Intinti Gruhalakshmi Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కోడలితో పాటు బయటికి వచ్చిన పరంధామయ్య ఎందుకు కోడలితో వచ్చాడో మర్చిపోతాడు.
తులసి: నాకు తెలుసులే మామయ్య, అత్తయ్య మీతో గొడవ పడుతుంటే తప్పించుకోవడానికి నాతో వచ్చారు. మీరు నడవలేకపోతున్నారా అయితే కాసేపు ఇక్కడే కూర్చుండి నేను కాయగూరలు కొనుక్కొని వచ్చేస్తాను అని షాప్ కి వెళ్తుంది.
పరంధామయ్య: నేను ఎందుకు తులసితో వచ్చాను అని మనసులో అనుకుంటాడు. అప్పుడే అతని ఫ్రెండ్ కనిపించి పలకరిస్తాడు.
పరంధామయ్య : ఎవరు నువ్వు.
ఫ్రెండ్ : అదేంటి బాబాయ్ అలా అంటావు ఒకే ఆఫీసులో ఎన్నో సంవత్సరాలు కలిసి పని చేసాము.. ఆరు నెలలు అమెరికా వెళ్లి వచ్చినంత మాత్రాన మర్చిపోతావా అయినా నువ్వేంటి ఇక్కడ, వాకింగ్ చేస్తున్నావా అంటాడు.
అవును అంటాడు పరంధామయ్య. పదా కలిసి వాకింగ్ చేద్దాం అని ఫ్రెండ్ అనడంతో అతనితో కలిసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు రావడంతో వెళ్ళిపోతాడు. ఒక్కడే ఉండిపోయిన పరంధామయ్య ఎక్కడ ఉన్నాడో ఎందుకు నడుస్తున్నాడో అర్థంకాక అక్కడే కూర్చుండిపోతాడు.
ఇంతలో కూరలు కొనుక్కు వచ్చిన తులసి మామగారు కనిపించకపోవడంతో అతనికి ఫోన్ చేస్తుంది. అనసూయ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.
తులసి: అదేంటత్తయ్య నేను మామయ్యకి ఫోన్ చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేశారు.
అనసూయ: ఫోన్ ఇంట్లోనే మర్చిపోయారమ్మ అయినా ఆయన నీ పక్కన లేరా అని అడుగుతుంది.
తులసి: లేదత్తయ్య నేను కాయగూరలు కొంటుంటే ఆయన ఈ పక్క షాపుకి ఎక్కడికో వెళ్లి ఉంటారు.. నేను చూస్తాలెండి అని అంటుంది.
ఆ తరువాత మామగారిని వెతుక్కుంటూ వెళ్తున్న తులసికి ఒక దగ్గర పరంధామయ్య కూర్చొని కనిపిస్తాడు.
తులసి : ఇదేంటి మావయ్య ఇక్కడ కూర్చున్నారు.
పరంధామయ్య : తెలియదమ్మ ఎందుకు వచ్చాను ఎలా వచ్చానో తెలియదు ఎటు వెళ్ళాలో తెలియక ఇలా కూర్చున్నాను.
తులసి: అసలు మీరు ఇటువైపు ఎందుకు వచ్చారు.
పరంధామయ్య: ఫ్రెండ్ కనిపిస్తే అలా నడుచుకుంటూ వచ్చేసాను.
సరే పదండి అని చెప్పి ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు.
మరొకవైపు తాగి పడుకుని ఉన్న నందుని చూసి రాములమ్మ అనసూయకి చెప్తుంది. అనసూయ వచ్చి కొడుకుని లేపుతుంది.
నందు: నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా.
అనసూయ: నేను జాగ్రత్తగా ఉండడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావ్ అని కసురుకుంటుంది.
నందు: ఒక తప్పు చేస్తే చాలు నిన్ను నెత్తిన పెట్టుకునే వాళ్ళు పాతాళానికి తోసేయడానికి నిమిషం చాలు.
అనసూయ: నేను తప్పు చేయటం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా
నందు: ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు కానీ నా కర్మ ఏంటో నేను చేసిన తప్పులుకి మాత్రమే పబ్లిసిటీ ఎక్కువ అని తులసి వైపు చూస్తాడు.
