రిషి తన బెడ్‌రూంలోనే కూర్చొని వసుధార గురించి ఇంకా ఆలోచిస్తున్నాడు. ఇంతలో మహేంద్ర, జగతి కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో ఏమైనా వచ్చిందా ఆని అనుకుంటాడు. పరుగు పరుగున వెళ్లి చూస్తాడు.. కానీ మహేంద్ర, జగతి మాత్రమే కనిపిస్తారు...
మహేంద్ర:- జగతీ... మన పుత్ర రత్నం వస్తున్నాడు... వసుధార గురించి అడుగుతాడేమో నువ్వేమీ చెప్పకు.
జగతి:- ఎందుకలా
మహేంద్ర:- నా ఊహ కరెక్ట్ అయితే మన కారు సౌండ్ విని వచ్చుంటాడు.. వసుధార గురించి ఆరా తీయడానికి ఏదేదో అడుగుతాడు. వాడుతో నేను ఓ ఆట ఆడుకుంటాను.
జగతి:- మహేంద్రా....
మహేంద్ర:- ఊ... (వద్దు అన్నట్టు మెల్లగా చెబుతాడు)
రిషి:- డాడ్
మహేంద్ర:- హే... రిషీ.. ఇంకా నిద్రపోలేదా... ఇంతటైం అయిందీ..?
రిషి:- ఆ.. లేదు డాడ్, నిద్ర పట్టడం లేదు.
(జగతి, మహేంద్ర మాకు అంతా తెలుసులే అన్నట్టు మొహాలు పెడతారు)
రిషి:- మీరు ఎక్కడికి వెళ్లారు.?
మహేంద్ర:- మే... మేమా? ఎక్కడికి వెళ్తాం రుషీ..ఏదో అలా అలా వెళ్లి వచ్చాం లే..
(అబద్దం చెప్పడం ఇష్టం లేని జగతి మొహాన్ని సీరియస్‌గా పెడుతుంది. మహేంద్ర వైపూ కోపంగా చూస్తుంది. )
వసుధార వీళ్లతో రాలేదంటీ? అన్ని వైపులా కళ్లతోనే వెతుకుతూ అనుకుంటాడు రిషి. మరి ఎక్కడ ఉన్నట్టు అని ఆలోచిస్తుంటాడు.
మహేంద్ర:- ఏంటి రిషి అలా చూస్తున్నావ్..
రిషి:- అ... ఏం లేదు... డాడ్. ఏం లేదు.
రిషి సమాధానానికి మహేంద్ర వెటకారంగా తల ఊపుతాడు. ఇంతలో సీరియస్‌గా చూస్తున్న రిషి... అడిగితే గానీ సమాధానం చెప్పరా అంటూ నసుగుతాడు. ఎలా అడగాలి అంటూ దారులు వెతుకుతుంటాడు.
మహేంద్:- అంతా ఓకేనా అంటా మళ్లీ వెటకారంగా
రిషి:-ఊ... అంతా ఓకే డాడ్.
పాపం రిషిని మహేంద్ర ఆడుకుంటున్నాడు అనుకుంటోంది జగతి. కానీ ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటుంది.
రిషి:- మీకేంటి ఇంతలేట్ అయింది.
మహేంద్:- ఎక్కడికి వెళ్లారు అని అడుతున్నావ్ అంతేనా
రిషి:- ఆ... అదే
మహేంద్:- ఎక్కడికి వెళ్లాం అంటే.. జగతీ........ మనం ఎక్కడికి వెళ్లాం.... ఆ... లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాం. ఐసక్రీం తిన్నాం... తర్వాత అక్కడే వెళ్లాం..
రిషి:-అక్కడికి అంటే...
మహేంద్:- అక్కడికి అంటే....ఎక్కడికి వెళ్లాం.. జగతీ.. ఇంకెక్కడకి వెళ్లాం.. ఆ... హోటల్‌కి వెళ్లి భోజనం చేశాం కదా...
ఎన్నెన్ని అబద్దాలు చెబుతున్నావ్ మహేంద్రా అని అనుకంటుంది జగతి పక్కకి మొహం తిప్పుకొని.
మహేంద్:-హోటల్‌కి వెళ్లి ఫుల్‌గా తినేశాం రిషీ.. నిద్రొచ్చేస్తుంది పొద్దునే మాట్లాడుకుందాం...
