Guppedantha manasu Telugu Serial Today Episode: శైలేంద్ర‌ను ఇంట‌రాగేష‌న్ చేయ‌డానికి హాస్పిట‌ల్‌కు వ‌స్తాడు ముకుల్‌. కానీ ఫ‌ణీంద్ర వ‌ద్ద‌ని వారిస్తాడు. కొడుకును ఫ‌ణీంద్ర వెన‌కేసుకొని రావ‌డంతో ముకుల్ షాక‌వుతాడు. బంధాలు, బంధుత్వాల‌తో చ‌ట్టానికి ప‌నిలేద‌ని అంటాడు. నా కొడుకు త‌ప్పు చేస్తే మీ కంటే ముందు నేనే శిక్షిస్తాన‌ని ముకుల్‌ కు బ‌దులిస్తాడు ఫ‌ణీంద్ర‌.  శైలేంద్ర వాయిస్ ఆధారంగా దొరికింది కాబ‌ట్టి ఎంత త్వ‌రగా వీల‌యితే అంత త్వ‌ర‌గా ఇన్వేస్టిగేష‌న్ ప్రారంభిస్తేనే నిజ‌మైన దోషులు దొరుకుతారు. లేదంటే నిందితులు కేసును ప‌క్క‌ దారి ప‌ట్టిస్తార‌ని ముకుల్ అంటాడు. కానీ శైలేంద్ర హెల్త్ కండీష‌న్‌ను దృష్టిలో పెట్టుకొని అత‌డిని విచారించ‌డానికి కొంత టైమ్ ఇవ్వ‌మ‌ని ముకుల్‌ను రిక్వెస్ట్ చేస్తాడు ఫ‌ణీంద్ర‌. లోపల కొడుకు దగ్గర కూర్చున్న దేవయాని బాధపడుతూ..


దేవయాని: ఎంత పని జరిగింది నాన్నా నీకు ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదు నాన్నా.. రాజాలాగా తిరగాల్సినోడివి నువ్వు హాస్పిటల్‌ బెడ్‌ మీద పడి ఉండటం ఏంటి నాన్నా.. శైలేంద్ర లేవు నీతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది.


శైలేంద్ర: ఊరికే అడిగిందే అడగకు మామ్‌ చాలా కష్టంగా ఉంది. లోపల సలసలా కాగుతుంది.


దేవయాని: కొబ్బరిబొండం ఏమైనా తీసుకురానా నాన్నా..


శైలైంద్ర: ఆ మంట కొబ్బరిబొండంతో తగ్గేది కాదు.


దేవయాని: అసలు ఏం జరిగింది నాన్నా .. నిన్ను పొడిచింది ఎవరు? ఆ అటాక్‌ ఎలా జరిగింది.


అంటూ జ‌గ‌తిని చంపిన షూట‌ర్‌తో నువ్వు మాట్లాడిన వాయిస్ ముకుల్‌కు దొరికింద‌ని కొడుకుతో చెబుతుంది దేవ‌యాని. నిన్ను పొడిచిన వాళ్లు ఎవ‌రు? వాళ్ల‌తో నీకు శ‌త్రుత్వం ఉందా అని అడుగుతుంది. ఇదంతా అంటూ శైలేంద్ర ఏదో చెప్ప‌బోతుండ‌గా ముకుల్ క‌నిపిస్తాడు. అత‌డిని చూసి శైలేంద్ర కంగారు ప‌డ‌తాడు. అత‌డిని చూసి దేవ‌యాని కూడా భ‌య‌ప‌డుతుంది. నువ్వే ఏదో ఒక‌టి చేసి ఇంట‌రాగేష‌న్‌ను ఆపాల‌ని త‌ల్లిని కోరుతాడు శైలేంద్ర‌. దాంతో దేవయాని బయటకు వెళ్లి శైలేంద్ర చావు బ‌తుకుల మ‌ధ్య ఉంటే ఇంట‌రాగేష‌న్ ఎలా చేస్తార‌ని ముకుల్‌ పై ఫైర్ అవుతుంది.


ముకుల్: జ‌గ‌తి హ‌త్య కేసులో మీ అబ్బాయి ప్ర‌ధాన అనుమానితుడు. సో అతన్ని తప్పకుండా విచారించాల్సిందే..


దేవయాని: ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరేంటి? ఎవరో మిమిక్రీ చేసిన ఆడియో తీసుకొచ్చి నా కొడుకు అనుమానితుడు అంటారేంటి?  


