Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమని తండ్రి సేనాపతి పిలిచి నువ్వే ఈ తండ్రికి శత్రువు అవుతావు అని అనుకోలేదమ్మా.. కన్నతండ్రిని అరెస్ట్ చేయించే అంత గొప్ప ఎత్తుకు ఎదుగుతావని ఊహించలేదమ్మా.. శభాష్ అమ్మా.. నా కడుపున నా అదృష్టదేవత పుట్టిందని అనుకున్నా కానీ నా కూతురే నా పాలిట యమదూత అని ఈ రోజు అర్థమైంది అని అంటాడు.
తండ్రి మాటలకు ప్రేమ ఏడుస్తుంది. లేచిపోయిన దగ్గర నుంచి మా కోసం ఒక్కసారి కూడా రాలేదు కానీ తన కోసం మన ఇంటికి దొంగలా వచ్చి నాకు ద్రోహం చేశావ్ అని అంటాడు. అక్కని ఇరికించడం తప్పు కదా నాన్న చాలా పాపం అనిపించింది అని ప్రేమ అంటుంది. మన ఇంట్లో పని చేస్తూ మా చెల్లిని ఎత్తుకుపోయాడు.. నా కూతురి కూడా లేచిపోయింది.. మేం ఇప్పటికీ గుండెకోతకు గురవ్వడానికి కారణం అయ్యాడు.. అది తప్పు కాదా.. అయినా నెలల పరిచయం కోసం 20 ఏళ్లు పెంచిన తండ్రి అరెస్ట్‌కి కారణం అయ్యావ్.. నిన్ను కన్న నేరానికి గొప్ప పని చేశావ్,, గొప్ప కూతురిగా చరిత్రలో నిలబడిపోతావ్.. కానీ నీలాంటి నమ్మకద్రోహి నా కడుపున పుట్టినందుకు సిగ్గు పడుతున్నాన్ అని సేన అనడంతో ప్రేమ ఏడుస్తూ వెళ్లిపోతుంది.
ప్రేమని ఓదార్చడానికి నర్మద, వేదవతి అందరూ వెనకాలే వెళ్తారు. ప్రేమ ఏడుస్తుంటే ఇంటిళ్లపాది ఊరుకోబెడతారు. కానీ వల్లీ మాత్రం చాలా సంబర పడిపోతుంది. అయితే ఎవరి వల్లా కాలేదు కాబట్టి తాను నవ్వించేసి మంచి పేరు కొట్టేయాలి అనుకుంటుంది. అందరిని పిలిచి ప్రేమ తన ప్లాన్ చెప్తుంది. అమూల్యని ముందుకి తోసి పాట పాడమని చెప్తుంది. చిన్నారి పొన్నారి చిట్టయ్యా అంటూ పాట పాడుతుంది. తర్వాత తిరుపతి ఆకాశాన సూర్యుడు ఉండడు సంది వేలలో అని పాడుతాడు.. ఆ పాటతో ప్రేమని మరింత ఏడిపించేస్తాడు.. చిలకా ఏ తోడు లేక అంటూ వేదవతి పాడుతుంది. ఏడుస్తున్న పిల్లని ఇంకా ఏడిపిస్తారా అని వల్లీ అత్తని లాగేస్తుంది.
నర్మదని వెళ్లమని అంటే నర్మద వెళ్లదు.. ఇక ధీరజ్, చందు, సాగర్ కలిసి కాత్యాయిని భోంచేశావా అని పాడుతారు. ఇక చివరి ప్రయత్నంగా వల్లీ ఇదేమిటమ్మా మామ పాట పాడి డ్యాన్స్ చేస్తుంది. అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. అయినా ప్రేమ నవ్వకపోవడంతో నా వల్ల కాదు అని వల్లీ చేతులు ఎత్తేసి నర్మదకి నవ్వించమని అంటుంది. నర్మద ప్రేమ చెవిలో ఏదో చెప్పి నవ్వించేస్తుంది. ఏంటే ఇంత కష్టపడితే ఒక మాటకి నవ్వేస్తుంది ఏంటి అని అడుగుతుంది. అది అందరూ ఒక్కొక్కరికి చెప్పుకొని నవ్వుకుంటారు. తిరుపతి దగ్గరకి సాగర్, చందు, ధీరజ్ వెళ్లి ఏం చెప్పారు అని అడిగితే ఇందాక మీ ముగ్గురు డ్యాన్స్ చేసేటప్పుడు మీ ముగ్గురి ప్యాంట్‌లు జారిపోయావని చెప్పారని అంటాడు. పరువు పోయింది అని ముగ్గురు అనుకుంటారు.
నర్మద పొద్దున్నే లేచి రెడీ అయి సాగర్‌ని నిద్ర లేపి ఈ రోజు నీ వీఆర్‌ఓ రిజల్స్ వస్తాయి కదా.. గుడికి వెళ్లి పూజ చేయించాలి అనుకున్నాం కదా లేచి రెడీ అవ్వు అంటుంది. ఇక ధీరజ్ ప్రేమని నిద్ర లేపుతాడు. ఇద్దరూ జాగింగ్‌కి బయల్దేరుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.