Guppedantha Manasu Telugu Serial Today Episode :


రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని వసుధార రెండు చేతులు జోడించి శైలంద్రను బతిమాలుతుంది. పొగరుగా ఉన్న నువ్వు బలే తగ్గావ్ అంటూ తన ఇగో ఇప్పుడు ఓకే అని శైలేంద్ర వసుతో అంటాడు. మరోసారి వసునీ బతిమాలమని అడుగుతాడు. రిషి గురించి డిటైల్స్ చెప్తే తనకేంటి అని శైలంద్ర అడుగుతాడు


వసు: అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు. మీకు ఏం కావాలి?
శైలేంద్ర: నాకు ఏం కావాలో నీకు బాగా తెలుసు కదా మళ్లీ అడుగుతావు ఏంటి. ఏం పర్లేదు తెలిసినా కూడా మళ్లీ చెప్తాను. నాకు ఎండీ సీటు కావాలి. చెప్పు వసుధార నాకు ఆ సీటు ఇస్తావా లేదా?
వసు: అది నువ్వు బతికుండగా జరగదు
శైలేంద్ర: అదే వసుధార నాకు నచ్చనిది. పిన్ని కూడా చాలా పోరాడింది. ఎండీ సీటు తన కొడుకుకే అప్పగించాలి అని ఆ సీటు చుట్టూ ఓ వలయంలా ఏర్పడి చాలా కాపాడుకుంది. కానీ చివరకు శైలేంద్ర ప్రళయంలో కొట్టుకుపోయింది. తన కొడుకు పక్కన లేకుండా పోయింది. ఒకవేళ నీకు ఏమైనా అయితే రిషి పక్కన ఎవరు ఉంటారు. ఒకవేళ నీకు ఏం కాకపోయినా రిషి పక్కన ఎవరు ఉంటారు. రిషికి ఏమైనా అయితే?
వసు: అంత సీన్ లేదులే కానీ.. చూడండి మీ మైండ్ లోకి అలాంటి ఆలోచనలు కూడా రానివ్వొద్దు. అలాంటి ఆలోచనలు మీ మైండ్ లోకి వస్తే మీకంటే ముందు ఆ ఆలోచనల్నే చంపేస్తాను.
శైలేంద్ర: అబ్బా పర్లేదు వసుధార భర్త మీద చాలా ఇది ఉంది. పసుపు కుంకుమలు కాపాడుకోవాలి.. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. సర్లే నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం. అయినా ఏముంది, ఆ ఎండీ సీటు బ్యాంక్‌లో వేస్తారా.. భర్తకోసం ఆస్తులు అంతస్తులు వదులుకున్నవారు ఉన్నారు. చాలా పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు. అలాంటి పుణ్య భూమి మనది. సో నువ్వు కూడా అలాగే ఎండీ సీటు వదిలేసుకో.. నీ భర్త కోసం నీ భర్త ప్రాణాల కోసం నువ్వు కూడా చరిత్రలో మిగిలిపోతావ్.. ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు చెప్పు. నేను ఆ రోజే చెప్పా ఎండీ పదవి కోసం ఎంత దూరం అయినా వెళ్తా ఎంత మంది అడ్డు అయినా తొలగిస్తా అని చెప్పాను. కానీ మీరు నా మాట వినలేదు. అసలు ప్రాణాలు తీయడం నాకు పెద్ద ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం అలా చేయాల్సి వస్తుంది. చాలా సార్లు ఓపిక పట్టాను కూడా కానీ ఓపిక నశిస్తోంది. పిన్ని చనిపోయిన తర్వాత అయినా ఆ పదవి నాకు వస్తుందని చాలా ఆశగా ఎదురు చూశాను కానీ నీ మొగుడు చివరి నిమిషంలో ఆ సీటులో నిన్ను కూర్చొపెట్టాడు. ఆ సీటులో నుంచి తప్పుకో వసుధార అని బుద్ధిగా చెప్తే పులులు సింహాలు అని ఏవేవో చెప్పావు. సో నేను హర్ట్‌ అయ్యాను. వెయిట్ చేయడం వేస్ట్ అనిపించింది. అందుకే ఈ దారి ఎంచుకున్నాను. నీకు మాటలు రావడం లేదు అని అర్థమైంది. ఎండీ సీట్‌ నాకు ఇస్తే నీ భర్త ప్రాణాలతో నీ దగ్గరకు వస్తాడు. అర్థం చేసుకో.. వసుధార నువ్వు వేరే ప్లాన్ ఏమైనా చేస్తే నా గురించి నీకు తెలుసు కదా అడ్డు తప్పించేస్తా..   


ఇక శైలేంద్ర అలా మాట్లాడటంతో వసు ఏడుస్తూ వెనుదిరుగుతుంది. రిషి సార్ తిరిగి వస్తే నేను ఏం చెప్పాలి అని ఏడుస్తుంది.. రిషి సార్ ఎక్కడ ఉన్నారు అని బాధగా ఇంటికి వస్తుంది. ఇక మహేంద్ర ఏమైంది అని అడుగుతాడు. దీంతో వసు తనకు ఎండీ సీటు వద్దూ అని ఏడుస్తుంది. 


