Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబికకు పెళ్లి అని పానకాలు వీర్రాజుకి చెప్పడంతో అంబికకు పెళ్లి అంటే కలియుగంలో ఘోరాలు జరగడం అంతే ఇదేరా.. అంబికను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అంటే వాడిది ఎంత పెద్ద గుండెరా కానీ ఈ పెళ్లి జరగనివ్వను.. మొత్తం విహారి కుటుంబాన్నే లేపేస్తాను అని అంటాడు. మీ ముద్దుల చెల్లి అంబిక అయ్యా అని పానకాలు అడిగితే తనని కూడా వదలను అని అంటాడు.
విహారి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని లక్ష్మీ ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మీ ఏడుస్తుంటే వసుధ, చారుకేశవ చూసి ఏమైందని అడుగుతారు. లక్ష్మీ వసుధని హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఏమైందని మళ్లీ అడగటంతో లక్ష్మీ వసుధ వాళ్లకి సహస్ర గురించి మొత్తం చెప్పేస్తుంది. సహస్ర ఇంత మోసం చేస్తుందా.. ఆ సహస్రని నిలదీసి అడుగుతా అని చారుకేశవ కోపంగా వెళ్తుంటే లక్ష్మీ ఆపుతుంది. అయినా చారుకేశవ వినకుండా అందరి ముందు నిలదీయాలి.. తను చేసిన తప్పు అందరికీ తెలియాలి అని అంటాడు. ఈ విషయం ఇప్పుడు బయటకు చెప్పకూడదు.. తాతయ్య గారి ఆరోగ్యం బాలేదు కదా ఇప్పుడు ఈ నిజం తెలిసి గొడవలు అయితే తాతయ్య ఆరోగ్యం ఏమైపోతుంది. అంతేకాదు.. సహస్రమ్మ ఇప్పుడు గర్భవతి కూడా అని అంటుంది. గర్భవతిని ఇబ్బంది పెట్టకూడదు అందుకే ఏం అడగొద్దు అంటున్నా అని లక్ష్మీ అంటుంది. నువ్వు దేవతవి నీ అంత గొప్ప మనసు ఎవరికీ ఉండదు అని అంటారు.
పద్మాక్షితో సహస్ర లక్ష్మీ బ్లడ్ సాంపిల్స్ ఎలా తీసుకునేలా చేస్తావని అంటుంది. దానికి పద్మాక్షి ఇంటికి ల్యాబ్ టెక్నీషియన్ పిలిపించా అని లక్ష్మీకి మాత్రమే టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కాబట్టి ఇంట్లో అందరికీ రక్త పరీక్షలు చేయిస్తానని అంటుంది. ఇంట్లో అందరినీ పిలిచి టెస్ట్లు చేయిస్తున్నా అని అంటుంది. మంచి నిర్ణయం అని విహారి ఓకే చెప్తాడు. అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు. విహారికి బ్లడ్ తీస్తున్నప్పుడు విహారి గారికి ఇంజక్షన్ అంటే భయం ఎలా బ్లడ్ తీయించుకుంటారో ఏంటో అని లక్ష్మీ అనుకుంటుంది. విహారి బ్లడ్ ఇస్తుంటే లక్ష్మీ కన్నీరు పెట్టుకుంటుంది. అది విహారి గమనిస్తాడు. తర్వాత లక్ష్మీ బ్లడ్ కలెక్ట్ చేసుకుంటారు.
పద్మాక్షి లక్ష్మీని చూసి ల్యాబ్ టెక్నీషియన్కి సైగ చేస్తుంది. తర్వాత పండు బ్లడ్ కూడా తీసుకుంటారు. విహారి లక్ష్మీని పక్కకి తీసుకెళ్తాడు. కనకం మనం నిజాన్ని నీడని దాయలేం.. నీకు నా మీద కూడా ప్రేమ ఉంది అన్నది నిజం.. అది కూడా నువ్వు నీ గుండెల్లో దాచావన్నది నిజం.. ఆ ప్రేమ ఇందాక నీలో కనిపించిందని అంటాడు. విహారి గారు మీరు ఏదేదో అనుకుంటున్నారు.. కానీ అదేదీ కాదు అంటుంది. దానికి విహారి మరి అయితే ఇందాక ఎందుకు నాకు బ్లడ్ తీస్తుంటే నువ్వు అంత బాధ పడ్డావ్.. నాకు వచ్చే నొప్పిని నువ్వు తట్టుకోలేకపోయావ్ చూడు అదే ప్రేమ అంటే అని అంటాడు. ప్రేమ వేరు అభిమానం వేరు అని విహారి చెప్తాడు. సహస్ర చేసిన మోసానికి మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నా,, అందుకే అంబిక అత్తయ్య పెళ్లి అయితే నా బాధ్యత తీరిపోతుంది. అది అయిన వెంటనే మన పెళ్లి గురించి చెప్పేస్తా అని విహారి అంటాడు.
వీర్రాజు అంబిక పెళ్లి అని సిటీకి బయల్దేరుతారు. మీరు ఎందుకు అయ్యా అని పానకాలు అడిగితే ఎలా అయినా వెళ్తా ఈ పెళ్లి ఆపి తీరుతా అని అంటాడు. అందులో భాగంతో ఓ వ్యక్తితో గిఫ్ట్ కూడా తెప్పిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.