తులసి: ఇంకాపండి మీ డ్రామాలు, మీరు తాగి పడుకున్న దానికి నన్ను కారణంగా చూపిస్తున్నారు. అయినా నేను మాట్లాడకపోతే అంత గింజుకుంటున్నారు మరి మీరు చేసిన తప్పుకి నేను ఎంత బాధ పడాలి. మా అమ్మని నాకు తెచ్చి ఇవ్వండి అప్పుడు మీతో ఆప్యాయంగా మాట్లాడుతాను.
నందు: చేసిన తప్పుని సరిదిద్దుకోలేను కాబట్టే ఇంత నరకం అనుభవిస్తున్నాను.
మరోవైపు దివ్య దంపతులు బాబు కావాలని ఒకరు పాప కావాలని ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే రాజ్యలక్ష్మి రావటం చూసి నవ్వులు ఆపేస్తారు.
రాజ్యలక్ష్మి : నవ్వులు ఆపేసారేం? మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండడమే నాకు కావాలి.
దివ్య: మాక్కూడా అదే కావాలి కానీ అందుకు మీ సపోర్ట్ కావాలి.
విక్రమ్: ఎందుకు ఉండదు అమ్మ సపోర్ట్ ఎప్పుడూ మనకే.
రాజ్యలక్ష్మి : నా కొడుక్కి తల్లి మనసు బాగా తెలుసు అంటూ కోడలు చేతిలో కొబ్బరిబోండం పెట్టి తాగమని చెప్తుంది. కొడుకు వైపు తిరిగి నీకు మీటింగ్ ఏదో ఉందన్నావు అంటుంది.
విక్రమ్: నిజమేనమ్మ బాగా గుర్తు చేశావు.
రాజ్యలక్ష్మి : భార్య కడుపుతో ఉంటే ఏ విషయాలు గుర్తుండవు. ఏ భర్తకైనా అంతే అని నవ్వుతుంది. విక్రమ్ కూడా నవ్వుకుంటూ వెళ్లిపోతాడు.
రాజ్యలక్ష్మి : కొబ్బరి బొండం తాగుతున్న దివ్యతో నువ్వు కొబ్బరిబోండం తాగుతూ ఉండు చెప్తాను అంటూ ఆరోజు ప్రియ కడుపు తీయించాడని నా కొడుకు చెంప పగలగొట్టావు. కన్నకడుపు రగిలిపోయింది, ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది. అందుకోసమే సరియైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను.
దివ్య: ఆరోజు మీ అబ్బాయి చేసింది చిన్న విషయం కాదు.
రాజ్యలక్ష్మి : మరి ఈరోజు నేను చేసింది ఏంటి అంటూ కొబ్బరిబోండంలో కడుపు పోవడానికి మాత్రలు కలిపిన విషయం చెప్తుంది.
కంగారు పడిన దివ్య విక్రమ్ కి ఫోన్ చేయబోతే నువ్వు ఎంత చెప్పినా నా కొడుకు నమ్మడు అని నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
దివ్య ప్రియని పిలిచి నాకు ఏదో అయిపోతుంది త్వరగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళు అనటంతో దివ్య ఆటోలో హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది.
ప్రియ: నొప్పితో మెలికలు తిరిగిపోతున్న దివ్యని అసలు ఏం జరిగింది అక్క, ఎందుకు అలా అయిపోతున్నావు.
దివ్య: జరిగిందంతా చెప్తుంది.
ప్రియ: రాక్షసి కడుపులో ఉన్న బిడ్డను కూడా వదలటం లేదు, ఆ రోజు నువ్వు నాకు సపోర్ట్ చేయబట్టే ఈరోజు నీకు ఈ కష్టాలు.
దివ్య: నాకు ఏమీ కాదు అని చెప్పు ప్రియా, ఏం జరిగినా నువ్వు చూసుకుంటానని నాకు మాట ఇవ్వు.
ప్రియ దివ్యకి మాటిస్తుంది. ఇంతలో హాస్పిటల్ రావడంతో ఆమెను తీసుకొని లోపలికి వెళుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.