Jabardasth Anchor Sowmya Rao: ‘జబర్దస్త్’ స్టాండప్ కామెడీ షో వల్ల కొందరు భామలు.. యాంకర్లుగా బుల్లితెరకు పరిచయమయ్యారు. రష్మీ, అనసూయ.. ఈ షో వల్లే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆ స్థానంలోకి సౌమ్య రావు వచ్చింది. తను ‘జబర్దస్త్’లో యాంకర్‌గా చేసింది కొన్నిరోజులే అయినా.. ప్రస్తుతం తనకంటూ బుల్లితెర ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు లభించింది. అయితే యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినప్పుడు తనకు ఎదురైన నెగిటివిటీ గురించి తాజాగా బయటపెట్టింది సౌమ్య. తన గురించి దరిద్రంగా మాట్లాడేవారని, పాత యాంకర్లకు సమానంగా చేయాలని కష్టపడేదాన్నని చెప్పుకొచ్చింది.


కొందరు ఎంజాయ్ చేస్తారు..


‘‘ఆడియన్స్ కొంతమంది నన్ను యాంకర్‌గా ఒప్పుకున్నారు. కొందరు ఒప్పుకోలేదు. కొంతమంది బాగుంది, మాకు నచ్చింది అని చెప్తారు. నా తెలుగును ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేర్చుకునే స్టేజ్ కదా.. దానిని కొందరు ఎంజాయ్ చేస్తారు. కొందరు మాత్రం తెలుగు రాకుండా ఎందుకు ఈ అమ్మాయిని తీసుకొచ్చారు, దరిద్రంగా ఉంది, అసహ్యంగా ఉంది, చూడడానికి బాలేదు, మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు తెలుగులో అని తిడతారు. ఒక దేవుడినే అందరూ పూజించరు. నేను మామూలు మనిషినే కదా. కొంతమంది ఎక్కడికి వెళ్లినా గుర్తిస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. కొందరు మాత్రం తెలుగు రాదు అని చెడుగా మాట్లాడతారు. వాళ్లని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు తెలియదు’’ అని చెప్పుకొచ్చింది సౌమ్య రావు.


వాళ్లకి అనుభవం ఉంది..


‘‘పాత యాంకర్లకు 11,12 ఏళ్లు అనుభవం ఉంది. నాకు 6,7 నెలలు మాత్రమే అనుభవం ఉంది. చాలా తేడా ఉంది కదా. ఒక లెవెల్‌కు వెళ్లిన తర్వాత నా పర్ఫార్మెన్స్ కూడా ఆడియన్స్‌కు నచ్చొచ్చు. వాళ్లు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. నేను డ్యాన్స్‌లో చాలా డల్. నాకు డ్యాన్స్ అస్సలు రాదు. స్కిట్‌లో వాళ్లు చెప్పే కొన్ని పదాలు కూడా నాకు అర్థం కావడం లేదు. డ్యాన్స్ కూడా ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. కానీ నేను అసలే సన్నగా ఉంటాను. ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా సన్నగా అయిపోతున్నాను’’ అంటూ సీనియర్ యాంకర్లలాగా తను కూడా ప్రేక్షకులను మెప్పించడానికి పడిన కష్టాలను బయటపెట్టింది సౌమ్య.


ఓవర్‌గా చేయొద్దు అన్నారు..


‘‘నేను కూడా డ్యాన్స్ బాగా చేయాలని క్లాసులకు వెళ్లాను. కానీ చాలా బరువు తగ్గిపోయాను. మీరు డ్యాన్స్ ఏం నేర్చుకోవద్దు, బాగా తినేసి లావు అవ్వాలి, ఇంకా సన్నగా అవ్వొద్దు అన్నారు డైరెక్టర్. 15 రోజులు తరచుగా డ్యాన్స్ చేస్తే కచ్చితంగా సన్నగా అయిపోతాను. ఎవరైనా డైట్ చేయాలి, సన్నగా అవ్వాలి అనుకుంటే డ్యాన్స్ క్లాస్‌కు వెళ్తే చాలు. కచ్చితంగా సన్నగా అయిపోతారు. అందుకే నేను కొన్ని ఎపిసోడ్స్‌లో సన్నగా కనిపిస్తాను. బాగా తినండి, రెస్ట్ తీసుకోండి, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకొని రండి పర్వాలేదు. దానికోసం ఓవర్‌గా ఏం చేయవద్దని డైరెక్టర్ చెప్పారు’’ అంటూ డ్యాన్స్ వల్ల తను బరువు తగ్గిపోవడం గురించి మాట్లాడింది సౌమ్య రావు. కొన్నిరోజులు ‘జబర్దస్త్‌’లో యాంకర్‌గా చేసి పక్కకు తప్పుకుంది సౌమ్య. ఇప్పుడు ఆ స్థానంలోకి సిరి హన్మంత్ వచ్చింది.


Also Read: షారుఖ్‌పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ - చెర్రీ రెస్పాన్స్ ఇదే?