ఏంటీ మహేంద్ర నీకు ఈ శాడిజం అని మళ్లీ మనసులోనే అనుకుటుంది జగతి.
మహేంద్:- పద జగతి పడుకుందాం... గుడ్ నైట్ రిషి
రిషి:- డాడ్... గుడ్ నైట్ డాడ్
అసలు విషయం చెప్పలేదు కదా అనుకొని తెగ ఫీల్ అవుతుంటాడు రిషి.
రిషి:- పక్కన మేడం లేకుంటే డైరెక్ట్‌గా అడిగే వాడిని.. ఏంటో చెప్పకుండా వెళ్లారు.
బెడ్ రూమ్‌లోకి వెళ్లాక.. జగతి, మహేంద్ర గొడవ పడతారు..
జగతి:- ఏంటి మహేంద్ర నువ్వు.. రిషిని అలా ఆట పట్టిస్తున్నావ్ తప్పు కదా..
మహేంద్ర గట్టిగా నవ్వు తాడు..
జగతి:- మన ఇద్దరం వసు దగ్గరకు వెళ్లొచ్చాం.. వసు ఎక్కడ ఉందో ఏంటో అని ఆరాటపడుతున్నాడు కావచ్చు.
మహేంద్ర:- అలాంటప్పుడు వసుధారకే ఫోన్ చేసి తెలుసుకోవచ్చుగా..
జగతి:- ఏమో మహేంద్ర...రిషి ఆరాటం చూస్తుంటే... వసు గురించి తెలుసుకోవాలనే అన్నట్టు కనిపిస్తుంది కదా.. నువ్వెందుకు కావాలనే అంత చేస్తున్నావ్. అలా చేయడం కరెక్ట కాదు కదా మహేంద్ర... వాడు బాధపడతాడు మహేంద్ర.
మహేంద్ర:- జగతీ.. బాధపడతారని మనం సహాయం చేస్తే పిల్లలు నేర్చుకోలేరు. చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇదే. బాధపడితేనే కొన్ని నేర్చుకోగలరు.. బాధ పడతారు.. అది ఓ పాఠంలో ఎప్పటికీ గుర్తు ఉంటుంది.
జగతి:- మహేంద్ర చిన్న విషయానికి కూడా పెద్ద పెద్ద సూత్రాలు చెబుతావేంటి?
మహేంద్ర గట్టిగా నవ్వుతాడు..
జగతి:- పాపం తనూ...
మహేంద్ర:- చూడు జగతి.. రిషి గురించి నీ తల్లి మనసు పడే ఆరాటం నాకు తెలుస్తోంది. కానీ రిషి ఏంటో నాకు పూర్తిగా తెలుసు.. నా అంచనా కరెక్ట్ అయితే రిషి ఇప్పుడు మన డోర్ ముందే అటూ ఇటూ టచ్చాడుతూ ఉంటాడు.
జగతి:- ప్చ్... నువ్వు..ఊరుకో మహేంద్ర. అన్నీ ఇలానే మాట్లాడతావు. రిషి ఇక్కడికి ఎందుకు వస్తాడు.
మహేంద్ర:- రిషి ఇక్కడికి వస్తాడు. కానీ మన డోర్ కొట్టలేడు. తట్టలేడు... అలాని.. వసుధార గురించి తెలుసుకోకుండా ఉండనూ లేడు. మరి వసూ ఫోన్ తీయడం లేదో.. పంతానికి పోయి వీడు ఫోన్ చేయడం లేదో కానీ...
జగతి:- రిషి ఉంటాడని నేను అనుకోవడం లేదు మహేంద్ర.
మహేంద్ర:- నువ్వే చూద్దువుగానీ రా...
అంటూ జగతి చేయి పట్టుకొని బెడ్ రూం తీస్తాడు.
ఇద్దరూ చూసే సరికి రిషి నిజంగానే అక్కడ ఉంటాడు. ఏదో ఆలోచిస్తుంటాడు.
జగతి:- నువ్వు మామూలుగా ఆలోచించలేదు మహేంద్ర. రిషి మనసుని బాగానే తెలుసుకున్నావ్.
మహేంద్ర:-మహేంద్ర భూషణా మజాకా
ఇంతలో వీళ్లిద్దరినీ రిషి చూస్తాడు. ఏం చెప్పాలో రిషికి అర్థం కాదు. అక్కడ ఏం చేస్తున్నారో జగతి, మహేంద్ర చెప్పలేరు. ఈ పరిస్థితిలో సీరియస్‌గా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్లిపోతుంటాడు రిషి.
