Jagadhatri  Serial Today Episode: వైజయంతి కోపంగా ఆదిలక్ష్మీ, భాగ్యలక్ష్మీలను తిడుతుంది. అయితే రెండు రోజుల్లో అమ్మా నాన్నా షష్టి పూర్తి వదిన అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాము. అనగానే కౌషికి ఏంటిది కొత్తగా బయటకు వెళ్లండి. మీరు ఇంట్లోంచి వెళ్లగొట్టినా నేను నా కూతురు బాగానే ఉన్నాము అంటూ తిడుతుంది కౌషికి. వైజయంతి కూడా మా కౌషికికి మీ అవసరం లేదని చెప్తుంది.


భాగ్యలక్ష్మీ: ఏంటి అన్నయ్యా అలా నిల్చున్నావు. ఒకసారి వదినతో మాట్లాడు. నాన్నను క్షమించమని చెప్పు.


సురేష్‌: ఆరోజు నాన్న నన్ను మాట్లాడనివ్వకుండా ఆపి. జీవితాంతం మూగవాణ్ని చేసేశాడు అమ్మా… మన వల్ల తప్పు జరిగింది భాగ్య. జీవితాంతం శిక్ష అనుభవించక తప్పదు.


నిషిక: అన్నయ్య, వదిన వద్దని వెళ్లిపోమ్మని చెప్పారు కదా? ఇంకా ఇక్కడే ఉన్నారేం వెళ్లండి.


ధాత్రి: నిషి పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు పద్దతి తప్పి మాట్లాడకూడదు.


యువరాజ్‌: పద్దతా? వాళ్లు పద్దతిగా మా అక్కతో మాట్లాడారా? పద్దతితోనే మా అక్కతో ప్రవర్తించారా?


కేదార్‌: గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ఆ గతంలోనే ఉండిపోతాము యువరాజ్‌.


అని కేదార్‌ చెప్పగానే భాగ్య, కౌషికి దగ్గరకు వెళ్లి చేతులు పట్టుకుని అన్ని మర్చిపోయి కలిసుందామని బతిమాలుతుంది. దీంతో వైజయంతి భాగ్యను తిడుతుంది. ఇంతలో ధాత్రి అసలు ఏం జరిగింది వదిన అని అడుగుతుంది. అప్పుడు కౌషికి తన అత్తగారింట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది.


కేదార్‌: జరిగింది ఇదే అయితే బావ నువ్వు ఎందుకు విడిపోయారు అక్క. బావ చేయని తప్పుకు బావను ఎందుకు దూరం చేసుకున్నావు.


సురేష్‌: కౌషికి చేయి పట్టుకునే అర్హత నేను కోల్పోయాను కేదార్. కౌషికికి అవసరం ఉన్నప్పుడు నేను తన చేయి పట్టుకోలేకపోయాను. తనని మా నాన్న నుంచి కాపాడలేకపోయినందుకు.


  అని ఆరోజు తమ ఇంట్లో జరిగిన సంఘటన గురించి వివరిస్తాడు సురేష్‌. వాళ్ల నాన్న కౌషికిని ఇంట్లోంచి గెంటివేసిన రోజు నేను ఏం చేయలేకపోయానని చెప్తాడు.


యువరాజ్: కోపం వచ్చినప్పుడు రమ్మని.. ప్రేమ రాగానే రమ్మంటే రావడానికి మా అక్క ఏమైనా ఆటబొమ్మా? వాళ్లు చెప్పినట్లు చేయాలా?


కమలాకర్‌: ఆరోజు మీ ఆయన చేసిన పని ఇవాళ మేము చేయలేము. అందుకే మాటలతో చెప్తున్నాము వెళ్లిపోండి.


ధాత్రి: అందరూ చెప్తుంది కరెక్టే వదిన. న్యాయంగా అయితే మీరు వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ


బూచి: అమ్మో కానీ అంది అంటే ప్లేట్‌ పిరాయించింది.


ధాత్రి: పంతాలు వదిలితేనే కదా వదిన బంధుత్వాలు నిలిచేది.


కేదార్‌: ఒకరు చేసిన చిన్న తప్పు వల్ల ఇన్ని రోజులు మీరందరూ బాధపడింది చాలు. ఆ తప్పును దాటి వాళ్ల ప్రేమను చూడక్కా?


ధాత్రి: మీరు ఒప్పుకోరని తెలిసినా.. ఈ ఇంట్లోకి ఆహ్వానం ఉండదు. అవమానం ఎదురవుతుందని తెలిసినా.. షష్టి పూర్తికి పిలవడానికి వచ్చారు వదిన. మీరేం నిర్ణయం తీసుకున్నా మేమంతా మీ వెనకే ఉన్నాము.


సుధాకర్‌: అవునమ్మా.. ఆ మనిషి ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు కానీ సురేష్‌ తండ్రి. ప్రేమగా వెళ్లకపోయినా పర్వాలేదు. బాధ్యతగా వెళ్లు.


ఆదిలక్ష్మీ: తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికి పడింది. తలరాత అని ఊరుకున్నాను. ఏనాడు కూడా నాకు ఒక్కతే కూతురు అనుకోలేదు. ఇద్దరు కూతుళ్లు అనుకున్నాను అమ్మా.. ఇదే నా ఆఖరి కోరిక అనుకునైనా మా షష్టి పూర్తికి రామ్మా?


 అని పిలవగానే వైజయంతి కోపంగా మా అమ్మీ రానని ఎన్నిసార్లు చెప్పాలి. అంటుంది. కౌషికి మాత్రం వస్తానని చెప్తుంది. దీంతో ఆదిలక్ష్మీ, భాగ్యలక్ష్మీ, సురేష్‌, ధాత్రి, కేదార్‌, సుధాకర్‌ హ్యాపీగా ఫీలవుతారు. మిగతావారందరూ షాక్‌ అవుతారు. ఆనందంలో ఆదిలక్ష్మీ అందరికి చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత వైజయంతి రూంలోకి వెళ్లి భయపడుతుంది.  ఆరోజు పాపను తానే బెడ్‌ మీద నుంచి కింద పడేలా చేసింది గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: మాకు ఆడవాళ్లంటే గౌరవం ఉంది, నేను చెప్పిందే కరెక్ట్ అయ్యింది - నిహారిక కొణిదెల