Nindu Manasulu Serial Today Episode శైలుకి ప్రేరణ పెళ్లి ఇంట్లో తల్లిదండ్రుల ఇష్టప్రకారం చేసుకోవాలని నచ్చ చెప్తుంది. తల్లిదండ్రులు దూరం అయితే కష్టం వాళ్లు ఉన్నప్పుడే వాళ్లతో ఉండాలి.. తర్వాత ఉండరు అప్పుడు మనం వాళ్ల ప్రేమని పొందలేమని అంటుంది. 

Continues below advertisement

కుమార్ మీద నీకు ఎంత ప్రేమ ఉందో మీ నాన్నకి నీ మీద అంతే ప్రేమ ఉంది.. మీ పెళ్లి చేసే బాధ్యత మాది.. మీ ప్రేమకు మేం సపోర్ట్ చేస్తున్నాం అని అంటుంది. సిద్ధూ ప్రేరణతో శైలుని ఎలా ఒప్పించాలా అనుకున్నా నువ్వు ఒప్పించావ్ థ్యాంక్స్ అని అంటాడు. నాకు థ్యాంక్స్ వద్దు నేను చేసిన సాయానికి నువ్వు నా నోట్స్ రాయాలి అంటుంది.  ఇక ప్రేరణ ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. కుమార్ శైలు దగ్గరకు వెళ్లి వీళ్లని చూస్తే ఏం అనిపిస్తుంది అని అడుగుతాడు. వాళ్లు కూడా త్వరలోనే మనలా ప్రేమలో పడతారు అనిపిస్తుందని అంటుంది. ఇద్దరూ నవ్వుకుంటారు.

గణని విజయానంద్ బెదిరించి మినిస్టర్ సమక్షంలో సాహితిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. విజయానంద్ తప్పక ఒప్పుకుంటాడు. అందులో భాగంగా విజయానంద్‌ భార్య మంజులని తీసుకొని గణ ఇంటికి వస్తాడు. మీరు మా ఇంటికి రావడం ఆశ్చర్యంగా ఉంది సార్.. ఆ పార్వతిపరమేశ్వరులే వచ్చినట్లు ఉందని అంటాడు. ఇక ఆశ్చర్యం ఆపు గణ అని విజయానంద్ అంటాడు. మంజులు ఎందుకు వచ్చాం అని అడుగుతుంది. సుధాకర్, ఇందిర కూడా వీళ్లు వచ్చారేంటి అని చూస్తారు.

Continues below advertisement

గణ తల్లికి వాళ్లని పరిచయం చేస్తాడు. మంజుల విషయం అడిగితే మన అమ్మాయికి ఈ గణతో సంబంధం అడగటానికి వచ్చానని విజయానంద్ అంటాడు. ఇదేంటి అండీ ఇలా చేశారు.. సిద్ధూకి చెప్పాలి కదా అంటుంది. ఇక విజయానంద్ గణ వాళ్లతో మా అమ్మాయి సాహితిని మీ అబ్బాయి గణకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నా అని అంటాడు. ఇందిర, సుధాకర్ షాక్ అయిపోతారు. 

గణ వాళ్లతో మా అమ్మ ఇష్టమే నా ఇష్టం సార్.. మీ లాంటి పెద్ద వాళ్లు కోరి పిల్లని ఇస్తా అంటే నాకు ఓకే అని అంటాడు. ఏం నటిస్తున్నావురా అని విజయానంద్ అనుకుంటాడు. మొత్తానికి విజయానంద్ గణని అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. గంగగా ఇందిర కాఫీ తీసుకురావడానికి మంజుల చూసి ప్రేరణ తల్లి అని గుర్తించి షాక్ అయిపోతుంది. ఈవిడ ఎవరు అని అడుగుతుంది. దానికి ఈశ్వరి మా పని మనిషి అని అంటుంది. దానికి మంజుల మనసులో కాఫీ షాప్ అమ్మాయి తల్లి ఈ ఇంటి పనిమనిషా అని అనుకుంటుంది. 

సిద్ధూతో కుమార్ మీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుందిరా.. మా ప్రేమ సెట్ చేసే క్రమంలో మీరు లవ్‌లో పడతారు ఏమో అనిపిస్తుందిరా అని అంటారు. సిద్ధూ కుమార్‌ని తిడతాడు. కంబైన్‌ స్టడీ వర్కౌట్‌ అయ్యేలా ఉందిరా అని కుమార్ అంటాడు. ప్రేరణ నీకు స్పెషల్‌గా చూస్తుంది అన్నయ్య అని శైలు అంటుంది. మీ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు కాబట్టి మీకు అలా కనిపిస్తుంది మాకు అంత సీన్ లేదు అని సిద్ధూ అంటాడు. ఇక ప్రేరణ, సిద్ధూ ప్రేరణ ఇంట్లో చదువుకుంటూ ఉంటారు. ఇందిర, సుధాకర్ ఇంటికి వస్తారు. సుధాకర్ సిద్ధూతో మీ చెల్లికి సంబంధం చూస్తున్నారు అని నీకు తెలీదా అని అంటాడు. అదేంటి అని అడిగితే మీ అమ్మానాన్న గణ ఇంటికి వచ్చారు. ఆ గణతో మీ చెల్లి ఫిక్స్ చేశారు అని చెప్తాడు. సిద్ధూ షాక్ అయిపోతాడు. అదేంటి మా అమ్మానాన్న అక్కడికి వచ్చి ఆ గణవాళ్లతో సంబంధం మాట్లాడటం ఏంటి అని అడుగుతాడు. నేను వెళ్తున్నా ఏంటో ఇప్పుడే తేల్చుకుంటా అని సిద్ధూ ఆవేశంగా వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.