మహేంద్ర:-రిషీ..
డాడ్ పిలిచిన పిలుపునకు తిరిగి చూస్తాడు రిషి.
చూశావా వాడి ఇగో ఎంత ఉందో అంటూ జగతితో అంటాడు మహేంద్ర. ఇప్పటి వరకు మన కోసం వెయిట్ చేశాడు. మనం పిలవగానే వెళ్తున్నాడు. అంటూ బయటకు నడిచి వస్తాడు.
మహేంద్ర:- ఏంటీ వెళ్లిపోతున్నావ్.
రిషి:- ఏం లేదు డాడ్.
మహేంద్ర:- నాతో ఏమైనా పని ఉందా నీకు?
రిషి:- వసుధార ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
అరే... వసుధార గురించి నీవు ఎప్పుడు చెబుతావురా... మనసులో మాట ఎప్పుడు చెప్తావురా అంటూ మహేంద్ర మనసులో అనుకుంటాడు.
మహేంద్ర:-వసుధార ఎక్కడ ఉందని అడిగావా?
రిషి:- మీరు చెప్పారా?
మహేంద్ర:- చెప్పను.. నీకు లొకేషన్ పంపిస్తా. నువ్వే వెళ్లి వెతుక్కో.
రిషి:- ఎక్కడికి షిప్టు అయింది... ఎక్కడ ఉంది?
మహేంద్ర:- చెప్పానుగా.. వెళ్లి వెతుక్కో..
దూరం నిలబడి చూస్తున్న జగితి... మహేంద్ర చాలా ఎక్కువ చేస్తున్నాడు అనుకుంటుంది. రిషితో ఆడుకుంటున్నాడు.
రిషి:- నేను ఎందుకు వెళ్తాను. వెళ్లను.
మహేంద్ర:- గుడ్ నైట్... ఊ...
రిషి:- గుడ్ నైట్
ఇద్దరు ఎవరి రూంకి వాళ్లు వెళ్లిపోతారు.
జగతి:- ఎందుకు మహేంద్రా? వాడి మనసు అసలే సన్నితం. ఏదో ఒకటి రెండు సార్లు ఆట పట్టించాలి కానీ. వాడితో నువ్వు ఇలా బిహేవ్ చేయడం నాకేం నచ్చలేదు మహేంద్ర.
మహేంద్ర:- జగతీ... నీకు అర్థం కాదు. మనం మరీ వాడిని వదిలేస్తే వాడు ఇంకా అలాగే ఉంటాడు. వాడిని తెలుసుకోనిద్దాం. ఆమాత్రం బాధేనా పడకపోతే ఎలా
జగతి:- ఇప్పుడేంటీ?
మహేంద్ర:- లొకేషన్ పంపిస్తా వెళ్లూ అన్నాను.. వెళ్లనూ అన్నాడు.
జగతి:- పొద్దున్న వెళ్తాడేమో..
మహేంద్ర:- హా.. హా... అందుకే నీకు రిషి గురించి పూర్తిగా తెలియదేమో అన్నాను. పొద్దున్నే కాదు.. ఇప్పుడే వెళ్తాడు. చూడు.
అంటూ తన ఫోన్ నుంచి వసుధార ఉన్న లొకేషన్ పంపిస్తాడు.
మహేంద్ర:- లొకేషన్ పంపించాను. చూసుకున్నాడు కూడా.. ఇప్పుడు చూడు రిషి కారు తీసుకొని కచ్చితంగా బయటకు వెళ్తాడు.
ఇంతలో కారు సౌండ్ అవుతుంది. పై నుంచి మహేంద్ర, జగతి చూస్తుంటారు.. రిషి కారు బయటకు వెళ్తుంది. ఇదేంటి మహేంద్ర అన్నట్టు జగతి చూస్తుంది. జగతికి ఇదేమీ అర్థం కాదు.
మహేంద్ర:- వాడు వెళ్తుంది వసుధార దగ్గరకి కాదు జగతి. వాడి మనసును వాడే తెలుసుకోవడానికి వెళ్తున్నాడు.
