Jagadhatri  Serial Today Episode : మేఘన బొద్దింకను చూసి భయంతో సోఫా ఎక్కి కింద పడబోతుంటే.. కేదార్‌ పట్టుకోవాలని చూస్తాడు. ఇంతలో ధాత్రి పట్టుకుంటుంది. మేఘన కళ్లు మూసుకుని బొద్దింక అని అరుస్తుంటే.. ధాత్రి వెళ్లిపోయింది ఇక దిగండి అంటుంది. కళ్లు తెరచి చూసిన మేఘన తాను కేదార్‌ చేతుల్లో కాదు.. ధాత్రి చేతుల్లో ఉన్నాననుకుని విసుగ్గా దిగుతుంది.

Continues below advertisement


కేదార్‌: మా జేడీకి ఎలకంటే భయం ఉన్నట్టు నీకు బొద్దింకంటే భయమా..? సరిపోయింది.


సాధు: ఏంటి..? జేడీ నీకు ఎలకంటే భయమా..?


ఐజీ: మీనన్‌ను బయపెట్టే జేడీకి ఎలకంటే భయమా..? వినడానికి చాలా విచిత్రంగా ఉందే..?


కేదార్‌: సరే సార్‌ మేమిక వెళ్తాం..


మేఘన: కేడీ ఫైల్‌ మర్చిపోయారు..


అని ఫైల్‌ ఇచ్చి నవ్వుతుంది మేఘన. ఇంతలో బామ్మ ఏంటే జాతకం నిజమని నమ్ముతావా..? అని అడుగుతుంది. ఆ జాతకం ఇంత అందంగా హైట్‌గా ఉంటే ఎందుకు నమ్మను బామ్మ కచ్చితంగా నమ్ముతాను అని చెప్తుంది. అయితే అబ్బాయి నచ్చినట్టేనా అని బామ్మ అడుగుతుంది. దీంతో వాళ్లతో పాటు వెళ్లు అని చెప్తుంది. సరే అంటూ మేఘన వెళ్తుంది.


సాధు: ఓకే గాయ్స్‌ ఈ ఆపరేషన్‌ కోసం సీనియర్‌కు ఆబద్దం చెప్తున్నాం. ఫ్లీజ్‌ దీని వల్ల మన యూనిట్‌కు చెడ్డపేరు రాకుండా చూసుకోండి.


ధాత్రి: ఓకే సార్‌


సాధు: భార్యాభర్తలు అయ్యుండి ఇలా సీనియర్‌, జూనియర్‌గా ఉండటం కష్టమని తెలుసు. కానీ ఆఫరేషన్‌ అయ్యే వరుక ప్రాబ్లమ్‌ అవ్వకుండా చూసుకోండి.


కేదార్‌: సరే సార్‌..


సాధు: కేడీ థాంక్యూ ఎప్పటి నుంచో పరిచయం చేయమని అడుగుతున్న జగధాత్రిని ఈరోజు పరిచయం చేసినందుకు


కేదార్‌: అర్థం కాలేదు సార్‌.


సాధు: పక్కన అడుగు..


కేదార్‌: సాధు సార్‌..


ధాత్రి: ఆ సార్‌.. ఏంటి చేసిందంతా చేసి మళ్లీ అర్థం కానట్టు అడుగుతున్నావా..?


కేదార్‌: అరే నిజంగా అర్థం కాలేదు ధాత్రి.


ధాత్రి: అవునా అర్తం అయ్యేలా నేను చెప్తాను. ఇటురా చెప్తాను.


కేదార్‌: ధాత్రి.. ఫ్లీజ్‌ ఇక్కడ వద్దు..


ఇంతలో లోపలి నుంచి మేఘన వస్తుంది.


మేఘన: కేడీ.. నా కారు ట్రబుల్‌ ఇచ్చింది. నన్ను జిమ్‌ వరకు డ్రాప్‌ చేస్తారా..? ఫ్లీజ్‌ కేడీ.. ఫ్లీజ్‌ కేడీ..


కేదార్‌: సరే..


మేఘన: సరే రెండు నిమిషాల్లో రెడీ అయి వస్తాను.


కేదార్‌: ఆమె ఐజీ కూతురు వద్దని ఎలా అనగలం..


ధాత్రి: అవునులే.. పైన కిస్‌ ఇచ్చింది. ఇక్కడేమో చేయి పట్టుకుంది. ఇక తమరు నో అని ఎలా అంటారు. నువ్వు నడుచుకుంటూ డ్రాప్‌ చేయ్‌..


కేదార్‌: ధాత్రి మరీ చిన్నపిల్లలా చేయకు..


ధాత్రి: ఆహా అవునా సార్‌  మీరు చాలా పెద్దరికంతో పనులు చేస్తున్నారు కదా..? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా టూత్‌పేస్ట్‌ యాడ్‌లో యాక్ట్‌ చేసేవాడిలా అలా నవ్వుతూనే ఉన్నావు.


కేదార్‌: అయ్యో ఏంటి సాటి మనిషిని చూసి నవ్వడం కూడా నేరమేనా..?


ధాత్రి: ఆ.. భార్య పక్కనుండగా ముద్దు పెట్టిన అమ్మాయిని చూసి నవ్వడం నేరమే..?


మేఘన: కేడీ పద పద.. వెళ్దాం..


అంటూ వెళ్లి కారులో ముందు సీట్లో కూర్చుంటుంది మేఘన. ధాత్రి అలిగి అక్కడే ఆగిపోతుంది. దీంతో కేదార్‌ ఇప్పుడెలా అనుకుంటాడు. ధాత్రి దగ్గరకు వెళ్లి ఈ ఒక్కసారి వెనక కూర్చో అంటాడు. ఆ సీట్‌ నాది నేను వెనక కూర్చోను అంటుంది. దీంతో మేఘన దగ్గరకు వెళ్లి వెనక కూర్చో అని చెప్తాడు కేదార్‌. మేఘన కూడా కూర్చోను అంటుంది. దీంతో ఎంతైనా ఆవిడ మన సీనియర్‌ ఆవిడకు మనం రెస్పెక్ట్‌ ఇవ్వాలి అని చెప్పగానే మేఘన వెనక్కి వెళ్తుంది. తర్వాత వెళ్లిపోతారు. ఇంటికి వచ్చిన ధాత్రికి బూచి అనుమానంగా ఫోన్‌ మాట్లాడం కనిపిస్తుంది. అదే విషయం కేదార్‌కు చెప్తుంది. దాత్రి. కేదార్‌, బూచిని ఫాలో అవుతాడు. బూచి గర్ల్‌ఫ్రెండ్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది.


  50 లక్షలు ఇవ్వకపోతే నీ వీడియో నెట్‌లో పెడతానని బెదిరిస్తుంది. దీంతో ఎలాగైనా తనకు 50 లక్షలు ఇవ్వాలనుకుంటాడు బూచి. తర్వాత సుధాకర్‌ 50 లక్షలు తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్‌ చేయమని కౌషికికి చెప్తుంటే.. నేను చేస్తాను అంటూ బూచి వెళ్తాడు. అంతా గమనించిన ధాత్రి.. కేదార్‌తో అన్నయ్య ఏదో తప్పు చేస్తున్నాడని.. డబ్బులు బ్యాంకులో డిపాజిట్‌ చేయడని అనుమానిస్తుంది. మరోవైపు డబ్బులు తీసుకెళ్లి తన గర్ల్‌ఫ్రెండ్ కు ఇస్తాడు బూచి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!