Jagadhatri Serial Today Episode: కౌషికికి ఇంట్లో వాళ్లతో ప్రమాదం ఉందేమోనని కేదార్‌కు చెప్తుంది ధాత్రి. వదిన ప్రెగ్నెంట్ కావడం వైజయంతికి, నిషికకు ఇష్టం లేనట్లుందని ఆమెకు అబార్షన్ అయ్యేందుకు వాళ్లు చాలా ట్రై చేస్తున్నారని చెప్తుంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌట్ గానే ఉంది. కానీ అక్క ప్రెగ్నెంట్ అయితే వాళ్లకు వచ్చిన నష్టం ఏంటి ధాత్రి.. అని కేదార్ అడగ్గానే వదిన మీద ఎంత కోసం ఉన్నా కడుపులో ఉన్న బిడ్డను కడుపులోనే చంపాలనుకుంటున్నారు. అని ధాత్రి చెప్పడంతో కేదార్ షాక్ అవుతాడు. అయితే ఇప్పటి నుంచి మనలో ఎవరో ఒకరం అక్క పక్కనే ఉండాలని చెప్తాడు. తర్వాత యువరాజ్, కమలాకర్ లను అనుమానిస్తుంది ధాత్రి. వాళ్లేం చేయడానికి ఈ ఊరొచ్చారో తెలియదు కానీ వాళ్ల పని మాత్రం జరగనివ్వకూడదు అనుకుంటారు. తర్వాత పరంధామయ్య, ఆదిలక్ష్మీ పెళ్లికూతురు, పెళ్లి కొడుకు గెటప్‌లో వచ్చి పీట మీద కూర్చుంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు.
యువరాజ్: బాబయ్ నేను వెళ్లి విగ్రహాన్ని వెతుకుతాను. ఎవరైనా వస్తుంటే నాకు కాల్ చేయ్.
కమలాకర్: అలాగే యువరాజ్..
కౌషికి: బొట్టు పెట్టండి మామయ్య గారు.
కేదార్: తీసుకోండి..
ధాత్రి: కమాన్ పిన్ని గారు వేయండి..
యువరాజ్ లోపల విగ్రహాన్ని వెతుకుతుంటాడు. మరోవైపు అందరూ షష్టిపూర్తి వేడుకలో హ్యాపీగా ఉంటారు.
ధాత్రి: పిన్ని గారు ఈ రింగ మాత్రం ముందు మీరే తీయాలి.
కేదార్: ఏంటి తీసేది. మామయ్య గారు. మీరు అస్సలు తగ్గొద్దు. రింగును కూడా వదలొద్దు.
భాగ్యలక్ష్మీ: అమ్మా నాన్న చేతిలో ఉన్నా కూడా సరే తీసేసుకో.. సరేనా..
ధాత్రి: సరే వేస్తున్నాను..
అని ధాత్రి రింగ్ వేయగానే ఆదిలక్ష్మీ తీస్తుంది. దీంతో ధాత్రి, కౌషికి హ్యాపీగా ఉంటారు. సరే మరోసారి ఉంది కదా అంటాడు పరంధామయ్య. రెండో సారి పరంధామయ్య గెలుస్తాడు. మూడుసారి ఆదిలక్ష్మీ గెలుస్తుంది. తర్వాత ఆదిలక్ష్మీ అందరికీ భోజనాలు రెడీ చేయమని సురేష్‌కు చెప్తుంది. పరంధామయ్య తాను బట్టలు మార్చుకుంటానని పైకి వెళ్తాడు. దీంతో కమలాకర్, యువరాజ్‌కు ఫోన్ చేసి పరంధామయ్య వస్తున్నాడని చెప్పడంతో యువరాజ్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. తర్వాత పరంధామయ్య కిందికి రావడం చూసి
నిషిక: ఏంటత్తయ్యా ఈ నవ్వులు, ఈ సంతోషాలు అంతా నిజమేనా? లేక నాటకమా?
వైజయంతి: నాటకం కాకపోతే ఇంకేంటి అమ్మీ. ఇన్నేళ్లు విడిగా ఉన్నారంటా? ఇప్పుడు కౌషికి నెల తప్పిందంటా? ఇదంతా నాకేమీ సరైన యవ్వారంలా అనిపించడం లేదు.
కాచి: అక్క బావ ముఖం చూస్తేనే మండి పడేది. అలాంటిది ఇద్దరు కలిసిపోయారంటే నమ్మబుద్ది కావడం లేదు పెద్దమ్మ.
నిషిక: అయినా కడుపు అనగానే అన్నయ్య వాళ్ల అమ్మానాన్న అంత సంబరపడిపోయారేంటి? అసలు అది ఎలా సాధ్యం అన్న ఆలోచన కూడా రాలేదా? అత్తయ్య వాళ్లకి.
వైజయంతి: ఎందుకు వచ్చి ఉండదు అమ్మీ బయట పెట్టి అడిగితే పరువే పోతుందనుకున్నారో.. ఆస్థే పోతుందనుకున్నారో..
అందరూ కలిసి పరంధామయ్యకు అనుమానం వచ్చేలా మాట్లాడతారు. మెట్ల మీద నిలబడి అంతా విన్న పరంధామయ్య ఇరిటేటింగ్ గా ఫీలవుతాడు. కోపంగా కిందకి వస్తూ.. కౌషికిని కోపంగా చూస్తుంటాడు. మరోవైపు అందరూ కలిసి పాటలు పెట్టుకుని డాన్సులు చేస్తుంటారు. మరోవైపు పైన కూర్చుని కోపంగా మందు తాగుతుంటాడు పరంధామయ్య. నిషిక, వైజయంతి మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకుంటూ కిందకు వస్తాడు. తాగొచ్చిన పరంధామయ్యను చూసి అందరూ షాక్ అవుతారు.
నిషిక: ఏంటత్తయ్యా మనం అంటించిన నిప్పు అగ్నిపర్వతంలా బద్దలవుతుందనుకుంటే.. ఇలా మందు తాగొచ్చి సైలెంట్ గా ఉన్నాడు.
వైజయంతి: అది సునామి ముందు ఉండే నిశ్శబ్దం అమ్మి. ఇక మందంటావా? చుక్క లోపలికి పోతేనే మాట బయటకు వచ్చేది. నువ్వు చూస్తా ఉండు.
కౌషికి: ఏమైంది మామయ్య ఎవరైనా ఏమైనా అన్నారా? మీరొచ్చి కూర్చోండి మాట్టాడుకుందాం.
పరంధామయ్య: ముట్టుకోకు నా ఇంట్లోంచి బయటకు పో..
అంటూ కౌషికికి వార్నింగ్ ఇవ్వడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో వైజయంతి, నిషిక హ్యాపీగా ఫీలవుతారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ధాత్రి అడగ్గానే పరంధామయ్య, కౌషికిని ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పు అని ఆదిలక్ష్మీకి చెప్పగానే ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఆ హీరోను పొట్టోడా అంటే కోపం వచ్చేది, వాళ్లకు నాకు తిక్క ఉందిలాంటి డైలాగులే నచ్చుతాయి: హరీష్ శంకర్