Jagadhatri Serial Today Episode: నిషిక రూమ్‌లోకి వెళ్లి ఎక్కడ ఏం ఉన్నాయో జగధాత్రి వెతుకుతూ ఉంటుంది. కీర్తి కుంకుమ భరణిలు పట్టుకోగానే  నిషికి కోపం రావడం గుర్తుకు వచ్చి వాటిల్లో ఏం ఉన్నాయో చూద్దామని ధాత్రి వాటిని పట్టుకుంటుంది.ఇంతలో హడావుడిగా మేడపైకి వచ్చిన నిషిక...తన రూమ్‌లోకి ఎందుకు వచ్చావని ధాత్రిపై మండిపడుతుంది. నిన్ను ఆపడానికి నాకు వేరే మార్గం లేదని ధాత్రి అనగా...నువ్వు ఏం చేసినా నేను అనుకున్నది చేసి తీరతానని చెప్పాను కదా అని చెప్పి ధాత్రి చేతిలో ఉన్న కుంకుమ భరణిలు తీసుకుని వెళ్లిపోతుంది.  ఇంతలో కేధార్ వచ్చి అడగ్గా...జరిగిందంతా చెబుతుంది. నిషిక ఆ కుంకుమ భరణిల వద్దకు మాత్రం ఎవరినీ పోనివ్వడంలేదంటే..అందులోనే ఏదో దాచి ఉంచిందన్న అనుమానం కలుగుతోందని చెబుతుంది.  పూజ అయిపోయిన తర్వాత రిటర్న్‌ గిప్ట్ ఇచ్చేప్పుడు చూద్దామని కేదార్‌, ధాత్రి ఇద్దరూ పూజ వద్దకు వస్తారు.

Continues below advertisement

                ఇంతలో నిషిక కుంకుమ నింపిన భరణిలు తీసుకొచ్చి పూజవద్ద పెడుతుంది. పంతులుగారు వాటి మూతలు తీసి పెట్టాలని చెప్పడంతో ఒక్కసారిగా కంగారుపడుతుంది. దీన్ని గమనించిన ధాత్రి...నిషిక ఎందుకు అంతలా కంగారుపడుతోందో అనిఆలోచిస్తుంది. అసలు ఆ కుంకుమ భరణిల్లో ఏముందా అని ఆలోచిస్తుంది. ఇంతలో శ్రీవల్లి వచ్చి కుంకుమ భరణిలు మూతలు తీస్తుంది. పూజ ముగియడంతో  వైజయంతి వచ్చి కుంకుమభరణిలు ఉన్న ప్లేట్ తీసి  ధాత్రికి ఇస్తుంది. ఆ తర్వాత ముత్తాయిదువులకు తాంబూలాలతోపాటు  కుంకుమ భరణిలు కూడా  వైజయంతి ఇస్తుంది. ఒక కుంకుమ భరణి తగ్గడంతో  నిషికి భయపడుతుంది. అది కనిపించకపోవడంతో నిషిక మరింత కంగారుపడుతుంది. ఇంకొక కుంకమ భరణి కనిపించకపోవడంతో  నిషిక పెద్ద గొడవ చేస్తుంది. ఆ కుంకుమ భరణి ఏం చేశావంటూ ధాత్రిపై అరుస్తుంది. దీంతో కేదార్ కలుగజేసుకుని...ధాత్రికి కుంకుమ భరణితో పనేముంది.ఎందుకు తీసుకుంటుందని నిలదీస్తాడు. నేను రూంలో పెట్టినప్పుడు ఐదు ఉన్నాయని...ఇప్పుడు నాలుగే ఉన్నాయంటే నువ్వే తీశావని మళ్లీ రెట్టిస్తుంది. దీంతో యువరాజు, సుధాకర్‌ కూడా కుంకుమ భరణియేగా వదిలేయమంటారు. నలుగురికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఏమనుకుంటారని వైజయంతి అనగా...ఇంట్లో చాలా కొత్త భరణిలు ఉన్నాయని అది ఇద్దామని కౌషికి చెబుతుంది. శ్రీవల్లి వెళ్లి ఇంకో భరణి తీసుకురాగా....తాంబూలం ఇచ్చేస్తుంది.