దీంతో సీన్ వసుధార రూమ్‌కు షిప్టు అవుతుంది. అక్కడ మేడపై వసుధార ఒంటరిగా నిల్చొని ఉంటుంది. తన రూం నుంచి హైదరాబాద్‌ను చూసి మురిసిపోతుంది వసుధార. హలో... ఇదే నా సామ్రాజ్యం. ఇదే నా ఇల్లు. అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది. వెంటనే ఫోన్ గుర్తుకు వస్తుంది. ఫోన్ ఏమైంది అసలు మోగనే లేదు. అనుకుకుంటుంది. ఛార్జింగ్‌లో పెట్టి మర్చిపోయాను కదా అని గుర్తుకు వస్తుంది. వెంటనే వెళ్లి ఫోన్ తీసుకుంటుంది.
ఫోన్ చూసి షాక్ తింటుంది. రిషి సార్ ఇన్ని మిస్డ్ కాల్స్ ఏంటని కంగారు పడుతుంది. అయిపోయాను నేను. ఛార్జింగ్‌లో ఉందని చెప్పినా కూడా నమ్మరనుకుంటుంది. తిడతారు.. కచ్చితంగా తిడతారు.
ఇంతలో రిషి కారు.. వసుధార రూం వద్దకు వచ్చి ఆగుతుంది.
వసుధార తన ఫోన్ నుంచి రిషికి ఫోన్ చేస్తుంది. అవును అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కాల్ కట్ చేస్తుంది.
ఇదేంటీ... ఫోన్ చేసి కట్ చేసిందని అనుకుంటాడు రిషి. మిస్డ్ కాల్ ఇచ్చిందా.. కాల్ కట్ చేసిందా అని రిషి అనుమాన పడతాడు. అయినా డాడ్ ఇచ్చిన లొకేషన్ రెస్టారెంట్ చూపిస్తోంది ఏంటీ? అంటే వసుధార ఇక్కడే ఉందా..
మళ్లీ వసుధార ఫోన్ చేస్తుంది. మొదటి రింగ్‌కే రిషి ఫోన్ లిఫ్ట్ చేసి తిట్టడం మొదలు పెడతాడు.
రిషి:- వసుధారా... ఏంటసలు నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి. మళ్లీ కాల్ చేయాలి కదా
వసుధార:- సార్.. సార్.. ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టాను.. మర్చిపోయాను.
రిషి:-అలా ఎలా మర్చిపోతావ్. నువ్వు ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో అని నేను టెన్షన్ పడుతున్నాను.
రిషి:- ఫోన్ తియ్యవు.. ఆన్సర్ చెయ్యవు.. ఎక్కడుంటావో అస్సలు చెప్పవు. ఇలా అయితే ఏమనుకోవాలి.
వసుధార:- తిట్టకండి సార్.
వసుధార:- చెప్పాను కదా.. ఫోన్ ఛార్జింగ్‌లో ఉందని...
రిషి:- నేను మాట్లాడుతున్నాను... తిడితే ఇలా ఉండదు వసుధారా (ఆమె రూం దగ్గరే, ఆమె వెనుకాలే ఉండి మాట్లాడతాడు)
వసుధార:- అరే.. భలే విచిత్రంగా ఉంది సార్.
రిషి :- ఏంటి విచిత్రం, నా ఫోన్ తీయకపోవడమా?
వసుధార:- కాదు సార్.
రిషి:- మరీ...
వసుధార:- మీరు ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు లేదు సార్. అచ్చం సినిమాలో జరుగుతున్నట్టు.. అక్కడికి మీరు నా వెనుకాలే నిల్చొని మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇదే మాయ సార్.
రిషి:- మాయదారి మాయ అంటారు కానీ.. నేను మీ వెనకాలే ఉన్నాను.. వెనక్కి తిరుగు.
వసుధార:- ఊరుకోండి సార్. మీరు జోకులేస్తున్నారు. మీరు నా వెనుకాలే ఉంటే... ఈ ప్లేస్ గురించి మీకు తెలియదు....(అంటూ వెనుదిరిగి చూసి షాక్ అవుతుంది)
ఇద్దరూ ఫోన్‌లు కట్ చేస్తారు.
వసుధార:- సార్.. మీరు మీరేనా...
రిషి:- ఆ... కాదు.. కాష్మోరా కజిన్‌ని కావాలంటే చూడు కాళ్లు వెనక్కి ఉంటాయి
నిజంగానే కాళ్లను చూస్తుంది వసుధార.
రిషి:- ఏంటీ నిజంగానే కాళ్లవైపు చూస్తున్నావ్, అదికాదు, నువ్వు ఇక్కడ ఉన్నట్టు చెప్పాలి కదా.. డాడ్ చెప్తేనే వచ్చాను ఇక్కడికి.. చెప్పాలా లేదా?
వసుధార:- అంటే.. అదీ.. ఆ...
రిషి:- సరే.. నువ్వు ఇక్కడ ఉన్నావ్ సంతోషం. ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. మధ్య తరగతి వాళ్లకీ...
రిషి:- ఆపుతావా... మీ రెస్టారెంట్ మేనేజర్ హెల్ప్ చేశాడా?
వసుధార:- అవును సార్,,,, సార్ లోపలికి రండీ.. రండీ సార్ రండీ... సార్.. కుడికాలు పెట్టి లోపలికి రండీ..
రిషి:- ఏంటిది వసుధారా... నేనేమీ అత్తారింటిలో అడుగు పెట్టే కొత్త కోడలినా...
వసుధార:- ఏదో అందరూ అలా అంటారు కదా అని ఫ్లోలో అలా అన్నాను సార్.
రిషి:- వసుధారా... ఇంత చిన్న రూంలో నువ్వు ఎలా ఉంటావ్. ఫర్వాలేదా
వసుధార:- నాకేంటి సార్... ఇదే విశాలమైన ఇల్లు. స్టౌవ్ వెలిగిస్తే ఇదే కిచిన్. చాప పరిస్తే ఇదే బెడ్ రూం. చదువుకుంటే రీడింగ్ రూం. డౌర్, కిటికీలు తీసేస్తే ప్రకృతి అందించే చల్లటి ఏసీ రూం. కరెంటు ఖర్చు కూడా ఉండదు.
ఇంతలో కరెంటు వెళ్లిపోతుంది. ఇద్దరూ కంగారు పడతారు.
వసుధార:- అదేంటి సార్ కరెంటు అంటేనే పోయింది..
రిషి:- నీలాంటి గొప్ప గొప్పోళ్లు అలా అంటే ఇలానే జరుగుతుంటాయి.
వసుధార:- బయట చందమామ నా బెడ్ లైట్ సార్. సార్... కూర్చుంటారా..
రిషి:- అదే ప్రయత్నంలో ఉన్నాను.. ఇక్కడ కంటే బయట బాగుంటుందేమో... నీ ఏసీలో కూర్చుందామా
వసుధార:- గుడ్ ఐడియాసార్, అలా ఆరుబయట కూర్చొని వేడివేడి కాఫీ తాగుతూ కథలు చెప్పుకుంటే ఎంత బాగుంటుందో..
రిషి:- నాకు కథలు రావు.
వసుధార :- నేను చెప్తాను సార్
రిషి:- వద్దు వద్దు.. ఆ సెక్షన్ ఇంకా ఎప్పుడైనా పెట్టుకుందాం. ఓకేనా..
వసుధారా:- సరే సార్..
వసుధారా:- హే... పవర్ వచ్చిందీ... పవర్ వచ్చిందీ...
ప్రతి మూమెంట్‌ను ప్రతి సందర్భాన్ని వసుధారా ఆస్వాదిస్తుంది అని మనసులో అనుకుంటాడు..
మళ్లీ సీన్ మహేంద్ర, జగతి బెడ్‌రూంకి షిప్టు అవుతుంది. అక్కడ మహేంద్ర వీడియో గేమ్ ఆడుతుంటాడు. జగతి ఏదో టెన్షన్ పడుతుంది. కోపంతో మహేంద్ర చేతిలో మొబైల్ లాక్కొని పక్కడ పడేస్తుంది.
జగతి:- మహేంద్ర.. రిషి ఇంకా ఇంటికి రాలేదు. నువ్వేమో రిలాక్షడ్‌గా ఉన్నావ్...
మహేంద్ర:- ఏంటి జగతి ఎందుకు కంగారు పడతావ్..
