుగుతాడు. అసలు నువ్వు ఇది కాదు కౌషికి అంటాడు. మరి నేను ఏంటో చెప్పు అని ప్రశ్నిస్తుంది కౌషికి. ప్రాణాల మీదకు వచ్చిన శత్రువుకైనా ప్రాణాలు ఇచ్చి కాపాడే నువ్వు ఒకరిని చంపలేవు అంటాడు. ఈ పెళ్లి కూడా నా ఇష్టంతోనే చేసుకుంటున్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు. అయితే వెళ్తాను కానీ ఇంటికి కాదు పోలీస్ స్టేసన్‌కు అని చెప్తుంది.
పంతులు: ఏమిటి ఇతగాడికి ముందే పెళ్లి జరిగిందా..?
ధాత్రి: అవును పంతులుగారు. ఈవిడే ఆయన పెళ్లాం.
పంతులు: ఏమిటి అమ్మాయి వీళ్లు చెప్తుంది నిజమా..? అమ్మో ఎంత మోసం. ఇది దొంగ పెళ్లా..
దివ్యాంక: పంతులు గారు మీరు వాళ్ల మాటలు పట్టించుకోకండి..
పంతులు: మీ ఫోటో మా పంతుళ్ల గ్రూపులో పెడతా.. విడాకుల పేపర్స్ చూపిస్తే తప్పా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎవ్వరూ పెళ్లి చేయరు.
దివ్యాంక: ఏంటి రెండో పెళ్లి చేసుకుంటున్నాను అని కంప్లైంట్ ఇస్తావా..? అసలు ఇది పెళ్లే కాదని ఫ్రూప్ చేస్తా..
కౌషికి: సురేష్ ఒక్క కారణం చెప్పి నీకు కావాల్సిన విడాకులు తీసుకుని నువ్వు వెళ్లొచ్చు.
అని వెళ్లిపోతుంది కౌషికి. సురేష్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంట్లో అందరూ కూర్చుని పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటారు. వదిన ఒక్కదాన్ని ఎదుర్కోవడమే కష్టం.. అటువంటిది పక్కన జగధాత్రి ఉంది. కచ్చితంగా పెళ్లి ఆపేసి ఉంటారు అని బూచి అనగానే అందరూ కోపంగా చూస్తుంటారు. ఇంతలో కౌషికి వాళ్లు వస్తారు. ఏమైందని అందరూ అడిగినా పలకకుండా కౌషికి వెళ్లి మంచి నీళ్లు తాగుతుంది.
నిషిక: ఏంటి ఫైర్ బ్రాండ్ టా ఊగిపోతుంది అనుకుంటే కూల్ గా వచ్చి మంచినీళ్లు తాగుతుంది. ఏంటి వదిన మేము ఇంత మందిమి అడుగుతున్నా పట్టించుకోకుంబడా వెళ్లిపోతున్నారు.
కాచి: పెళ్లి ఏమైందక్కా..
కౌషికి: ఆగిపోయింది…
నిషిక: ఆగిపోయిందా..? ఎందుకు..? అదే వదిన ఎక్కడ జరుగుతుందో తెలియని పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఎలా తెలుసుకున్నారు. ఎలా ఆపారని..
కౌషికి: ఆ క్రెడిట్ అంతా జగధాత్రి వాళ్లకు ఇవ్వాలి. పెళ్లి ఎక్కడ జరుగుతుందో వాళ్లే తెలుసుకున్నారు.
యువరాజ్: పోలీసోడు కదా..? అడ్రస్ తెలుసుకున్నాడేమో ( మనసులో అనుకుంటాడు)
తనకు హెడేక్ గా ఉందని కౌషికి రూంలోకి వెళ్లి బాధపడుతుంది. సురేష్ అన్న మాటలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది. తమ రూంలోకి వెళ్లిన కేదార్ ఇవాళ నా పని అయిపోయింది అని రిలాక్స్ అవ్వగానే.. ధాత్రి నవ్వుతూ కేదార్‌కు షర్ట్ గిఫ్టుగా ఇస్తుంది. తర్వాత కేదార్‌ను తీసుకుని బయటకు వెళ్తుంది ధాత్రి.
కేదార్: ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకపోవడం దారుణం.
ధాత్రి: దీన్ని దారుణం అనరు.. సర్‌ప్రైజ్ అంటారు.
కేదార్: ఇక్కడ నువ్వు నాకిచ్చే సర్‌ఫ్రైజ్ ఏంటి.. ఏంటి ధాత్రి రొమాంటిక్ గా ఏమైనా ప్లాన్ చేశావా..?
ధాత్రి: ఆపు ఇక్కడే..
కేదార్: ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు..
ధాత్రి: ఒకసారి అటు చూడు ఎలా ఉంది సర్‌ఫ్రైజ్..
కేదార్: చాలా బాగుంది.. మనం ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మనం ఇక్కడే బైక్స్ పార్క్ చేసే వాళ్లం.
అంటూ ఇద్దరూ హోటల్ లోకి వెళ్లి గత స్మృతులను గుర్తు చేసుకుంటారు. ఒకరికికొకరు గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతారు. తర్వాత ప్లవర్ ఇస్తూ ధాత్రి, కేదార్‌కు ప్రపోజ్ చేస్తుంది. కేదార్ ఎమోషనల్ అవుతాడు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!