వసు: ఆ ఎండీ సీటు వదిలేస్తేనే రిషి సార్ ఎక్కడున్నారో తెలుస్తుంది మామయ్య. ఆ ఎండీ సీటు వద్దు అనుకుంటేనే రిషి సార్ క్షేమంగా ఉంటారు మామయ్య.
మహేంద్ర: అని నీకు ఎవరు చెప్పారు
వసు: శైలేంద్ర
అనుపమ: శైలేంద్ర అలా చెప్పాడా ఏ ఉద్దేశంతో అలా చెప్పుంటాడు
మహేంద్ర: అనుపమ ఏంటి అలా అడుగుతావు. వాడు ఎండీ సీటు కోసమే అలా చెప్పుంటాడు. అంటే వాడికి రిషి ఎక్కడ ఉన్నాడో కచ్చితంగా తెలుసు. రిషిని వాడే ఏదో చేశాడు. అందుకే వసుతో అలా అన్నాడు
వసుధార: మామయ్య నాకు నా భర్త కావాలి.. ఆయన క్షేమంగా ఉండాలి. అందుకే నేను ఆ ఎండీ సీటును రిజైన్ చేసేస్తా.. అది నాకు నా భర్త ఇచ్చిన బాధ్యత అని నాకు తెలుసు మామయ్య. ఆరోజు ఆయన నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఆయన నా పక్కన లేకుండా నా పక్కన ఏదున్నా అది నాకు గడ్డిపరకతో సమానం. అందుకే ఈ ఎండీ సీటు వదిలేద్దాం అనుకుంటున్నా
అనుపమ: పిచ్చిగా మాట్లాడకు వసుధార. నువ్వు ఇప్పుడు ఎండీ సీటు వదిలేస్తే శైలేంద్ర రిషి గురించి చెప్తాడు అనే నమ్మకం ఏంటి.. వాడు ఎంత మూర్ఖుడో నీకు తెలుసు కదా.. తొందర పడి ఏ నిర్ణయం తీసుకోకు. ఇప్పుడు మనకు ఒక నిజం తెలిసింది. రిషి ఎవరి కంట్రోల్‌లో ఉన్నాడో తెలిసింది కదా ఇప్పుడు మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అది చూద్దాం
వసు: అంత టైం లేదు మేడమ్. ఈలోపు వాడు రిషి సార్‌కి ఏ ప్రమాదమైనా తలపెట్టొచ్చు. నేను అది తట్టుకోలేను. వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. రిషి సార్ ఎలా వెళ్లారో అలానే తిరిగి రావాలి.. క్షేమంగా ఉండాలి. 


శైలేంద్ర - ధరణి


శైలేంద్ర: ధరణి ఏమైంది.. ఎందుకు అలా ఉన్నావు.. ఎందుకు మళ్లీ నువ్వు నన్ను పాత శైలేంద్రని చూసినట్లు చూస్తున్నావు. నువ్వు అలా నన్ను ఓ పురుగును చూసినట్లు చూస్తుంటే నాకు ఎందుకీ బతుకు అనిపిస్తుంది. చెప్పు ధరణి నువ్వు నమ్మాలి అంటే ఏం చేయాలి
ధరణి: మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అండీ.. నా గురించి ఆలోచించకుండా మీరు రెస్ట్ తీసుకోండి
శైలేంద్ర: ధరణి వసుధార నీకు ఎక్కడ కలిసింది. అంటే మన ఇంట్లోనే కలిసిందా.. తనకి నువ్వు ఏమైనా చెప్పావా.. నీకు తెలిసిన నిజాలు
ధరణి: నాకు తెలిసిన నిజాలు నా గుండెల్లోనే సమాధి అవుతాయి.. ఇక తను మీరు ఎక్కడున్నారు అని అడిగింది.. నేను తీసుకొచ్చి చూపించాను.. వసుధార ఏమైనా అడిగిందా.. అవును నాకు ఒక విషయం తెలీదు అండీ.. తను ఎందుకు మీకు కాఫీ అవసరం అవుతుంది అని అడిగింది.. 


ఇంతలో దేవయాని రావడంతో ధరణి వెళ్లిపోతుంది. వసు ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. దీంతో శైలేంద్ర రిషి గురించి అడిగిందని.. రిషి నా దగ్గరే ఉన్నాడని చెప్పానని.. ఎండీ సీట్ నాకు అప్పగించి రిషిని తీసుకెళ్లమని చెప్పానని అన్నాడు. దీంతో వసుధార కచ్చితంగా తనకు ఆ పదవి ఇస్తుందని శైలేంద్ర లేదంటే ఏం జరుగుతుందో వసుధారకు బాగా తెలుసు అని అంటాడు. అతి తొందర్లోనే తనని డీబీఎస్టీ సామ్రాజ్యానికి రాజులా చూస్తావని శైలేంద్ర అంటాడు. ఇక వసు జగతి ఫొటో దగ్గర ఏడుస్తుంది. శైలేంద్ర మాటలు తలచుకొని రిషిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు అంటుంది.


ఇప్పుడు తన ముందు రెండే దారులు ఉన్నాయని.. 1 ఎండీ సీటు వదిలేసి రిషిని కాపాడుకోవడం.. 2 తమంతట తామే రిషిని కనిపెట్టడం.. కానీ ఏం చేయాలో రిషి సార్ ఎక్కడ ఉన్నాడో తెలీదు అని ఏడుస్తుంది. రిషి ప్రాణాపాయంలో ఉన్నాడని.. ఎండీ పదవి వదిలేసి రిషిని కాపాడుకుంటానని వసు తన నిర్ణయం జగతితో చెప్తుంది. ఇక అప్పుడే అక్కడికి అనుపమ వస్తుంది. రిషిని కాపాడుకోలేకపోతే జగతి త్యాగానికి అర్థమే లేదని అంటుంది. రిషిని కనిపెట్టి మీ ఇద్దర్ని ఒకటి చేస్తానని అనుపమ అంటుంది. వసుకి ధైర్యం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : స్వప్నను గెంటేసేందుకు రుద్రాణి కొత్త ప్లాన్ – కావ్యపై రివెంజ్ తీర్చుకున్న రాజ్