Guppedanta Manasu  Serial Today Episode:  మహేంద్ర, రిషిని ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు.  దీంతో తనను కాపాడిన వ్యక్తి దగ్గరకు వెళ్లానని చెప్తాడు. మరోవైపు రంగాగా నటిస్తున్నది రిషినేనని క్లారిటీకి వస్తారు శైలేంద్ర, దేవయాని. అయితే మను నిజం తెలిసినా ఏం చేయట్లేదని అసలు నిజానిజాలు తెలుసుకుందామని శైలేంద్ర, మహేంద్ర ఇంటికి వస్తాడు. దీంతో  నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని శైలేంద్రను అడుగుతాడు రిషి. దీంతో  బాబాయ్ ఎలా ఉన్నాడో.. అస‌లు ఉన్నాడో లేదో చూద్దామ‌ని వ‌చ్చాన‌ని శైలేంద్ర బ‌దులిస్తాడు. రిషి షాక్‌ అవుతాడు. పర్సనల్‌ గా మాట్లాడాలని రిషిని పక్కకు తీసుకెళ్తాడు శైలేంద్ర.


శైలేంద్ర: నీ గురించి ఎంక్వైరీ చేయ‌డానికి మీ ఊరికి వెళ్లాను. స‌రోజ‌ను కూడా కలిశాను. నేను మీ ఊరికి రావడానికి ముందే వసుధార నీ దగ్గరకు వచ్చిందని తెలసింది. అసలు వసుధార ఫోటో చూసి కూడా ఆరోజు ఎందుకు తెలియదని చెప్పావు. నువ్వు నిజంగానే రిషివా? నువ్వు వ‌సుధార క‌లిసి నా ముందు రంగాగా డ్రామాలు ఆడుతున్నారా?


   శైలేంద్ర‌కు పాండు ఫొటో చూపిస్తాడు రిషి.


రిషి: ఈ రౌడీ గ్యాంగ్‌ వసుధార ను చంప‌బోతుంటే నేను కాపాడాను. ఆ త‌ర్వాత అదే రౌడీ గ్యాంగ్ న‌న్ను చంప‌బోతే వ‌సుధార నన్ను సేవ్ చేసింది. నువ్వు వ‌సుధార ఫొటో చూపించిన‌ప్పుడు నీ వ‌ల్ల ఆమె ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంద‌ని భావించి అలా అబ‌ద్ధం ఆడాను.


శైలేంద్ర: ఆ త‌ర్వాత అయినా వ‌సుధార‌తో ప‌రిచ‌యం ఉంద‌నే నిజం నా ద‌గ్గ‌ర ఎందుకు దాచావు.


రిషి: నువ్వు అడ‌గ‌లేదు..నేను చెప్ప‌లేదు. అయినా ప్రతిసారి నన్ను అనుమానించడం కరెక్టు కాదన్నయ్య.  అయినా నువ్వు ఎండీ సీట్ కోసం ఎన్నో కుట్ర‌లు చేశావ‌ట. జ‌గ‌తిని చంపావట.. ( శైలేంద్ర టెన్ష‌న్‌తో వ‌ణికిపోతుంటాడు.) త‌ప్పుల‌న్నీ మీవైపు పెట్టుకొని న‌న్ను ఎలా అనుమానిస్తావు. రిషిలా న‌టించ‌డానికి నేనొ‌చ్చానా? మీరే న‌న్ను తీసుకొచ్చారా?


 అంటూ  రిషి నిల‌దీయ‌డంతో శైలేంద్ర సెలైంట్ అవుతాడు.  ఇంకోసారి న‌న్ను అనుమానిస్తే చెప్పకుండా వెళ్లిపోతాన‌ని శైలేంద్ర‌ ను బెదిరిస్తాడు రిషి. దీంతో శైలేంద్ర వీడు రిషి కాదు రంగానే అని మనసులో అనుకుంటాడు. నేనే భ్రమపడ్డానని కూల్‌ అవుతాడు. ఇంతలో శైలేంద్రకు ఫోన్‌ వస్తుంది. పక్కకు వెళ్లి ఫోన్‌ లిఫ్ట్‌ చేసి ముఖం గుర్తుందిగా ఈసారి టార్గెట్ మిస్సవ్వొద్దు. అని చెప్పి వెళ్లిపోతుంటే.. శైలేంద్ర మనిషి గన్‌ తో మహేంద్రను షూట్‌ చేస్తాడు. కానీ రిషి మహేంద్రను సేవ్‌ చేస్తాడు. తన ప్లాన్‌ పెయిల్‌ కావడంతో శైలేంద్ర ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు. పైకి మాత్రం కంగారుపడ్డట్టు నటిస్తాడు. మహేంద్రపై దాడి విషయం తెలుసుకున్న ఫణీంద్ర మహేంద్ర ఇంటికి వస్తాడు. మహేంద్రను చూసి భాదపడతాడు.


ఫణీంద్ర: రిషి వ‌చ్చాడు, క‌ష్టాల‌న్నీ తీరిపోయాయ‌ని అనుకునే టైమ్‌లో మ‌ళ్లీ ఈ ఎటాక్‌లు ఏంటి? ఈ సంఘ‌ట‌న‌పై వెంట‌నే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం.


శైలేంద్ర: ఈ మాత్రం దానికి పోలీస్‌ కంప్లైంట్‌ ఎందుకు డాడ్ వాడెవడో నేను చూసుకుంటాను కదా?


రిషి: అవును పెద్దనాన్న పోలీస్‌ కంప్లైంట్‌ ఏమీ వద్దు మేము చూసుకుంటాం.  


మహేంద్ర: నా ప్రాణం తీయాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉంది.


రిషి: మీరేం భయపకండి డాడ్‌..


వసుధార: ఇదంతా ఎవ‌రు చేశారో నాకు తెలుసు..!


 అంటూ బయటకు వెళ్లిపోతుంది. రిషి పిలిచినా ఆగకుండా వసుధార వెళ్లిపోవడం చూసి ఫణీంద్ర, మహేంద్ర షాక్‌ అవుతారు. మరోవైపు తన ప్లాన్‌ బెడిసికొట్టడంతో శైలేంద్ర, సరోజకు ఫోన్‌ చేసి రంగా నీకు దూరం కావడానికి కారణం వసుధార అని చెప్తాడు. నేను ఒక ప‌నిమీద రంగాను ఇక్క‌డికి తీసుకొస్తే...వ‌సుధార ట్రాప్ చేసి త‌న‌తో పాటు రంగాను తీసుకెళ్లిపోయింద‌ని స‌రోజ‌ను న‌మ్మిస్తాడు. వ‌సుధార అడ్రెస్ స‌రోజ‌కు ఇస్తాడు శైలేంద్ర. దీంతో సరోజ వసుధారపై కోపంతో రగిలిపోతుంది.


    మరోవైపు మను దగ్గరకు వెళ్లిన వసుధార, మహేంద్రను ఎందుకు చంపాలనుకున్నావని నిలదీస్తుంది. దీంతో మను నేనేం అటాక్‌ చేయలేదని అసలు ఆయనను చంపాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నిస్తాడు మను. అయితే మహేంద్ర నీ కన్నతండ్రి అన్న విషయం తెలిసినందుకే నువ్వు చంపబోయావు అని వసుధార చెప్పబోయి అగిపోతుంది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో కూడా వసుధార నిజం దాచిపెడుతుందని మను కోపంతో రగిలిపోతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.