Jagadhatri Serial Today Episode: వజ్రపాటి గ్రూప్ ఆప్ బోర్డు మెంబర్స్ కౌషికి దగ్గరకు వస్తారు. కౌషికి కేసులో ఇరుక్కున్నావు కదా అందుకే నీ స్థానంలో కంపెనీ చైర్మన్‌గా ఎవరిని నియమిస్తావో చెప్పాలని అడుగుతారు. దీంతో కేదార్, ధాత్రి ఎక్కడికి వచ్చి ఎవరిని ఏం అడుగుతున్నారో తెలుసా? అంటారు. ఇంతలో యువరాజ్ అడ్డుపడి.. అప్పుడు నేను తప్పు చేశానని నన్ను సీఈవోగా తప్పించారు. మీరు అప్పుడు కంపెనీ కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా కంపెనీ కోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటాడు. దీంతో కౌషికి తన పదవికి రిజైన్ చేస్తానంటుంది. ఇంతలో ధాత్రి, వద్దని 24 గంటలు టైం తీసుకోమని అప్పటి వరకు నీ మీద కేసు లేకుండా చూస్తామని చెప్తారు. దీంతో బోర్డు మెంబర్స్ వెళ్లిపోతారు. తర్వాత కౌషికి అందరూ అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది.
ధాత్రి: వదిన అక్కడ ఉంది.
కేదార్: అక్కని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు ధాత్రి.
ధాత్రి: పదవి కోసం ఆస్థి కోసం వదిన మనసు విరిచేశారు. పద వెళ్లి మాట్లాడుదాం.. వదిన
కౌషికి: అనవసరంగా బెయిల్ తీసుకుని బయటకు వచ్చాను అనిపిస్తుంది జగధాత్రి. లోపలే ఉండి ఉంటే ఇదంతా వినే దాన్ని కాదు. అయినా ఇదంతా చేస్తుంది ఎండీ పోస్టు కోసమే కదా? అది కావాలని అడిగితే ఆనందంగా ఇచ్చేసేదాన్ని.
ధాత్రి: వదిన ఇక్కడ విషయం పదవి కావాలంటే ఆశపడితే సరిపోదు. అర్హత ఉండాలి. ఆ అర్హత మీ ఒక్కదానికే ఉంది.
కేదార్: అవునక్క అది కంపెనీలో అడిగే వాచ్‌మెన్ ను అడిగినా చెప్తారు.
ధాత్రి: ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడేది మనమే కాదు వదిన కంపెనీలో పని చేస్తున్న ఎన్నో కుటుంబాలు బాధపడతాయి.
కౌషికి: కానీ 24 గంటల్లో ఏం అద్భుతం చేయగలం జగధాత్రి. నేను మామయ్యగారిని చంపలేదని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు.
అంటూ కౌషికి బాధపడుతుంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని ఎలాగైనా నిరూపిద్దామని ధాత్రి, కేదార్.. కౌషికికి మనోధైర్యం ఇస్తారు. తమ ఇన్వెస్టిగేషన్ భూపతి నుంచి మొదలుపెట్టాలని వెళ్తారు. మరోవైపు భూపతి తాగుతూ ఉంటాడు. అక్కడికి వెళ్లిన ధాత్రి, కేదార్ భూపతిని ప్రశ్నిస్తారు. పరంధామయ్యను అందరి ముందు చంపుతానని చాలెంజ్ చేశావని ఆయన చనిపోయిన రోజు మీరు సిటీ నుంచి రౌడీలను కూడా పిలిపించారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అని అడగ్గానే భూపతి భయపడతాడు. నేను మనుషులను తీసుకుని వచ్చిన మాట నిజమేనని కానీ మేము అక్కడికి వెళ్లే సరికే పరంధామయ్యను ఎవరో పొడిచేశారని చెప్తాడు.
ధాత్రి: ఏంటి మీరు వెళ్లే సరికే ఆయన్ని ఎవరో పొడిచేశారా?
భూపతి: అవును మేడం..
కేదార్: అప్పుడు అక్కడ కౌషికి గారు ఉన్నారా?
భూపతి: నేను చూసినప్పుడు అయితే అక్కడ ఎవ్వరూ లేరు.
ధాత్రి: రమ్య అసలైన హంతకుడు దొరికే వరకు ఇతన్ని మన కస్టడీలోనే ఉంచండి.
కేదార్: ధాత్రి.. మామయ్యను భూపతి చంపలేదు. ఇంక చంపాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. బయటి నుంచి వచ్చినట్టు ఆధారాలు లేవు.
ధాత్రి: ఆరోజు రాత్రి భూపతి రాకముందు అక్కడ ఏదో జరిగింది కేదార్. అసలు ఆరోజు వదిన నిద్ర లేచినప్పటి నుంచి ఏం జరిగిందో క్లియర్ గా తెలుసుకుంటే మనకు ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది.
కేదార్: అవును ఇప్పుడే వెళ్లి అక్కను కలుద్దాం.
అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైప డైనింగ్ టేబుల్ దగ్గకు వచ్చిన అందరూ కౌషికిని మనసు బాధపడేటట్లు మాట్లాడుతుంటారు. ఇంతలో అక్కడికి ధాత్రి, కేదార్ వస్తారు. వాళ్లను చూసిన అందరూ షాక్ అవుతారు. సెక్షన్ల గురించి చెప్పి వైజయంతి, కమలాకర్, యువరాజ్ లను భయపెడతారు. తర్వాత కౌషికిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆరోజు రాత్రి ఏం జరిగిందో పిన్ పాయింటెడ్‌గా చెప్పండని అడుగుతారు. కౌషికి జరిగింది చెప్తుంటే యువరాజ్ టెన్షన్ పడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ప్రియా ప్రియా అందంతో చంపొద్దే... మళ్లీ మళ్లీ టాటూలు చూపిస్తూ ముంచొద్దే