వసుధార రూమ్‌కి వెళ్లిన రిషి... ఆమె మాటలకు చాలా ఇన్‌స్పైర్ అవుతాడు. అదే టైంలో స్టడీస్‌పై కాన్సెంట్రెట్ చేయాలని హితబోధ చేస్తాడు. ఇంతలో తనకు ధైర్యం గురించి చెప్పొద్దని వసూ అంటే ధైర్యం అని... ధైర్యం అంటేనే వసూ అని కోతలు కోస్తుంది. ఇంతలో రిషి బొద్దింకా అని అరుస్తాడు. అంతే భయంతో ఎగిరి గంతేసి రిషిని కౌలిగించుకుంటుంది. కాసేపు ఇద్దరూ అలానే ఉండిపోతారు. కట్ చేస్తే సీన్ రిషి వాళ్ల ఇంటికి వెళ్తుంది.
అక్కడ ఉదయాన్ని రిషి ఎక్స్‌ర్‌సైజ్ చేస్తుంటాడు. అక్కడకు వచ్చిన గౌతమ్ తన కల గురించి చెబుతుంటే విసుక్కుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్రకు తన స్టోరీ చెబుతాడు. ఊహించుకోమని చెప్పి గౌతమ్, రిషి, వసుధార మధ్య లవ్ ట్రాక్ గురించి చెప్తాడు. గౌతమ్ కాలేజీలో వసుధారకు లవ్ ప్రపోజ్ చేస్తాడు... ఇంతలో రిషి వచ్చి అతను ఇచ్చిన పువ్వును కట్ చేస్తాడు. అంతే వసుధార గట్టిగా నవ్వుతుంది. అరే మోసం మోసం అంటు అరుస్తాడు. ఇంతలో మహేంద్ర, రిషి గట్టిగా కేకలు వేస్తారు. అరే ఏంట్ర ఇదీ అంటు గద్దిస్తారు. గౌతమ్‌కు మహేంద్ర హితబోధన చేస్తాడు. నువ్వు పాజిటివ్‌గా పని చేస్తే విలన్ పారిపోతాడాని ఎనర్జీ ఇస్తాడు. ఇంతలో రిషి కలుగుజేసుకొని డాడ్ వాడేదో చెప్తుంటాడు.. దానికి మీరు కూడా మూడ్ పాడుచేసుకుంటారెందుకని ప్రశ్నిస్తాడు. అంతే నవ్వుకొని మహేంద్ర వెళ్లిపోతాడు. గౌతమ్ కూడా అక్కడి నుంచి జారుకుంటాడు.
తర్వాత సీన్ వంట గదికి షిప్టు అవుతుంది. ధరణి, జగతి మాట్లాడుకుంటే.. దేవయాని ఎంట్రీ ఇస్తుంది. అక్కడ ఇద్దరి మధ్య చిన్న మాటల యుద్ధం నడుస్తుంది. దేవయానికి ధరణి కాఫీ ఇస్తుంది. బాగుందని మెచ్చుకుంటుంది. ఇది తను చేసింది కదాని.. జగతి అత్తయ్య చేసిందని చెప్పి షాక్ ఇస్తోంది. అంతే కోపంతో ఊగిపోయిన దేవయాని... కొంచెం తగ్గి ఉండమని హెచ్చరిస్తుంది. దానికి జగతి స్ట్రాంగ్ కౌంటరే ఇస్తుంది. రాత్రి ఎందుకు లేట్‌గా వచ్చారని అడుగుతుంది దేవయాని. దానికి బయట షికారుకు వెళ్లామని చెబుతుంది జగతి. మీరు కూడా బావగారితో అలా తిరిగి రావచ్చని సూచన చేస్తుంది జగతి.
ఇంతలో రిషి ఎంట్రీ ఇచ్చి తన వదిన ధరణికి కాఫీ అడుగుతాడు. దేవయానికి కలుగుజేసుకొని కాఫీ ఇస్తాని చెబుతుంది. తన బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నందుకు దేవయానికి థాంక్స్ చెబుతుంది జగతి. రా ధరణి మనకు చాలా పనులు ఉన్నాయంటూ జగతి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
తర్వాత సీన్ కాలేజీలో ఉంటుంది. అక్కడ రిషి క్లాస్‌లో ఉండగానే ఏదో నోటీస్ వస్తుంది. దీంతో రేపు సెలవు ఉంటుందని సంబరపడిపోతుంది వసుధార. కానీ రిషి ఆమెను వార్నింగ్ ఇస్తున్నట్టు చూస్తూ.. నోటీస్ చదువుతాడు. రేపు సెలవు అని చాలా మంది అనుకుంటున్నారని కానీ.. ఓ పేరున్న సంస్థ స్కాలర్‌షిప్ టెస్టు నిర్వహిస్తుందని ప్రకటిస్తారు. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్లు పేర్లు ఇమ్మని అంటారు. అంతా వసుధార పేరు ఇస్తుందని అమె వైపు చూస్తారు. కానీ భయంతో వసుధార పేరు ఇవ్వడానికి వెనుకాడుతుంది. కాసేపు సీరియస్‌గా చూసిన రిషి... తన వసుధార పేరు ఇచ్చేసి అటెండర్‌ను అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత వసుధారను పిలిచి క్లాస్ పీకుతాడు.
రేపటి ఎపిసోడ్
రెస్టారెంట్‌లో కూర్చొని ఉన్న రిషికి కాఫీ తీసుకొస్తుంది వసుధార. నీకో మెసేజ్ పంపించాను చూశావా అని అడుగుతాడు. లేదు అంటుంది. అయితే ఇంటికెళ్లాక తీరికగా చదువుకో అంటాడు. ఇంత దగ్గర ఉన్నప్పుడు మెసేజ్ ఏంటని ప్రశ్నిస్తుంది. నాకెందుకు ఈ ఆలోచన రాలేదంటూ వెటకారం చెస్తాడు. అందులో ఏముందో అన్న టెన్షన్ ఎందుకని అంటుంది. వసుధార ప్రశ్నల ధాటికి సీరియస్‌గా వెళ్లిపోతాడు రిషి. మెసేజ్‌లో ఏముందబ్బా అనుకుంటూ ఆలోచిస్తుంది వసుధార...