Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు వల్లీ ఉద్యోగం గురించి ప్రిన్సిపల్‌తో మాట్లాడుతాడు. ఆయన వల్లీని ఇంటర్వూకి రమ్మని పిలుస్తారు. ప్రేమ, నర్మదలు వల్లీకి కంగ్రాట్స్ చెప్తూ ఇలా చేస్తామని ఊహించలేదు కదా.. దొంగ సర్టిఫికేట్లు అని చెప్తామని అనుకున్నావా.. నువ్వు ఉద్యోగం చేయాలి అన్నదే మా ప్లాన్.. నువ్వు దొంగ సర్టిఫికేట్లు అని చెప్పలేవు.. నీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి పిల్లలకు చెప్పలేక తిప్పలు పడాలి అదే మా ప్లాన్ అని అంటారు.
వల్లీకి అందరూ కంగ్రాట్స్ చెప్తారు. రామరాజు బాగా చదువు చెప్పి తనకు మంచి పేరు తీసుకురావాలని అంటారు. భాగ్యం, ఆనంద్రావు వెళ్లిపోతుంటే వల్లీ సన్మానం చేయాలి అని ఆపుతుంది. భాగ్యం, ఆనంద్‌రావు ఆగకుండా పారిపోతారు. వెనాకాలే వల్లీ పరుగులు పెడుతుంది.
ధీరజ్ నిద్ర లేచే సరికి ప్రేమ కత్తులు, గొడ్డళ్లు పక్కన పెట్టుకొని కూర్చొని కోపంగా చూస్తుంది. ధీరజ్ లేచి భయపడతాడు. ఏంటే ఇలా దెయ్యంలా కూర్చొన్నావ్ అంటే రాత్రి ఏం చేశావ్రా అని ప్రేమ అడుగుతుంది. ఏం చేయలేదు అని ధీరజ్ అంటే ఏం చేయలేదా.. అని ప్రేమ మీదకు వెళ్తుంది. మా అమ్మ పప్పుచారు, ఆమ్లెట్ చేస్త బాగా తిన్నా అని అంటాడు. దానికి ప్రేమ నేను అడిగేది నువ్వు నాకు ముద్దు పెట్టడం గురించిరా.. పైకి అమాయకుడిలా ఉంటావ్ కానీ నీలో పెద్ద మన్మధరాజా ఉన్నాడురా అని అంటుంది. నువ్వేంటే ఇంత అమాయకుడి మీద నిందలు వేస్తున్నావ్ నేను ఎప్పుడు తాగానే అని ధీరజ్ అంటాడు.
ప్రేమ కోపంగా కత్తితో దూసుకుపోయి రాత్రి ఫుల్లుగా తాగి నన్ను ముద్దు పెట్టుకొని ఏం లేదు అని అంటావా గుర్తు తెచ్చుకోరా అని అంటుంది. ధీరజ్ గుర్తు చేసుకొని ఇంత బీభత్సం చేశానా.. అని అనుకొని రాత్రి ఇంతలా చేశానా.. మత్తులో చేసిన తప్పునకు ఇప్పుడు సరిదిద్దుకుంటా.. ఏం చేయలేదు అని లైట్ తీసుకో అని అంటాడు. ప్రేమ మళ్లీ మీదకు వెళ్తే చర్చలతో సరిదిద్దుకుందాం అని అంటాడు. నాకు ఎందుకు ముద్దు పెట్టావ్ అని ప్రేమ అడుగుతుంది. ఏ ఉద్దేశంతో ముద్దు పెట్టావ్ అని అడుగుతుంది. ఏం లేదు అని ధీరజ్ అంటాడు. నీ మనసులో ఏదో ఒక ఉద్దేశం లేకపోతే నాకు ముద్దు పెట్టవు అని అంటుంది. ఏదో ఒక ముద్దు పెట్టినందుకు ఇంత టార్చర్ ఏంటే అని ధీరజ్ తల బాదుకుంటాడు.
సాగర్ టిప్ టాప్‌గా రెడీ అయి ఎలా అయినా డబ్బు ఏర్పాటు చేసి జాబ్ కొనేయాలి అనుకుంటాడు. నాన్న లేడు అని సంతోషంగా బయటకు వెళ్తుంటే రామరాజు బయటే ఉంటాడు. సాగర్ టక్ సోకు చూసి రైస్ మిల్లుకి ఇంత టిప్‌టాప్ ఎందుకురా.. నువ్వేం ఏసీలో ఉద్యోగానికి వెళ్లడం లేదు.. అప్పుడప్పుడు మనమే బస్తాలు మోయాలి.. వేరే వాళ్లకి బియ్యం ఇవ్వమంటే ఇవ్వలేదు.. రోజు రోజుకి ఎలా తయారవుతున్నాడు.. చేతకాని వెధవ ఒక్క పనీ సరిగా చేయడు.. అని తిట్టి బట్టలు మార్చుకొని రమ్మని పంపిస్తాడు. నర్మద మొత్తం వింటుంది. సాగర్ బాధగా టక్ తీసేసి బట్టలు మార్చడానికి వెళ్తాడు.
సాగర్ డ్రస్ మార్చేసి వస్తే రామరాజు పిలిస్తే మళ్లీ ఏంటి నాన్న అని చిరాకు పడతాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావ్ అని రామరాజు షాప్ అతనికి ఇవ్వాల్సిన రెండు లక్షలు ఇచ్చి నీకు పనికి మాలిన పనులు ఎక్కువ అయిపోయావి.. ముందు ఈ డబ్బు ఆయనకు ఇవ్వు అని ఇస్తాడు. సాగర్ చిరాకు పడితే వేదవతి సర్ది చెప్పాలని చూస్తుంది. నర్మదతో వేదవతి వాడికి సర్ది చెప్పవే అంటే అన్నవన్నీ మీరు అనేసి నాకు చెప్పమంటున్నారు అంటుంది. ఇక నర్మద సాగర్‌తో రోజూ జరిగేది ఇదే కదా కోపంలో ఏం చేయలేం ప్రశాంతంగా రైస్ మిల్లుకి వెళ్లు అని చెప్పి డ్యూటీకి వెళ్లిపోతుంది.
వల్లీ అక్కడే ఉండి మొత్తం విని నర్మద మీద పగ తీర్చుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని సాగర్ దగ్గరకు వెళ్తుంది. సాగర్ కోపంతో బిందెలు తన్నేస్తాడు. ఏంటి మరిది గారు కాలికి దెబ్బ తగులుతుంది. మీరు చేసేది రైస్ మిల్లులో మూటలు మోసే పని అని మీ నాన్న అన్న మాటలకు బాధ పడతారా.. ఆ మాట మీ మామ అంటే తట్టుకోలేకపోతున్నావ్.. మరి అదే మాట కన్నతండ్రి బాధ పడవా.. ఇదే నర్మద మనసులో బాధ తెలిస్తే ఇంకెంత బాధ పడతావో అంటుంది. సాగర్ షాక్ అయి ఏంటి వదినా అంటాడు. నువ్వు మూటలు మోస్తున్నావ్ అని నర్మద కూడా చాలా ఫీలవుతుందని చెప్తుంది. లోలోపల చాలా కుమిలిపోతుందని అంటుంది. నర్మద అలా ఎప్పటికీ అనుకోదు అని సాగర్ అంటే వల్లీ ఇంకా ఎక్కిస్తుంది. ఒకటికి రెండు సార్లు నాతో చెప్పి బాధ పడిందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.