Krishnamma kalipindi iddarini July 17th: గౌరీ సూరిబాబును వదిలేయమని బ్రతిమాలుతూ ఉంటుంది. కానీ సూరిబాబు తాళి కట్టాలని ఫిక్స్ అవుతాడు. నువ్వు వదిలేయకపోతే ఈశ్వర్ వచ్చి తీసుకెళ్తాడు అనటంతో.. ఇది నా పద్మవ్యూహం.. కళ్ళు ఉన్న వాళ్ళకి దీన్ని జాడ తెలీదు అటువంటిది కళ్ళు లేని వాడికి ఏం తెలుస్తుంది అంటూ మాట్లాడుతాడు.

Continues below advertisement

కళ్ళు లేకున్నా తన మనసు ఉంది అని కచ్చితంగా వస్తాడు అని అంటుంది. సూరిబాబు అలాగే మాట్లాడుతూ ఉండగా.. వెంటనే గౌరీ కట్లు ఇప్పుకుని గట్టిగా కొడుతుంది. అదే సమయంలో ఈశ్వర్ కూడా వచ్చి తనను గట్టిగా గౌరీని తీసుకెళ్తాడు. మరోవైపు పెళ్లి మండపం దగ్గర ఉన్న సునందను అందరూ ఓదారుస్తూ ఉంటారు. ఇక గౌరీ వాళ్ళ జాడ దొరకలేదు అని ఆదిత్య చెప్పటంతో భయపడిపోతూ ఉంటారు.

ఇక సౌదామిని తన కూతురితో వెళ్లిపోదామన్నావు వెళ్ళిపోతే ఇటువంటి ఎంజాయ్ ని మిస్ అయ్యే వాళ్ళం కదా అనడంతో అవును మమ్మీ అని తను కూడా అంటుంది. ఇక అక్కడే ఉన్న అఖిల ముహూర్తం టైం దగ్గరికి వస్తుంది అని పది లెక్కబెట్టవరకూ ఆదిత్యతో పెళ్లి చేయకపోతే చచ్చిపోతాను అని బెదిరించి లెక్కపెడుతుంది.

Continues below advertisement

భవాని టెన్షన్ పడుతూ సునందను బ్రతిమాడుతూ ఉంటుంది. అప్పుడే గౌరీ వచ్చి అఖిలను ఆపడంతో అందరూ గౌరీ ఈశ్వరులని చూసి ఊపిరి పీల్చుకుంటారు. కానీ సౌదామిని షాక్ అవుతుంది. గౌరీని కిడ్నాప్ చేశారన్నారు కదా అలా ఎలా వచ్చింది అని తన కూతురు వాళ్ళు అడగటంతో అదే నాకు అర్థం అవ్వట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావ్ అమ్మ అని గౌరీని అడగటంతో జరిగిన విషయం మొత్తం ఈశ్వర్ చెబుతాడు.

పోలీసుల సహాయంతో గౌరిని తీసుకొచ్చాను అని అంటాడు. ఇక ముహూర్తం టైం దగ్గర పడుతుందని భవాని అనడంతో ఈశ్వర్ ఆపి గౌరీ గురించి సౌదామిని అన్న మాటలకు గట్టిగా అత్తపై రివెంజ్ తీర్చుకుంటాడు. ఇంకొకసారి గౌరీ జోలికి వస్తే మరోలా ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు. దెబ్బకు సౌదామిని సైలెంట్ అవుతుంది. సునంద కూడా సౌదామిని గట్టిగా హెచ్చరిస్తుంది.

ఆ తర్వాత వాళ్ళని ఫ్రెష్ అప్ అవ్వమని ఈశ్వర్ వాళ్ళను పంపిస్తుంది సునంద. మరోవైపు ఆదిత్యతో పెళ్లి చేసుకోవటానికి  అమృత పెళ్లి మండపం దగ్గరికి వస్తుంది. అమృత చూసి సునంద షాక్ అయ్యి దగ్గరికి వెళ్లి తనను పక్కకు లాక్కెళ్ళి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఆదిత్యతో పెళ్లి జరగాలి అని.. ఏదేమైనా నన్ను పెళ్లి చేసుకుంటానని ఆదిత్య మాట ఇచ్చాడు అని. కానీ మీ వల్లే ఆదిత్య ఆ పెళ్లికి ఒప్పుకున్నాడని అంటుంది. ఇక సునంద మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తనను అనడంతో తను ఈ పెళ్లి ఆపడానికి వచ్చాను అని అంటుంది. ఆ మాటకు సునంద మరోసారి షాక్ అవుతుంది.

also read : Madhuranagarilo July 17th: ‘మధురానగరిలో’ సీరియల్: శ్యామ్ ను కాపాడిన రాధ.. బోనాల వేడుకలో అపర్ణ చేయనున్న కుట్ర?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial