Jagadhatri Serial Today Episode: జేడీ కష్టడీలో ఉన్న జయరాంపై హత్యాయత్నానికి ప్రయత్నించిన అతన్ని పోలీసులు పట్టుకుంటారు. అతను గుడిలో చనిపోయిన చిన్నారి తండ్రిగా గుర్తిస్తారు. తన బిడ్డను పొట్టన పెట్టుకున్న  ఆ దుర్మార్గుడిని చంపడానికే వచ్చానని అతను చెబుతాడు. ఈ పోలీసులు, కోర్టుల వల్ల నాకు న్యాయం జరుగుతుందని అనిపించడం లేదని...వాడిని చంపి నా బిడ్డ ఆత్మకు శాంతి కలిగిస్తానని అంటాడు. తన బిడ్డ గుర్తులు అక్కడ వదిలేసి పోలీసులను తిట్టుకుంటూ  వెళ్లిపోతాడు. దీంతో కేధార్‌కు చాలా కోపం వచ్చి జయరాం ఉన్న  సెల్‌లోకి వెళ్లి వాడిని చితక్కొడతాడు. గన్‌ గురిపెట్టి కాల్చబోతాడు.ఇంతలో జేడీ,సాధూ వచ్చి వారిస్తారు. గన్‌ కిందకు దించమని బ్రతిమలాడుతారు. దీంతో కేడీ గన్ కిందకు దించగానే....జయరాం అతని చేతిలోగన్‌ లాక్కుని కేడీకి గురిపెట్టి బెదిరిస్తాడు. కేడీని అడ్డుపెట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. మీడియా ముందే కేడీని తీసుకుని బయటకు వెళ్లేందుకు జయరాం ప్రయత్నిస్తాడు. ఇదే మంచి అవకాశమని భావించి జేడీ,కేడీ....జయరాంను మరింత రెచ్చగొడతారు. వాడు కేడీని చంపేందుకు ప్రయత్నించగా...జేడీ గురి చూసి జయరాంను కాల్చి చంపేస్తుంది. ఇదంతా జేడీ ప్లానింగేనని సాధూకు  అర్థమవుతుంది. జేడీ చేసిన న్యాయానికి  పాప తండ్రి ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతాడు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందని అంటాడు. వాడిలాంటి వాడికి బతికే అర్హత లేదని...అందుకే వాడిని చంపేశానని చెబుతుంది. వాడినే కాదు...ఈ బ్లాస్ట్‌కు కారణమైన ఏ ఒక్కడినీ వదిలిపెట్టనని జేడీ చెబుతుంది.

Continues below advertisement

                     భోజనాలు తినే దగ్గర నిషిక చాలా కోపంగా ఉండటం చూసి అందరూ ఎందుకు  అలా ఉన్నావని అడుగుతారు. ఏంలేదు బాగానే ఉన్నానని చెబుతుంది. కౌషికి కూడా నిలదీయడంతో...నేను బాగానే ఉన్నానని మళ్లీ అబద్ధం చెబుతుంది. నాకు అసలే చిరాకుగా  ఉందని....మరింత చిరాకు తెప్పించొద్దని అంటుంది. ఇంతలో కౌషికి సుధాకర్‌తో మాట్లాడుతుంది...న్యూస్‌ ఇప్పుడే చూశానని బాంబు బ్లాస్ట్‌కు కారణమైన రౌడీని జేడీ షూట్‌ చేసి చంపేసిందని చెబుతుంది. కేడీని కాపాడటానికే చేసిందని సుధాకర్‌ అంటాడు. ఏదైతే ఏమైంది...వాడి వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఈ విధంగానైనా న్యాయం జరిగిందని కౌషికి అంటుంది. ఇంతలో జగధాత్రి కల్పించుకుని రేపు కొత్తగా కట్టబోయే ఆఫీసు శంకుస్థాపనకు ఎన్నిగంటలకు బయలుదేరాలని అడిగితే...9గంటల కల్లా వెళ్లిపోదామని కౌషికి చెబుతుంది. మీకు వేరే ఏదైనా పని ఉంటే రానక్కర్లేదని వైజయంతితోపాటు యువరాజు కూడా అనడంతో ధాత్రి బాధపడుతుంది. ఈ మాటలకు కౌషికి అడ్డుపడుతుంది. రావాలో వద్దో వాళ్లు నిర్ణయించుకుంటారని....మీరు ఎందుకు అడ్డుపడుతున్నారని మండిపడుతుంది. ఇంతలో నిషిక కల్పించుకుని రావొద్దనే చెబుతున్నాం అంటుంది. దీంతో సుధాకర్ కల్పించుకుని అక్కడికి వచ్చే హక్కు కేధార్, జగధాత్రితోపాటు శ్రీవల్లికి కూడా ఉందని అంటాడు. కాదనే అధికారం మీకు లేదని అంటాడు. అయినా అక్కడికి ఈ ఇంట్లో వాళ్లు ఎవరైనా రాకూడదు అంటే వాడు యువరాజేనని అంటాడు. వీడిని ఎవరైనా అక్కడ గుర్తుపడితే మాఫియాతో సంబంధం ఉన్నవాళ్లని మన బిజినెస్‌కే నష్టం జరుగుతుందని అంటాడు. దీంతో వైజయంతి, నిషిక కోప్పడతారు. ఇప్పుడు మారిపోయి మీరు చెప్పినట్లే వింటున్నాడు కదా....అయినా అవకాశం వచ్చినప్పుడల్లా యువరాజు తిడుతూనే ఉన్నారని మండిపడతారు. చేసిన చిన్న తప్పుకు యువరాజును క్రిమినల్‌గా చూడొద్దని నిషి అంటుంది. తప్పుడు పనులు చేసే వారికి సాయం చేసేవారిని క్రిమినల్స్‌ అంటారని....ఈ విషయం గుర్తుపెట్టుకుంటే ఈ ఇంట్లో మళ్లీ ఎవరూ తప్పు చేయరని జగధాత్రి అనడంతో  నిషికి కోపం వస్తుంది. దీంతో వైజయంతి ఈ టాపిక్‌న కట్‌ చేసి వెళ్లిపోతుంది. ఇంతలో నిషికి ఫోన్ రావడంతో కంగారుపడుతుంది. మాట్లాడి వస్తానంటూ బయటకు వెళ్లడంతో యువరాజుకు కూడా అనుమానం వస్తుంది. నిషి ఏదో చేస్తుందని....ఫోన్ వస్తే పక్కకు వెళ్లి మాట్లాడుతోందని యువరాజు అనుకుంటాడు.ఎవరితోనో మాట్లాడుతోందని...ప్రతిదానికి కంగారుపడుతోందని అంటాడు. నాకు కూడా ఏ విషయం చెప్పడం లేదని అనుకుంటాడు. 

                         నిషికి మీనన్‌ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. ఆ మిస్సయిన కుంకుమ భరణి ఎక్కడ ఉందో కనిపెట్టి నేను చెప్పిన చోటుకు డైమండ్స్‌ పంపించకపోతే...నేను నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి రావాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు. నేను ఎలాగైనా దాన్ని కనిపెట్టి పని పూర్తి చేస్తానని నిషి చెబుతుంది. వాటి విలువ 30 కోట్లు అని....అవి దొరక్కపోతే ప్రతిరూపాయి నీ నుంచే వసూలు చేస్తానని అంటాడు.

Continues below advertisement