Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్‌ లక్ష తండ్రి అకౌంట్‌లో వేయడానికి బ్యాంక్‌కి వెళ్తాడు. బ్యాంక్‌ క్లోజ్ అయిపోవడంతో రేపు చేద్దామని వెళ్లిపోతాడు. ఇక  రామరాజు బ్యాంక్‌ మేనేజర్‌తో అల్లుడి అకౌంట్‌కి లక్ష వేయించి ఇంకా అకౌంట్‌లో ఎంత ఉందో చెప్పమని అడుగుతాడు. 

Continues below advertisement

మ్యానేజర్ చూసి ఇంకా 12 లక్షలు ఉన్నాయి అని అంటే 14 లక్షలు ఉండాలి అందులో లక్ష ఇప్పుడు పోతే 13 ఉండాలి కదా ఒకసారి చెక్ చేసి చెప్పండి అని రామరాజు అడిగితే మేనేజర్‌ రామరాజుతో వారం క్రితం మీ చిన్నబ్బాయి ధీరజ్ అకౌంట్‌కి లక్ష ట్రాన్సఫర్ అయ్యావని అంటాడు. రామరాజు షాక్ అయిపోతాడు. ఏమైందని వేదవతి అడిగితే రామరాజు చాలా సీరియస్‌గా చూస్తాడు. మరోవైపు నర్మద కొత్త బాధ్యతలు తీసుకుంటుంది. సేన కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి తన మనిషితో సంతకం పెట్టించమని అంటాడు. కొత్త మేడం ఒప్పుకోరని ఎవరి డాక్యుమెంట్స్ మీద వాళ్లే సంతకం పెట్టించాలని అంటారని అంటాడు. ఎవరు ఆ మేడం అని సేనాపతి లోపలికి వెళ్తాడు.

సేనని చూసి నర్మద నమస్కారం పెట్టి కూర్చొమని అంటుంది. సేన డ్యాక్యుమెంట్స్ ఇవ్వగానే నర్మద చూసి భద్రావతిని రమ్మని చెప్పండి పొలం ఆవిడ పేరు మీద ఉంది.. ఆవిడ సంతకం పెడితే రిజిస్ట్రేషన్ అవుతుందని అంటుంది. కుటుంబ గొడవలు మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నావా అని సేన అంటే మర్యాద గవర్నమెంట్ ఆఫీస్‌లో గవర్నమెంట్ అధికారితో మాట్లాడుతున్నా అని మర్చిపోవద్దు అని అంటుంది. 

Continues below advertisement

సేన బయటకు వెళ్లి అక్కకి కాల్ చేస్తాడు. భద్రావతి వచ్చి ఎంత ధైర్యంరా మనల్నే ఆఫీస్‌కి పిలుస్తుంది. ఎవర్రా అది అంటే రామరాజు రెండో కోడలు అని సేన అంటాడు. భద్రావతి, సేన ఇద్దరూ లోపలికి వెళ్తారు. నా పేరు మీద వందల ఎకరాలు ఉన్నాయి ఎవరూ నన్ను ఇక్కడి వరకు రప్పించలేదు నువ్వు రప్పించావ్ అని భద్రావతి అంటే రూల్స్ మేడం ఎవరైనా రూల్స్ పాటించాలని నర్మద అంటుంది. నర్మద డాక్యుమెంట్స్ చూసి సంతకం పెట్టించి అన్నీ చెక్ చేసి అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తా ఏ చిన్న పొరపాటు ఉన్నా ఆపేస్తా అని అంటుంది. మొదటి సారి నువ్వు నన్ను ఒక్కడికి రప్పించావ్ గుర్తు పెట్టుకుంటా నీకు గుర్తుండేలా చేస్తా అని భద్రావతి అంటే మంచిది అని నర్మద అంటుంది. 

ధీరజ్ డబ్బు పట్టుకొని ఇవి ఎవరి కంటా పడకుండా ముఖ్యంగా ప్రేమ కంట పడితే ఎలా వచ్చావ్ ఎవరివి అని ప్రశ్నలు వేసి చంపుతుంది అనుకుంటాడు. ఇంతలో ప్రేమ అక్కడే ఉంటుంది. నువ్వేంటి బ్యాంక్ దగ్గర కన్నం వేయడానికి వచ్చావా అని ప్రశ్నిస్తుంది. నేనో పెద్ద బిజినెస్‌ మెన్‌నే చాలా లావాదేవీలు ఉంటాయి. మొన్నే కోటి వేశా ఇప్పుడు లక్ష వేయడానికి వచ్చానని అంటాడు. ప్రేమ లక్ష తీసి ఇది ఎక్కడిది అని అడుగుతుంది. ఈ లక్ష మీ పెద్ద అన్నయ్య నీకు డబ్బులు ఇవ్వడం నేను చూశా.. నువ్వు మీ అన్నయ్యకి నువ్వు డబ్బులు ఇస్తే తిరిగి ఇస్తున్నా అని కూడా అనడం విన్నాను.. చెప్పరా ఎవరి దగ్గర తీసుకొని ఇచ్చావ్ అని అడిగితే నీకు అనవసరం  అని ధీరజ్ అంటాడు. చెప్పాల్సిందే అని ప్రేమ అడుగుతుంది. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుందిరా. ఇప్పటికే మీ నాన్నకి నీ మీద ఉన్న కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. నా బాధ అర్థం చేసుకో అని అంటుంది. 

రామరాజు చాలా కోపంగా ఉంటాడు. ధీరజ్, ప్రేమ వస్తారు. వల్లి చూసి రండి రండి మీకు ఈ రోజు ఉంది.. కోపంలో ఉన్న మామయ్య మిమల్ని గెంటినా గెంటేస్తారు అని అనుకుంటుంది. రామరాజు ధీరజ్‌తోనా అకౌంట్‌ నుంచి లక్ష ఎందుకు తీసుకున్నావ్‌రా అని అడుగుతాడు. అందరూ షాక్ అయిపోతారు. ఎప్పుడూ లేనిది నువ్వు ఆ రోజు నా పక్కనే కూర్చొంటే నా మీద ప్రేమ అనుకున్నా కానీ అది డబ్బు కొట్టేయడానికి అని అర్థం కాలేదురా అని అంటాడు. ప్రేమ కోసమే ధీరజ్ డబ్బు కొట్టేసుంటాడని వల్లీ చెప్తుంది. ప్రేమ వాళ్ల పుట్టింటిలో యువరాణిలా పెరిగింది కదా.. ధీరజ్ చేసే డెలివరీ బాయ్ ఉద్యోగంతో జీతం తక్కువ కదా.. యువరాణికి ఖరీదైన బట్టలు కొనాలి అంటే తప్పదు కదా అందుకే కన్నతండ్రికి కన్నం వేశాడని అంటుంది.  అక్కా మామయ్య గారు ధీరజ్‌ని అడుగుతున్నారు.. ధీరజ్ చెప్తాడు నీకు ఎందుకు అంత కడుపుబ్బరం అని అడుగుతుంది. నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని నేను మాట్లాడుతా అని వల్లీ అంటుంది. రామరాజు ధీరజ్‌ కాలర్ పట్టుకొని కొడతాడు. ఇంతలో ప్రేమ మామయ్య చేయి పట్టుకొని అడ్డు నిలబడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.