Niharika Konidela About Committe Kurrollu Reviews: మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికీ చాలామంది హీరోలు వచ్చి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించారు. కానీ వారందరికీ భిన్నంగా అదే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నిహారిక కొణిదెల.. నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్‌ను ప్రారంభించి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాను నిర్మించింది. ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ రోజురోజుకీ మంచి మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ‘కమిటీ కుర్రోళ్లు’లో సెకండ్ హాఫ్ కాస్త స్లోగా ఉంది అని వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై నిహారిక స్పందించింది.
రివ్యూలు విన్నాను..
‘‘కమిటీ కుర్రోళ్లు సెకండాఫ్ గురించి కంప్లైంట్స్ వచ్చినా నేను మాత్రం ఎక్కువగా ప్రశంసల్లోనే మునిగితేలుతున్నాను. అలా అని మేము పట్టించుకోవడం లేదని కాదు. మేము కూడా చాలా రివ్యూలు చూస్తున్నాం, చదువుతున్నాం. నేను విన్నది ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత హై సెకండ్ హాఫ్‌లో లేదని, లో అయ్యిందని ప్రేక్షకులు అంటున్నారు. సుబ్బు, సతయ్య దగ్గరకు వెళ్లిన సీన్ తర్వాత అంత హై మళ్లీ క్రియేట్ చేయలేం. ఎందుకంటే సినిమాలో పెద్ద విషయం అదే. దాని తర్వాత అంత పెద్ద విషయం ఏముండదు. ఒక సమస్య చుట్టూ మాత్రమే కథ తిరుగుతుంది’’ అంటూ రివ్యూలు రాస్తున్నవారికి పంచ్ వేసింది నిహారిక.
చెప్పిందే నిజమయ్యింది..
‘‘కమిటీ కుర్రోళ్లులో ఊరు సరిగ్గా లేదు, బాగుచేస్తారా అని శివ పాత్ర ఎంటర్ అవుతుంది. మన సినిమాతో అందరినీ తృప్తిపరచలేమని నేను నమ్ముతాను. చాలామంది ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో కూడా నేను చెప్పింది ఏంటంటే జనాలు సినిమా అయిపోయాక ఏడుస్తూ బయటికి రారు, నవ్వుతూ బయటికి రారు. ఒక సంతృప్తితో వస్తారని చెప్పాను. అదే ఫీలింగ్‌తో బయటికొస్తున్నారు. నేను అనుకున్నది కరెక్ట్ అయ్యిందని నాకు సంతోషంగా ఉంది. విలియమ్ క్యారెక్టర్ ఊరికే అమ్మాయికి ముద్దుపెడుతున్నాడు నాకు నచ్చడం లేదని కొందరు ప్రేక్షకులు అన్నారు’’ అని తెలిపింది నిహారిక కొణిదెల.
ముద్దు కావాలి..
‘‘విలియమ్ క్యారెక్టర్ ఆ అమ్మాయిని ముద్దుపెడతానని చెప్పినప్పుడు మా అమ్మ చూస్తుంది అంటుంది. కానీ నాకు ఇష్టం లేదని ఒకసారి కూడా అనదు. దొంగమొహంది దానికి ముద్దు కావాలి. వాళ్ల అమ్మ చూస్తుందని భయం అంతే. అలాంటి పాయింట్‌నను దర్శకుడు యదువంశీ చాలా స్ట్రాంగ్‌గా రాసుకున్నారు. తనకు ఆడవాళ్లంటే చాలా గౌరవం ఉంది. ఇందులో హీరోలు అల్లరిగా చిన్నతనంలో చేసే పనులు అందరి జీవితంలో జరిగేవే. అలా అని అమ్మాయిలని గౌరవించరని కాదు. జీవితం గురించి చూపించాలనుకున్నాం. నా దృష్టిలో కమిటీ కుర్రోళ్లు అనేది జీవితం గురించి చెప్పే కథ’’ అని తన సినిమా గురించి గొప్పగా మాట్లాడింది నిహారిక. త్వరలోనే చిరంజీవిని కూడా సక్సెస్ మీట్‌ను తీసుకురావడానికి ట్రై చేస్తానని చెప్పింది.
Also Read: ఎంగేజ్మెంట్ ఎఫెక్ట్? ఆ విషయంలో అక్షయ్, జాన్వీలను మించిపోయిన శోభిత దూళిపాళ