Nindu Manasulu Serial Today September 4th Episode ప్రేరణని సుధాకర్ ఎంత ఆపాలని ప్రయత్నించినా వినకుండా గణ ఇంటి లోపలికి వెళ్తుంది. నేను మా నాన్నని కలిసే వెళ్తా అంతే అని తేల్చేస్తుంది. ఇప్పుడు నన్ను వదిలేస్తే నువ్వు సేఫ్‌గా ఉంటావ్.. లేదంటే నువ్వు నాతో మాట్లాడటం మీ సార్ చూస్తే నీ పని అయిపోతుంది. ఇంకా నన్ను అడ్డుకోవాలని చూస్తే అందరి ముందు నిన్ను మామయ్య అని పిలుస్తా అని అంటాడు. దాంతో సుధాకర్ దారి ఇచ్చేస్తాడు.
తల్లే అనుకుంటే దానికి మించి కూతుళ్లు అందరూ నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాళ్లే ఇప్పుడు తల్లి వస్తే వీళ్లిద్దరూ తల్లీకూతుళ్లు అని తెలిస్తే నన్ను ఆ రాక్షసుడు పులావ్ చేసేస్తాడని సుధాకర్ అనుకుంటాడు. పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటూ ఉంటే ప్రేరణ లోపలికి వస్తుంది. అందర్ని హాయ్ అని పలకరిస్తుంది. ఎవరమ్మా నువ్వు అని పెళ్లి వాళ్లు అడిగితే నాన్న కోసం వచ్చానని ప్రేరణ చెప్తుంది. నాన్న ఎవరు ఇక్కడెవరు ఉన్నారు అని పెళ్లి వాళ్లు అడిగితే తను మా నాన్న కోసం వచ్చింది.. మా నాన్నని చూసుకునే నర్సు అని గణ కవర్ చేస్తాడు.
ప్రేరణ వాళ్లతో కరెక్ట్ నేను వచ్చింది నాన్న గారిని బాగా చూసుకోవడానికి.. ఆయన్ను చూసి వెళ్లిపోతా అంటుంది. అవును ఏదో హడావుడిలో ఉన్నట్లు ఉన్నారు అందరూ అని ప్రేరణ అంటే నీకు అవసరమా అని ఈశ్వరి అంటుంది. దానికి ప్రేరణ నేను నాన్నని చూసుకోవడానికి వచ్చా కదా నాన్నని చూసుకుంటా అని అంటుంది. ఇదే ఛాన్స్‌గా పంతులు అబ్బాయికి తండ్రి అంటే ఎంత గౌరవం నర్సుని పెట్టారు.. గ్రేట్ అని అనుకుంటారు. మంచి కుటుంబం అని తెగ పొగిడేస్తారు. సంబంధం ఖాయం చేసుకోవాలని అనుకుంటారు.
ప్రేరణ తండ్రి దగ్గరకు వెళ్లి బొట్టు పెడుతుంది. మీ కోరిక మేరకు సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాను నాన్న అని చెప్తుంది. ఇంకా గంగ రాలేదు అని ఈశ్వరి సుధాకర్‌ని టిఫెన్స్ తీసుకురమ్మని చెప్తుంది. సుధాకర్ నోరెళ్ల బెడతారు. ఇంతలో గంగ వస్తుంది. ఈమె ఎవరు అని పెళ్లి వాళ్లు అడిగితే పని మనిషి అని చెప్తుంది ఈశ్వరి. చెల్లిని అలా చెప్పే సరికి సుధా ఫీలవుతాడు. ఇక ఇందిర టిఫెన్స్ రెడీ చేయడానికి వెళ్తాడు. వెనకాలే సుధాకర్ వెళ్లి నేను చెప్పేది వింటే నీ గుండె ఆగిపోతుందే.. గుండెని గట్టిగా పట్టుకో.. బావగారి గదిలో నీ పెద్ద కూతురు ప్రేరణ ఉందని చెప్తాడు. ఇందిర చాలా కంగారు పడుతుంది.
ప్రేరణ తండ్రితో మాట్లాడుతూ నీ నోటితో నన్ను పెద్దోడా అని పిలిచే రోజు ఎప్పటికి వస్తుందో నాన్న. నేను కష్టపడి నీ కల నెరవేర్చేతా నాన్న.. నేను సివిల్స్ పూర్తి చేసి ఐఏఎస్‌గా బాధ్యతలు తీసుకునేలోపు నువ్వు తిరిగి మామూలు మనిషి అయిపోవాలని చెప్తుంది. ప్రేరణ అక్కడే ఉందని తెలిసి ఇందిర చాలా భయపడిపోతుంది. సుధాకర్ అక్కతో ప్రేరణకు నువ్వు ఇక్కడున్నావ్ అని తెలిసినా ఆ రాక్షసుడికి మీ ఇద్దరూ తల్లీకూతుళ్లు అని తెలిసినా అయిపోతుంది మీ పని అని అంటాడు. ఇక టిఫిన్స్ తీసుకురమ్మని ఈశ్వరి పిలుస్తుంది.
ఈశ్వరి వెళ్తూ ప్రేరణని చూసి ఆగిపోతుంది. ఇక పెళ్లివాళ్లు గణ గురించి అడిగితే ట్రాఫిక్ ఎస్‌ఐ అని చెప్పకుండా స్టేషన్ ఎస్‌ఐ అని చెప్తారు. రేపో మాపో ప్రమోషన్ వస్తుంది అని కూడా ఈశ్వరి చెప్తుంది. ఆ మాటలు విన్న ప్రేరణ ప్రమోషన్ ఎలా వస్తుంది. సార్ సప్పెండ్ అయ్యారని.. ట్రాఫిక్ ఎస్‌ఐగా ఇప్పుడు పని చేస్తున్నారని నిజం చెప్పేస్తుంది. ఈశ్వరి కవర్ చేయాలని చూస్తుంది కానీ ప్రేరణ అన్నీ చెప్పేస్తుంది. దాంతో పెళ్లి వాళ్లు తిట్టేసి వెళ్లిపోతారు. ఈశ్వరి ప్రేరణ మీద అరవబోతే గణ ఆపుతాడు. ఏం కోపం వస్తుందా.. ఆరోజు వైజాగ్ వచ్చి మనల్ని అవమానించినప్పుడు.. నా తల్లి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మేం ఇంత కంటే ఎక్కువ బాధ పడ్డాం.. మేం అవమానం ఎదుర్కొని నిలబడ్డాం ఎందుకో తెలుసా మా నాన్న కోసం మా నాన్న పిలుపు కోసం..గుర్తింపు కోసం అని చెప్తుంది. నువ్వు ఎంత తప్పు చేశావో నీకు తెలీడం లేదు అని ఈశ్వరి అంటే తప్పు చేసింది మీరు.. కొడుక్కి లేని పోని హోదా కట్టబెట్టి చెప్పింది నువ్వు కొడుకుకి తల్లి అండగా ఉండి.. అన్నీ చూసుకోవాలి కానీ ఆడపిల్లలుగా పుట్టిన మేం మాత్రం తండ్రి పేరు పెట్టకూడదు.. తండ్రి అండ లేకుండా పెరగాలి మా నాన్న పేరు కూడా చెప్పుకోకూడదు.. ఇది ఆడదానివైన నీ సంస్కారం అని ప్రేరణ అంటుంది. గణ ప్రేరణతో చాలా సంతోషం.. చాలా మంచి పని చేశావ్.. చాలా గొప్పగా చెప్పావ్.. నీకు నువ్వే సాటి అని క్లాప్స్ కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.