Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంట్లో పెళ్లి వేడుకలు గ్రాండ్‌గా జరుగుతుంటాయి. అపర్ణ, సుభాష్‌లను పెళ్లికూతురు, పెళ్లి కొడుకు లా రెడీ అయి వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటారు.
కావ్య: ఇంతటి బంగారాన్ని మీకు అప్పగిస్తున్నాం కదా మీ అబ్బాయి మా అమ్మాయిని ఎలా చూసుకుంటాడో చెప్పండి
రాజ్: మా ఇంటికి వచ్చి దీపం పెట్టిన ఈ అమ్మాయికి ఎప్పుడు కోపం కనిపించకుండా చూసుకుంటాము.. వేలు పట్టుకుని నమ్మి నడిచొచ్చిన ఈ పుత్తడి బొమ్మకు చెమట జాడ తెలియకుండా వింజామర విసిరే సేవకులమై చూసుకుంటాము.. తను అల్లరి చేస్తున్నప్పుడు ఆట బొమ్మను అవుతాను. తను అలిసిపోయినప్పుడు జోల పాటను అవుతాను.. ఈ మల్లెకొమ్మ నవ్వుకు కామా కూడా ఉండకూడదు. తన మీద పెట్టుకున ఆశలకు హద్దులే ఉండకూడదు.. ఒక్కమాటలో చెప్పాలంటే మీ అమ్మాయితో సాగే ఈ ప్రయాణంలో ఎన్నటికీ ఒక్క స్టాప్ కూడా ఎదురవ్వకూడదు
కళ్యాణ్: అన్నయ్య ఏంటిది..? ఇదంతా పెద్దమ్మ, పెద్దనాన్న కోసం చెప్తున్నట్టు లేదు
ఇందిరాదేవి: ఓరేయ్ కళ్యాన్ వాడు వాని పెళ్లాం గురించి చెప్తున్నాడు తెలియడం లేదా..?
ప్రకాష్: అబ్బాయి.. అమ్మాయిని ఎలా చూసుకుంటాడని అడగడం కాదమ్మా.. మీ అమ్మాయి బంగారం అయితే మా అబ్బాయి ప్లాటినం..మా వాణ్ని మీకు అప్పగిస్తున్నాం.. మరి మా వాడిని మీ అమ్మాయి ఎలా చూసుకుంటుందో కొంచెం సెలవు ఇవ్వండి.
కావ్య: ఎక్కడో ఆకాశంలో అల్లంత దూరంలో ఉన్న నెల రాజును చూస్తూనే మనసు పులకించిపోతుంది. అలాంటిది ఆ చందమామే చేతికి అందితే ఆ రాజుకు పొడి పట్టినా.. గుడి కట్టినా చిన్నదే అవుతుంది. అందుకే గుండెల్లో పెట్టుకున్నాం.. సరిపోదా..? మీ అబ్బాయి కోపాన్ని దీపంగా మల్చుకుంటాను. మీ యువరాజు నవ్వుల్ని జడలో పువ్వుల్లా చుట్టుకుంటాను ఎండల్లో ఆయనకు గొడుగు అవుతాను. ఆయన అడుగులకు మడుగు అవుతాను. ఆయన ప్రేమకు బానిసై చూసుకుంటాను. కానీ కలలలో కూడా మీ మహారాజు కలత చెందకూడదని ఆశపడుతున్నాను.. ఎందుకంటే మజిలీ లేని ప్రయాణం విరామం లేని జీవితం లాంటిది ఊహించుకోలేను
కళ్యాణ్: వదిన సూపర్
ధాన్యం: చూశారా మీ రాజ్‌కు మా కావ్య కరెక్టుగా కౌంటర్ ఇచ్చింది
రుద్రాణి: ఇంకా కవితలు కథలేనా.. గిఫ్టులు ఇచ్చి దండలు మార్చుకునేది ఉందా లేదా…
కావ్య: ఎందుకు లేదు.. అత్తయ్య గారికి మామయ్య గారికి ఎవరెవరు ఏం గిఫ్టులు ఇవ్వాలో ఇచ్చేయండి.. అత్తయ్య, మామయ్య మీరు ఈ దండలు మార్చుకోండి
అపర్ణ, సుభాష్ దండలు మార్చుకుంటారు. అందరూ వాళ్లను విష్ చేస్తుంటారు. తాము తీసుకొచ్చిన గిఫ్టులు ఇస్తుంటారు. కావ్య ఇచ్చిన గిఫ్టు చూసి అపర్ణ ఎమోషనల్ అవుతుంది. రాజ్ ఇచ్చిన గిఫ్ట్ చూసి సుభాష్ ఎమోషనల్ అవుతాడు. తర్వాత బాసింగాలు ఉంటే బాగుండు అని అప్పు చెప్పగానే.. నా దగ్గర రూంలో ఉన్నాయి అని కావ్య రూంలోకి వెళ్తుంది. అంతకు ముందే రాజ్ లాప్ ట్యాప్ కోసం కావ్య రూంలో స్వప్న ఉంటుంది.
కావ్య: అక్కా అందరూ హాల్లో ఉంటే నువ్వు ఇక్కడున్నావేంటి అక్కా
స్వప్న: నాకు నా స్టిక్కర్స్ నచ్చడం లేదే అందుకే నీ స్టిక్కర్స్ కోసం వచ్చాను ఏం నేను నీ స్టిక్కర్స్ తీసుకోకూడదా..?
కావ్య: తీసుకోకూడదని ఎవరన్నారు..
స్వప్న: అయితే నిన్ను అడగకుండా నీ గదిలోకి రాకూడదన్నమాట
కావ్య: అది కూడా నేను అనలేదే.. నువ్వు నా బుజ్జి అక్కవు నీకోసం నీ ఆనందం కోసం మా వారికి ఇష్టం లేకపోయినా తనతో పోరాడి మరీ రాహుల్ ను ఆఫీసులో పెట్టించాను. అలాంటిది గదిలోకి రావడానికి కండీషన్ పెడతానా..?
స్వప్న: సరే లేవే ఇంతకీ స్టిక్కర్స్ ఎక్కడున్నాయి
కావ్య: ఆ కప్ బోర్డులో ఉన్నాయి తీసుకో
అంటూ వెళ్లిపోతుంది. కావ్య వెళ్లాక లాప్‌ట్యాప్ తీసుకుని స్వప్న వెళ్లిపోతుంది. లాప్‌ట్యాప్ ఓపెన్ చేసి చూసిన రాహుల్ అందులో ఏ డీటెయిల్స్ లేవని ఒకవేళ రాజ్ తన ఫోన్‌లో డీటెయిల్స్ సేవ్ చేసుకున్నాడేమో అంటాడు. దీంతో స్వప్న కిందకు వెల్లి తన ఫోన్ హ్యాంగ్ అయిందని అర్జెంట్‌గా కాల్ చేసుకోవాలని రాజ్ ఫోన్ తీసుకుని పైకి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!