Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లి ఇంట్లో అందరిని ఒక్క దగ్గరకు పిలిచి మంచి శుభవార్త ఉందని అందరికీ పాయసం చేసి ఇస్తుంది. విషయం ఏంటి అని రామరాజు అడుగుతాడు. వేదవతి కోడలితో శుభవార్త అంటున్నావ్ నెల తప్పావా అని అడుగుతుంది. ఇంకా అలాంటిది ఏం లేదు అంటుంది.
సాగర్‌తో మరిది గారు మీరు చెప్తారా.. నన్ను చెప్పమంటారా అని అంటుంది. విషయం ఏంటి అని నర్మద అడిగితే సాగర్ మరిది గారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా అని రామరాజు అడుగుతాడు. సాగర్ మరిది గారు పరీక్ష రాసి పాసయ్యారు అంటే జాబ్ వస్తుంది కదా అంటుంది. మన షాప్లో నడిపోడు ఉద్యోగం చేస్తాడు కదా వాడికి నిజంగానే ఉద్యోగం చేయాలి అనిపిస్తే నాకు ముందే చెప్తాడు. అసలు నన్ను మోసం చేయాలి అన్న సాహసం వాడు చేయడు అని రామరాజు అంటాడు.
సాగర్ మరిది గారి మీద మీకున్న నమ్మకానికి శతకోటి వందనాలు కానీ నేను చెప్పింది నిజం మామయ్య గారండీ అని పేపర్‌లో వచ్చిన సాగర్ పాసైనట్లు వచ్చిందని చూపిస్తుంది. రామరాజు అమూల్యకి పేపర్ ఇచ్చి చూడమని అంటే అమూల్య చూసి అన్నయ్య పరీక్ష రాశాడు కానీ ఫెయిల్ అయ్యాడని అంటుంది. దాంతో శ్రీవల్లి అవునా నేను పాసయ్యాడు అనుకున్నా,, సరేలే పరీక్ష రాయడం అలవాటు అయింది కదా,, ఇక రాసేసి పాసైపోతాడు అని అంటుంది.
రామరాజు సాగర్‌ని పిలిచి గవర్నమెంట్ ఎగ్జామ్ రాశావా అని అడుగుతాడు. రాశాను అని సాగర్ అంటే రైస్ మిల్లు చూసుకుంటా అని నాకు మాటిచ్చావ్ కదా.. మరి ఈ పరీక్ష ఏంటి అంటాడు. దాంతో సాగర్ నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకున్నాఅంటాడు. రామరాజు నర్మద తండ్రి అన్న మాటలు గుర్తు చేసుకొని మీ మామయ్య ఇల్లరికం పంపడం వెనక కారణం ఇదన్నమాట.. రైస్ మిల్లు చూసుకోవడం అంటే నువ్వు మూటలు మోయడం అనుకుంటున్నావ్.. ఈ లెక్కతో ఇల్లరికం వెళ్లిపోవాలి అనుకుంటున్నావ్ అర్థమైంది అంటాడు.
రామరాజు ఫైర్ అయిపోతే తిరుపతి వెళ్లి కూల్ చేయాలి అనుకుంటే రామరాజు తిరుపతిని కొట్టి ఏంట్రా తగ్గేది కోడిపిల్లల్లా నా కొడుకుల్ని దాచుకున్నా కానీ రెక్కలు రాగానే వీళ్లంతా నన్ను వదిలేసి వెళ్లిపోవాలని చేసుకుంటున్నారు అని అంటాడు. మన పిల్లలు అలా చేయరు అని వేదవతి అంటే ఏంటి చేయరు నీ ముద్దుల కొడుకు వాడి పెళ్లాన్ని పోలీస్ చేస్తానని నా మాట కాదని వెళ్లాడు. వీడేమో పరీక్షలు రాస్తున్నాడు.. రేపో మాపో ఇల్లరికం వెళ్లిపోతాడు అని అంటాడు. దానికి సాగర్ అబ్బా ఏంటి నాన్న మీరు ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడుతున్నావ్ ఏంటి అని గొడవకు తండ్రి మీదకు వెళ్తాడు.
మీ నిర్ణయాలు మీరు తీసుకుంటారా.. ఈ తండ్రికి చెప్పాల్సిన పని లేదా.. రేపు ఇల్లరికం వెళ్లి పోయి ఫోన్ చేసి నాన్న వెళ్లిపోయా అని చెప్తావా అంటాడు. ఏంటి నాన్న అర్థం కావడం లేదా నేను చెప్తానా వెళ్లిపోతా అని అరుస్తాడు. వేదవతి కొడుకుని వారించి ఇంకో మాట నీ నోటి నుంచి వస్తే పళ్లు రాలగొడతా అంటుంది. సాగర్ వెళ్తూ వెళ్తూ మళ్లీ వచ్చి నా భార్యది గవర్నమెంట్ జాబ్ కాబట్టి నేను చేయాలి అనుకున్నా.. దయచేసి పిల్లల ఇష్టాన్ని గౌరవించండి. అలాగే మీరు కాస్త మారితే బాగుంటుంది నాన్న అని దండం పెట్టి వెళ్లిపోతాడు.
రామరాజు కుప్పకూలిపోతాడు. నేను మారాలి అంటాడు ఏంటే.. ఏదో జరుగుతుంది అని రామరాజు బాధ పడతాడు. చందు సాగర్‌తో నాన్నకి ఎదురు తిరగడం ఏంట్రా అని అంటాడు. నిన్ను ఎవరైనా చేతకానివాడు అంటే నీకు అప్పుడు నా బాధ అర్థమవుతుందిరా.. నువ్వు చక్కగా జాబ్ చేసుకుంటున్నావ్ కదా నీకు బాగుంది కదా నా బాధ నీకు అర్థం కాదురా.. నేను పెద్ద చవటను కాబట్టి నా బాధ నీకు అర్థం కాదు అంటాడు. చందు ధీరజ్‌తో వీడు నాన్నకి ఇచ్చిన మాట తప్పుతున్నాడు కదరా తప్పు కదా చెప్పురా అని అంటే దానికి ధీరజ్ వాడికి నచ్చింది చేయాలి అనుకుంటున్నాడు కదరా.. వీడికి ఆ హక్కు ఉంది కాదు అనే హక్కు మనకు లేదు అని అంటాడు.
నర్మద వేదవతితో మాట్లాడాలని వెళ్తుంది. సారీ చెప్తే వేదవతి మీరు వద్దు మీ అత్తయ్య అని పిలుపులు వద్దు మీ పంచాయితీలు మాకు వద్దు అని అంటుంది. మనం అత్తాకోడల్లా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉన్నాం కదా కనీసం నాకు చెప్పలేదు అని వేదవతి అంటుంది. ప్రేమ, నర్మద ఇద్దరూ వేదవతికి కూల్ చేయాలని చూస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.