Jagadhatri  Serial Today Episode: ధాత్రి కేదార్‌లకు వైజయంతి ప్రేమగా వడ్డించడంతో నిషిక కుల్లుకుంటుంది. కోపం తట్టుకోలేకపోతుంది. ఇంతలో కాచి కూడా మెల్లగా వదిన ఇవాళ కుర్చి లాగేసుకుంది. రేపు నీ ఉనికినే ‌ప్రశ్నార్థకంగా మారుస్తుంది అనగానే మరింత కోపంగా ఈ రసం ఎవరు చేశారు అని అడుగుతుంది నిషిక. ధాత్రి తానే చేశానని చెప్పడంతో ఇంత చెండాలంగా చేశావేంటి? అయినా నిన్ను కిచెన్‌లోకి వెళ్లొద్దని చెప్పానుగా అంటూ ధాత్రిని చెడామడా తిడుతుంది నిషిక.


కౌషికి: పచ్చకామెర్లు వచ్చిన వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట.


నిషిక: నా ఇంట్లో వంట నాకు నచ్చలేదు అనే స్వేచ్చ కూడా లేదా వదిన నాకు .


కౌషికి: నువ్వు చెప్పింది నిజమే అయితే ఆ వంట టేస్ట్‌ లేకుండా ఉంటే ఇంట్లో ఇంత మంది అంత ఇష్టంగా ఎలా తింటున్నారు. వాళ్లకు రాని సమస్య నీకు మాత్రమే వచ్చిందంటే ఇక్కడ సమస్య వంటో నువ్వో నువ్వే డిసైడ్‌ చేసుకో నిషి.


అనగానే   నిషిక కోపంగా కౌషికిని కూడా తిడుతుంది. ఇక చాలు ఆపు అంటుంది. దీంతో కౌషికి కూడా నీకు వంటలు నచ్చకపోతే తింటే తిను లేకుంటే బయట నుంచి ఆర్డర్‌ చేసుకో అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కౌషికి కి ఫోన్‌ రావడంతో తాను ఆఫీసుకు వెళ్తున్నానని... ఈ ల్యాండ్‌ డాక్యుమెంట్స్‌ జాగ్రత్తగా నా లాకర్‌లో పెట్టు అని కౌషికి వెళ్లిపోతుంది. ఇదే అదనుగా డాక్యుమెంట్స్‌ కొట్టేయాలని నిషిక, యువరాజ్‌ అనుకుంటారు. ధాత్రి డాక్యుమెంట్స్‌ తీసుకెళ్లి కౌషిక లాకర్‌లో పెట్టి వస్తుంది. తర్వాత అందరూ పడుకున్నాక యువరాజ్‌ ముసుగు వేసుకుని డాక్యుమెంట్స్‌ కోసం కౌషికి రూంలోకి వెళ్తాడు. డాక్యుమెంట్స్‌ తీసుకుని వెళ్లిపోతుంటే ప్లవర్‌ హౌస్‌ కిందపడగానే ధాత్రి లేచి కేదార్‌ను నిద్రలేపుతుంది.


ధాత్రి: బయట ఎవరో తిరుగుతున్నట్లున్నారు.


కేదార్‌: ధాత్రి అర్థరాత్రి నిద్రలేపి ఇంట్లోకి ఎవరో వచ్చారనడం ఏంటి ధాత్రి పడుకునే ముందు నీ పోలీస్‌ బ్రెయిన్‌ ఆఫ్‌ చేయమని నీకు చెప్పాను కదా?


దాత్రి: లేదు కేదార్‌. పక్కాగా ఏదో ప్లవర్‌ హౌస్‌ కిందపడ్డట్టు, తర్వాత నేల మీద సరిగ్గా పెట్టిన సౌండ్‌ విన్నాను.


కేదార్‌: సరే అయితే పదా చూద్దాం.... ధాత్రి ఎవరో డాక్యుమెంట్స్‌ తీసుకెళ్లిపోతున్నారు.


ధాత్రి: అసలు డాక్యుమెంట్స్‌ వదిన రూంలో ఉన్నాయని వీడికెలా తెలిసింది.


కేదార్‌: అంటే ఇది ఇంట్లో వాల్ల  పనేనా?


ధాత్రి: యువరాజ్‌. ఆ ముసుగుదొంగ యువరాజ్‌..


 కేదార్‌: తన ఆస్థి పేపర్స్‌ తనే ఎందుకు దొంగతనం చేస్తున్నాడు. అది కూడా మాధురి పెళ్లి కోసం దాచిన డాక్యుమెంట్స్‌ ని దొంగతనంగా ఎందుకు తీసుకెళ్తున్నాడు.


అనగానే యువరాజ్‌ ప్లాన్‌ ఎంటో కానీ పేపర్స్‌ ఇల్లు దాటకూడదు. అంటూ వెళ్లి యువరాజ్‌ను పట్టుకుని చితక్కొట్టి డ్యాకుమెంట్స్‌ తీసుకుని వెళ్లిపోతారు. వెళ్తూ వెళ్తూ బయటకు వచ్చిన బూచి చేతులు తొక్కుకుంటూ వెళ్తారు. దీంతో బూచి గట్టిగా అరుస్తాడు. అందరూ నిద్ర లేచి వచ్చి ఏమైందని అడుగుతారు. ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో నిషిక ఇంట్ల దొంగను ఈశ్వరుడైనా పట్టడని అంటారుగా అది నిజమే అనగానే కౌషికి కోపంగా నిషికను తిడుతుంది. ఇంతలో కేదార్‌, ధాత్రి వచ్చి ఇంట్లో దొంగలు పడ్డ విషయం నిజమేనని అది యువరాజ్‌కు బాగా తెలుసని అనడంతో యువరాజ్‌ షాక్‌ అవుతాడు.  చీకట్లో నన్ను కొట్టి డాక్యుమెంట్స్‌ తీసుకుకెళ్లింది వీల్లేనన్నమాట అంటే ఆ పోలీసులు వీల్లే అని యువరాజ్‌ కన్‌ఫం చేసుకుని వచ్చింది ఒక్క దొంగ కాదు ఇద్దరు దొంగలు అంటూ చెప్పడంతో ధాత్రి, కేదార్‌ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మెగా లీక్స్... తమ్ముడొచ్చిన ఆనందంలో గట్లా చేస్తే ఎట్లా?