Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, ప్రేమ జోరు వానలో నిల్చొని మాట్లాడుతారు. నర్మద ప్రేమతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. ప్రేమ మాత్రం నువ్వు చేసింది నాకు నచ్చలేదు నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని అనేస్తుంది. నర్మద షాక్ అయిపోతుంది.
నర్మద ప్రేమతో నేను నీతో మాట్లాడొద్దా అని అంటే నీ మీద నీకు చాలా చాలా కోపంగా ఉంది నేను నీతో మాట్లాడను నన్ను వదిలేయ్ అక్కా అని ప్రేమ అనగానే నర్మద వెళ్లిపోతుంది. వర్షంలో అలా ఉండటం వల్లి ప్రేమకి జలుబు చేస్తుంది. ధీరజ్ డబ్బులు పట్టుకొని లెక్క పెడుతుంటే ప్రేమ తుమ్ముతూ ఉంటుంది. ధీరజ్ చూసి ఏంటి వర్షంలో తడిచావా! ఒకటే తుమ్ముతున్నావ్ అని అడుగుతాడు. టవల్ తీసుకొని వచ్చి తుడుచుకోమని అంటాడు. ధీరజ్ చూపించిన ప్రేమకు ప్రేమ అలా ధీరజ్‌ని చూస్తూ ఉండిపోతుంది. ధీరజ్ ఎంత పిలిచినా చూడకుండా అలా ఉండిపోతుంది. దాంతో ధీరజ్‌నే ప్రేమ తల తుడుస్తాడు. తెలుసునా.. తెలుసునా మనసులో తొలి కదలికా.. అంటూ ప్రేమ సాంగ్ వేసుకుంటుంది.
ధీరజ్ ప్రేమతో ఎవరైనా వర్షంలో తడిస్తే తల తుడుచుకుంటారు. కానీ తమరేమో ఫ్యాషన్ షూలో నిల్చొన్నట్లు నిల్చొన్నారు అని ధీరజ్ అని తర్వాత వేడి నీరు తీసుకొస్తాడు. ప్రేమతో ఓయ్ ఆవిరి పడుదువురా.. జలుబు ఎక్కువ అయితే జ్వరం వస్తుంది.. అని అంటాడు. ప్రేమ అలాగే చూస్తుంటే చూపులతో చంపింది చాలు రా అని తీసుకెళ్లి ప్రేమతో కలిసి ఆవిరి పడతారు. ఇద్దరూ కలిసి ఆవిరి పడతారు. ప్రేమ ధీరజ్‌తో నేను నీకు ఏమవుతాను అని అడుగుతుంది. ఇదేం ప్రశ్న అని ధీరజ్ అడిగితే.. వరలక్ష్మీ వ్రతానికి నా కోసం మనస్ఫూర్తిగా చీర తెచ్చానని అన్నావ్.. ఇప్పుడు నాకు ఎక్కడ జలుబు చేస్తుందో అని కంగారు పడిపోతున్నావ్.. నా మీద ఎక్కడ లేని శ్రద్ధ చూపిస్తున్నావ్.. నేను ఒక వస్తువునే అయితే నువ్వు ఇంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు.. నేను నిజంగా ఒక వస్తువునే అయితే నువ్వు ఎందుకు నా కోసం ఇంత ఎమోషనల్ అవుతున్నావ్.. ఎందుకు నా మీద ఇంత బాండింగ్ చూపిస్తున్నావ్.. నా గురించి నీ మనసులో ఏం అనుకుంటున్నావ్ చెప్పు.. నీ మనసులో నేను ఏంటో చెప్పు అని అడుగుతుంది. ధీరజ్ సైలెంట్‌గా లేచి వెళ్లిపోతాడు. తను అడిగిన ప్రశ్నలకు నేను ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నా.. తను అడిగినట్లు నా మనసులో తన స్థానం ఏంటి అని ఆలోచిస్తాడు.
నర్మద కూడా తడిచి గదిలోకి వస్తుంది. సాగర్ బుంగ మూతి పెట్టి కూర్చొని నర్మదని చూసి.. నమస్తే మేడం.. బాగున్నారా మేడం అని అంటాడు. ఏంటి బాబుగారికి ఎక్కువ అయింది అని నర్మద అంటుంది. దానికి సాగర్ మొగుడు అన్న వాడు ఒకడు ఉన్నాడు వాడు ముద్దూ ముచ్చట కోసం ఎదురు చూస్తాడని తెలీదు. ఎంత సేపు ఇళ్లు కుటుంబం నీ తోటి కోడలు ప్రేమ తప్ప నా గురించి ఆలోచించావా. ఒక మాటలో చెప్పాలి అంటే విరహంతో కాలిపోతున్నా అని అంటాడు. దానికి నర్మద తల తుడుచుకుంటూ ఎక్కువైంది తగ్గించుకుంటే మంచిది అంటాడు. సాగర్ లేచి డోర్ వేసి బంగారం వర్షంలో తడిచిపోయావా.. నేను నీకు చీర కడతా అని కొత్త గున్నా ఆశ నువ్వే అనే రొమాంటిక్ సాంగ్‌కి ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటారు.
మరోవైపు తిరుపతి వీధిలోకి వెళ్తే పిల్లలు అందరూ వెంట పడి చెంబు పట్టుకొని లాగుతారు. ఇడ్లీ బాబాయ్ అక్కడే సైకిల్ మీద ఇడ్లీ అమ్ముతూ ఉంటాడు. ఇడ్లీ బాబాయ్ పాటలు పాడుతూ కారం పొడి ఇడ్లీ అల్లం చట్నీ ఇడ్లీ అంటూ పాడుతాడు. తిరుపతి అతన్ని చూసి ఓమై ఇడ్లీ అన్నయ్యా నువ్వేంటి ఇలా అంటే ఆస్తులు అన్నీ పోయావి కదా అందుకే ఈ బిజినెస్ అని అంటాడు. ఇక తిరుపతి తనకు ఇడ్లీ తినిపించమని అంటాడు. ఇడ్లీ బాబాయ్ తినిపిస్తూ చెంబు జాగ్రత్తగా చూసుకో చెంబు కట్ చేస్తే నీకు ఈ జన్మకి పెళ్లి కాదు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.