వసుధార: మేడం ముకుల్‌ గారు ఇప్పుడు శైలేంద్ర సార్‌ను తప్పు పట్టడం లేదు. ఆ వాయిస్‌ తనదేనా లేదా అని క్లారిటీ తీసుకుంటా అంటున్నారు. అంతే కదా మేడం.


ముకుల్‌, వ‌సుధార ఎంత‌ స‌ర్ధిచెప్పినా దేవ‌యాని విన‌దు. నా కొడుకును అనుమానించినంత మాత్రానా అత‌డు త‌ప్పు చేసిన‌ట్లు కాద‌ని ఇంట‌రాగేష‌న్‌కు ఒప్పుకోదు దేవయాని. రిషి ఇక్క‌డ ఉంటే ముకుల్‌ను ఇంత సేపు ఇలా మాట్లాడ‌నిచ్చేవాడు కాదు. ఇలాంటి వాళ్ల‌ను ఇక్క‌డ‌కు రానిచ్చేవాడు కాద‌ని దేవ‌యాని అంటుంది. శైలేంద్ర కండీష‌న్ చూసి అత‌డు మాట్లాడే స్థితిలో ఉంటేనే ఇంట‌రాగేష‌న్ చేస్తాన‌ని ముకుల్ చెబుతాడు. దీంతో దేవయాని సరేననడంతో అందరూ కలిసి ఐసీయూలోకి వెళ్తారు. శైలైంద్రను చూసి...


ముకుల్‌: పొత్తికడుపులో పొడిచినట్లున్నారు.


దేవయాని: అవునండి, ఎవరో మొదనష్టపు సచ్చినొళ్లు నా కొడుకును పొట్టన పెట్టుకోవాలని చూశారు. అవి శైలేంద్ర రిపోర్ట్స్‌ మీకెందుకండి


ముకుల్‌: చూస్తేనే తెలుస్తుంది కదా ఎం జరిగిందో 


...అంటూ శైలేంద్రను పిలుస్తాడు ముకుల్‌. శైలేంద్ర మాత్రం నువ్వు ఎంత పిలిచినా నేను మాత్రం పలకను అని మనసులో అనుకుంటుంటాడు. శైలేంద్ర‌ది న‌ట‌న అని మ‌హేంద్ర క‌నిపెడ‌తాడు. ముకుల్ పిలుపుతో శైలేంద్ర స్పృహ‌లోకి వ‌చ్చిన‌ట్లుగా న‌టిస్తాడు. శైలేంద్ర క‌ళ్లు తెర‌వ‌గానే ముకుల్ అత‌డికి కిల్ల‌ర్‌తో మాట్లాడిన వాయిస్ వినిపించ‌బోతాడు. ఏదో ఒక‌టి చేసి ఈ టాస్క్ ఆపాల‌ని ఫిక్స‌యిన శైలేంద్ర ఆరోగ్యం విష‌మించిన‌ట్లుగా నాట‌కం ఆడుతాడు. దాంతో ముకుల్ ఇంట‌రాగేష‌న్‌కు బ్రేక్ ప‌డుతుంది. శైలేంద్ర‌కు ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే ఆ న‌ష్టాన్ని మీరు పూడుస్తారా అంటూ ముకుల్‌ పై సీరియ‌స్ అవుతుంది దేవ‌యాని.


ముకుల్‌: ఈ రోజు కాక‌పోయినా రేపైనా ఇన్వేస్టిగేష‌న్ చేయాల్సిందే.. నిజానిజాలు బయట పడాల్సిందే


త‌ప్పు చేసిన‌వాళ్లు బ‌య‌ప‌డ‌తారు. కానీ ఏ త‌ప్పు చేయ‌ని నా కొడుకు, నేను భ‌య‌ప‌డ‌న‌ని ముకుల్‌తో ఛాలెంజ్ చేస్తుంది దేవ‌యాని. లోప‌ల భ‌యం ఉన్నా పైకి మాత్రం మేక‌పోతు గాంభీర్యం చూపిస్తున్న దేవ‌యానిని చూసి మ‌హేంద్ర లోలోన న‌వ్వుకుంటాడు. ఇంట‌రాగేష‌న్ చేస్తే మ‌ళ్లీ శైలేంద్ర స్పృహ కోల్పోయే ప్ర‌మాద‌ముంద‌ని డాక్ట‌ర్ చెబుతాడు. అత‌డు డిశ్చార్జ్ అయిన త‌ర్వాతే మ‌ళ్లీ వ‌స్తాన‌ని చెప్పి ముకుల్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అరుణ్‌ ఇంటికెళ్లిన కావ్య, రాజ్‌ - స్వప్నను ఇంటికి తీసుకెళ్లమన్న రుద్రాణి