                                తాంబూలాలు తీసుకున్న ముత్తయిదువులంతా వెళ్లిపోతుంటే...ధాత్రి వారిని ఆపుతుంది. ఆ కుంకుమ భరణిల్లో పూజ చేసిన కుంకమ పెట్టి ఇస్తామని చెబుతుంది. మీకు ఇచ్చిన కుంకుమ భరణిలు ఓపెన్ చేసి పెడితే నేను అందులో పూజ చేసిన కుంకమ వేస్తానని చెబుతుంది. ఈ మాటలు వినగానే నిషికకు మళ్లీ కంగారు మొదలవుతుంది. పూజ అయిపోయి...తాంబూలం కూడా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఎందుకని నిషిక అంటుంది.వారిని వెళ్లిపొమ్మని చెప్పగా.....కౌషికి మళ్లీ ఆపుతుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి నిషి అని నిలదీస్తుంది.అందరి మంచి కోసమే కదా జగధాత్రి కుంకుమ ఇస్తానని అంటుంది. నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావని మండిపడుతుంది. ఇదంతా మామయ్యగారి ఆరోగ్యం కోసం చేసిన పూజ కదా...దీని ఫలితం అందరికీ పంచుకుంటే ఎలా అని అంటుంది. దీంతో సుధాకర్ కలుగజేసుకుని ఆ కుంకుమ వారి భరణిల్లో పెట్టమని చెబుతాడు. దీంతో ధాత్రి వాళ్ల దగ్గరకు వెళ్లి కుంకుమ భరణిల ఓపెన్ చేయమని కోరుతుంది. దీంతో వాళ్లంతా తెల్లముఖం వేస్తారు. ఇంతలో ఇంట్లో నుంచి గ్యాస్ వాసన వస్తుండటంతో  ధాత్రి ఆ కుంకుమ అక్కడ పెట్టి వంటింట్లోకి పరుగెడుతుంది. ఇంతలో వచ్చిన ముత్తయిదువులను వెళ్లిపోవాల్సిందిగా నిషిక సైగ చేస్తుంది.                           

Continues below advertisement

                              వంటగదిలోకి వెళ్లిచూడగా...గ్యాస్‌స్టవ్‌ ఆఫ్‌ చేసే ఉంటుంది. ఇదంతా ఎవరో కావాలనే చేశారని ధాత్రిఅనగా...ఎవరికి ఆ అవసరం ఉందని కౌషికి అంటుంది. ఇంతలో ముత్తయిదువులు వెళ్లిపోవడం చూసి కేదార్ వాళ్లు ఏరని అడుగుతాడు.వాళ్లంతా వెళ్లిపోయారని కౌషికి చెబుతుంది. కళ్లముందే తప్పు జరిగినా పట్టుకోలేకపోయామని ధాత్రి బాధపడుతుంది. అసలు నిషిని ముందు నుంచీ కనిపెట్టి ఉండాల్సిందని అంటుంది. వాళ్ల మాటలు విన్న కౌషికి ఇంట్లో ఏం జరుగుతుందని నిలదీస్తుంది. మీరు పూజ మధ్యలో నుంచి ఎందుకు వెళ్లిపోయారని అడుగుతుంది.మీకు,నిషికకు మధ్య ఏం జరుగుతోందని అంటుంది. మీ ఇద్దరూ నిషిక చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు అని నిలదీస్తుంది.

                             నిషిక ఇచ్చిన భరణీలు చెక్‌ చేసే టైంలో ఇంట్లో గ్యాస్ లీక్‌ అయ్యిందని...అనుమానం వ్యక్తం చేస్తుంది. నిషిక మళ్లీ మీనన్‌ కోసం పనిచేస్తుందా అని అడుగుతుంది. ఆ విషయం మీకు తెలిసి నిషిని మార్చాలని చూస్తున్నారా అని అంటుంది. అలాంటిదేమీ లేదని ధాత్రి బదులిస్తుంది. నేను నా తమ్ముడినే వదిలిపెట్టలేదని...ఏదైనా తప్పు జరిగితే నిషికను మాత్రం క్షమించనని వార్నింగ్ ఇస్తుంది. మాది కూడా  అనుమానమేనని...అది నిరూపించే ఆధారం ఏమీలేదని కేదార్ చెబుతాడు. యువరాజు విషయంలో జరిగినట్లే  జరుగుతుందేమోనని ముందు జాగ్రత్తపడుతున్నామని ధాత్రి చెబుతుంది. మీనన్‌తో నిషిక చేతులు కలిపిందని తెలిస్తే మాత్రం...ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచనని కౌషికి హెచ్చరిస్తుంది. అడ్డొచ్చిన వారిని కూడా బయటకు పంపించేస్తానని చెబుతుంది. మిమ్మల్ని కూడా  బయటకు పంపించడానికి వెనకాడనని చెబుతుంది.