జగతి:- నువ్వు అన్నట్టుగా రిషి వసుధార దగ్గరకే వెళ్లి ఉంటాడా.. లేదా పంతానికి పోయి ఇంకెక్కడికైనా వెళ్లి ఒంటరిగా బాధ పడుతుంటాడా
మహేంద్:- అలా ఏం జరగదులే జగతి. కచ్చితంగా మన పుత్ర రత్నం వసుధార దగ్గరకే వెళ్లి ఉంటాడు. నీ డౌట్ ఇప్పుడే క్లియర్ చేస్తాను ఉండూ..
జగతి:- అయ్యో.. ఏంటీ వసుధారకు ఫోన్ చేస్తావా ఏంటీ... బాగుండదేమో మహేంద్రా
మహేంద్ర:- అవును బాగుండదు... అందుకే మన పుత్ర రత్నానికే ఫోన్ చేస్తున్నాను.
జగతి:- ఆ.. ఏమని అడుగుతావ్
మహేంద్ర:- ఉన్నదే అడుగుతాం
అప్పటికే రిషి వసుధార మాటల్లో పడిపోయి ఉంటారు.
రిషి:- మనసులో ఉన్నది.. మాటల్లో కొన్నిసార్లు రావు కదా వసుధార
వసుధార:- అవును సార్... అలాంటి సందర్భాలు నాక్కూడా ఎదురయ్యాయి.
ఇంతలో రిషి ఫోన్ మోగుతుంది.. డాడ్ చేస్తున్న సంగతి తెలిసి... డాడ్ ఇప్పుడు చేస్తున్నారేంటీ అనుకుంటాడు రిషి.
రిషి:- హలో..
మహేంద్ర:- ఏంటీ రిషీ? ఎక్కడికి వెళ్లావు? నీ స్పెషల్ స్టూడెంట్‌కి స్పెష్ క్లాస్ ఏమైనా తీసుకుంటున్నావా?
రిషి:- ఏమంటున్నారు మీరు?
మహేంద్ర:- నేను ఏం చెప్పానో నీకు అర్థమైందని నాకు అర్థమైంది రిషి. లొకేషన్ ఈజీగానే దొరికిందా... ఆ.. దొరుకుతుందిలే... కానీ మనలో ఉన్న మనసు మాత్రం మనకు అంత ఈజీగా దొరకుదు. ఏమంటావ్ రిషి, అంతేకదా..
రిషి:- ఆ.. మీరు ఏమంటున్నారో నాకు సరిగా అర్థం కావడం లేదు.
మహేంద్ర:- నీకు అర్థం కాకపోయినా.. నీ స్టూడెంట్‌కు చెప్పే పాఠమైనా కాస్త అర్థమయ్యేలా చెప్పవయ్యా
రిషి:- ఏంటి మీరు, నన్నేదో టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నారు.. నేను మళ్లీ కాల్ చేస్తాను.
మహేంద్ర:- గట్టిగా నవ్వుతూ ఫోన్ పెట్టేస్తాడు.
జగతి:- మహేంద్రా... ఇది టూ మచ్
మహేంద్ర:- టూ మచ్ కాదు జగతి.. వాడు పాఠాలు చెప్పడాని కాదు.. నేర్చుకోవడానికే వెళ్లాడు.
జగతి:- ఎందుకలా ఆలోచిస్తావు మహేంద్రా
మహేంద్ర:- జగతీ.. వసుధారతో మనసు విప్పి మాట్లాడాలంటే ఇక్కడ నేను..అక్కడ నువ్వు అడ్డుపడేవాళ్లం. అంటే అడ్డు గోడల్లా ఉండే వాళ్లం. ఇప్పుడు ఆ గోడల్లేవు. ఆ గోడల్లేవ్.. వాడు ఓపెన్ అయ్యి తీరక తప్పదు. జగతీ అస్తమానం మనం వాళ్లిద్దరి గురించి మాట్లాడుకోవడం అంత బాగలేదు కదా
జగతి:- ఊ....చెప్పేదంతా చెప్తావు.. మళ్లీ బాగాలేదని నువ్వే అంటావా...
మహేంద్ర:- అడ్డుగోడల్లేని వారి మనసుల మధ్య దూరం తగ్గాలనే నా ఆలోచన.
ఇక్కడితో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
రేపటి ఎపిసోడ్
వసుధార దగ్గరకు గౌతమ్ వస్తాడు హలో చెప్తాడు. రోజా పవ్వు ఇచ్చి ఐలవ్‌యూ చెప్తాడు. ఇంతలో రిషి వచ్చి పువ్వును కట్ చేస్తాడు.