Illu Illalu Pillalu Serial Today Episode  తిరుపతి ఉదయం నిద్ర లేచే సరికి చెంబు ఊడిపోయి ఉంటుంది. నా చెంబు ఊడిపోయింది అని తిరుపతి అందరినీ లేపి చిందులేస్తాడు. రామరాజు కోపంగా రేయ్ చెంబు ఏదిరా అని అడుగుతారు. పోతే పోయిందిలే బావ వెధవ చెంబు అని తిరుపతి అంటే ఒక్కటి పీకి వెధవ చెంబు ఏంట్రా అందులో నగలు ఉన్నాయ్ అని అంటాడు. 

వేదవతి కోపంగా రేయ్ చెంబు ఏదిరా అందులో వల్లీకి చెందిన లక్షల లక్షల ఖరీదైన నగలు ఉన్నాయని అంటారు. రాత్రి పడుకున్నప్పుడు చెంబు ఉంది కదా పొద్దున్న లేదు ఏంటి అని రామరాజు అడుగుతాడు. తిరుపతి ఇడ్లీ బాబాయ్‌ని తీసుకొచ్చి రాత్రి అన్నయ్య నా పక్కనే పడుకున్నాడు.. అన్నీ అన్నయ్యకి తెలుసు అని ఇడ్లీ బాబాయ్ అంటాడు. నిద్రలో నడిచే అలవాటు ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్లిపోయాడని అంటాడు. నిద్రలో వాడికి నడిచే అలవాటు లేదని వేదవతి అంటుంది. 

రామరాజు కోపంగా ఏంట్రా నాటకాలుగా ఉందా.. నీ చెంబు పోతే నీకు తెలీదా.. ఇద్దరికీ తమాషాగా ఉందా ఎవరైనా కట్ చేసినా మీకు తెలీదా ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు.. కదా మీకు తెలీదా అని అడుగుతారు. ఇంటి చుట్టూ వెతకమని అందరికీ చెప్తారు. చెంబు దొరక్కపోతే మీ సంగతి చెప్తా అని అంటాడు. వల్లిని నర్మద, ప్రేమలు అనుమానంగా చూస్తారు. ఇడ్లీబాబాయ్ వణుకుతూ చెంబు అయితే కోసి తీసేశా కానీ ఈ రామరాజు చేతిలో ఈరోజు నా పని అయిపోయింది అని అనుకుంటుంది.  అందరూ ఇంటి చుట్టూ వెతకడానికి వెళ్తారు. 

ప్రేమ వెతకడానికి వెళ్తూ కాలుకి ముళ్లు గుచ్చుకొని విలవిల్లాడిపోతుంది. ధీరజ్ చూసి ప్రేమ కూర్చొపెట్టి కాళ్లకి తగిలిన ముళ్లు తీస్తాడు. ఎందుకు అలా ఉన్నావ్ అని ధీరజ్ అడిగితే కాళ్లకి ముళ్లు గుచ్చుకుంది కదా అని ప్రేమ అంటుంది. నేను దాని గురించి అడగలేదు.. రెండు రోజుల నుంచి గమనిస్తున్నా ఎవరితో సరిగా లేవు.. నీలో నువ్వు భయపడిపోతున్నావ్.. ఇప్పుడైనా చెప్పు అసలేం జరిగింది అని అడుగుతాడు. ప్రేమ మనసులో నువ్వు నా గురించి ఇంత తపన పడుతున్నా నేను చెప్పలేకపోతున్నారా నన్ను క్షమించు అని అనుకుంటుంది. మనసులో చాలా నొప్పి భరిస్తున్నావ్ నాకు చెప్పు అని అడుగుతాడు. కల్యాణ్‌ గురించి నీకు చెప్తే ఆవేశంతో ఏదో ఒకటి చేస్తా దాని వల్ల ఫ్యామిలీలు ఇబ్బంది పడతాయి అని ప్రేమ ఏం లేదని చెప్పి వెళ్లిపోతుంది. 

నర్మద గోడ తొంగి చూస్తుంటే సాగర్ వచ్చి ఎత్తుకొని సాయం చేస్తాడు. తర్వాత నర్మద దించమని అంటే దించి వెంటనే ఎత్తుకుంటాడు. ఏంటి మళ్లీ ఎత్తుకున్నావ్ అంటే ఇలానే బాగుంది అని చూడు చూడు మొత్తం వెతుకు అంటాడు. నర్మద రెండు వాయిస్తుంది. చచ్చినోడా అని తిడుతుంది. మొగుడికి రెండు వాయించి ఈ మధ్య నీకు ఏ టైంలో ఏం చేయాలో తెలీడం లేదు అని ఒక్కటిస్తుంది. ఇవన్నీ రొమాన్స్ మనసుకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసేయడమే అని అంటాడు. ఇక సాగర్ పెరట్లోనే రొమాన్స్ మొదలు పెట్టేస్తాడు. 

అందరూ ఇంటి లోపలికి వచ్చి చెంబు ఎక్కడా దొరకలేదని చెప్తారు. వల్లీతో ఇడ్లీ బాబాయ్ ఆ చెంబు చెరువులో పడేశా అని ఇంకెక్కడ దొరుకుతుందని అంటాడు. వల్లి ఇక ఇంట్లోకి వెళ్లి నగలు వేసుకొనే అదృష్టం నాకు లేదు.. అని ఏడుస్తుంది. వదిలేయమని ఇడ్లీ బాబాయ్ అంటే వదిలేయడం ఏంటి.. ఈ నగల మిస్సింగ్ వెనక నాకు చాలా అనుమానాలు ఉన్నాయి.. అని అంటాడు. నిద్రలో తిరుపతి వెళ్లినప్పుడు నడుచుకుంటూ వెళ్లినప్పుడు జారిపోయింటుందని ఇడ్లీ బాబాయ్ అంటాడు. దానికి రామరాజు కోపంగా అంతమంది ప్రయత్నిస్తే రాని చెంబు జారిపోయిందా. నేను తేల్చుకోవాల్సిన అనుమానాలు చాలా ఉన్నాయి.. చెంబులో నగలు ఉన్న విషయం మనకు మీ మామ వాళ్లకి మాత్రమే తెలుసు మూడో వ్యక్తికి తెలీదు కదా మరి దొంగకి ఎలా తెలుస్తుందని అంటాడు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.