Krishna Mukunda Murari Serial Today Episode :
పంతులు మురారి, ముకుంద వయసున్న వారితో వాళ్లకు కంకణం కట్టించమని చెప్తారు. దీంతో మురారి వేణి గారిని పిలవమని చెప్తాడు. ఇక భవాని అవసరం లేదు అని నందూని పిలవమని తన మరిదికి చెప్తుంది. ఇక ఆయన కృష్ణ, నందూ, మధుల దగ్గరకు వచ్చి పంతులు చెప్పింది చెప్పి నువ్వు వస్తావా లేక మురారి అన్నట్లు కృష్ణకు పిలుద్దామా అని అంటాడు.
నందూ: బాబాయ్ నిజమేనా నేను విన్నది నిజమేనా..
ప్రసాద్: ఇంత కాలం నేను నోరు మూసుకొని కూర్చొన్నా ఏరా మధు అంతేనా
మధు: నాన్న నువ్వు సూపర్ ఇప్పుడు నచ్చావ్ నువ్వు నాకు.. ఇప్పటి నుంచి నువ్వు నాకు వంద వంద తిట్టినా పరవాలేదు.. ఒక్కమాట కూడా అనకుండా పడతాను
ప్రసాద్: రామ్మా అంటూ కృష్ణను తీసుకెళ్తారు
మురారి: తనలో తాను.. వేణి గారు ఎక్కడ ఉన్నారు. తన భర్త వచ్చుంటారా..
భవాని: ప్రసాద్ కృష్ణను అక్కడికి తీసుకురావడం చూసి.. ప్రసాద్ నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి
ప్రసాద్: నేను వెళ్లే సరికి నందూ కడుపు నొప్పితో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక పూజకు టైం అయిపోతుంది అని అందులోనూ మురారి కూడా తీసుకురమ్మన్నాడు కదా అని
భవాని: పంతులు గారు ఒక్క రెండు నిమిషాలు ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూస్తాను
పంతులు: అమ్మా ఇప్పటికే పూజ ఆలస్యం అయింది. అమ్మాయి లక్షణంగా ఉంది ఇంక అభ్యంతరం ఏముంది
మురారి: పెద్దమ్మ వేణి గారి అయితే ఏమైనా ప్రాబ్లమా
పంతులు: అమ్మా అబ్బాయి కుడిచేతికి, అమ్మాయి ఎడమ చేతికి కంకణాలు కట్టమ్మా ( కృష్ణ మురారి చేతికి కంకణం కడుతుంటే మురారికి గతంలో ఒక అమ్మాయి కంకణం కట్టినట్లు గుర్తొస్తుంటుంది)
ముకుంద: కంకణం కట్టినందుకు మురిసిపోకు కృష్ణ
కృష్ణ: భక్తిగా పూజ చేసుకో.. మేడం ఇక నేను వెళ్తాను.. ఇక కృష్ణ బయటకు వచ్చి నందూకి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. ఇక తాను ఏసీపీ సార్‌కి కంకణం కడుతున్నప్పుడు ఏదో మార్పు రావడం గమనించాను అని నందూతో చెప్తుంది. ఇక దీపాలు వెలిగిద్దాం రా అని నందూని కృష్ణ పిలిస్తే కడుపునొప్పి అని అబద్ధం చెప్పాను అని అమ్మ తిడుతుంది అని నందూ చెప్తుంది. దీంతో తగ్గిపోయింది అని అబద్ధం చెప్పొచ్చులే అని నందూని కృష్ణ అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇక మురారి, ముకుందల పూజ పూర్తికావడంతో దీపాలు రెడీ చేసుకోండి అని భవాని ముకుందతో చెప్తుంది. తర్వాత భవాని కృష్ణని ఎంత దూరం పెడదామని చూస్తున్న ఎందుకు కుదరడం లేదు. ఎందుకు ఆ దేవుడు దగ్గర చేస్తున్నాడో అర్థం కావడం లేదని తనలో తాను అనుకుంటుంది. తర్వాత దీపాలు తీసుకొని ముకుంద వాళ్లు వెళ్తుంటే కృష్ణ, నందూ ఎదురవుతారు.
ముకుంద: నీకు కడుపు నొప్పి ఉంది అంట కదా
నందూ: తగ్గిపోయింది ముకుంద.. ఇంక కొంచెం ఉంది అంతే
రేవతి: మనసులో.. ఓరినీ ఇదంతా నాటకమా.. సరేలే పద ముకుంద
మధు: ఏంటి మురారి ఏమైంది
మురారి: ఏం లేదు కొంచెం అన్ ఈజీగా ఉంది అంతే
మధు: సరే అలా పక్కకు వెళ్దాం రా
భవాని: ఏమైంది ప్రసాద్ మురారికి
ముకుంద: ఎందుకు కృష్ణ నన్ను మనస్శాంతిగా ఉండనివ్వవా.. ఎందుకు ఇలా వెంటాడి వెంటాడి వేధిస్తున్నావు.. చెప్పు కృష్ణ అసలు నువ్వు.. అనేలోపు కృష్ణ కోనేటిలో పడిపోతుంది. అందరూ కృష్ణ కృష్ణ అంటూ కంగారు పడతారు.. ఇక కృష్ణ అయితే ఏసీపీ సార్.. ఏసీపీ సార్ అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో కృష్ణ మాటలు విన్న మురారికి కారు యాక్సిడెంట్ అయి కృష్ణ తలకు గాయం అయినట్లు గుర్తొస్తుంది. మురారి వెనక్కి తిరిగి చూసే సరికి కృష్ణ కోనేటిలో ఉంటుంది. దీంతో మురారి కోనేటిలో దూకి కృష్ణను భయటకు తీసుకొస్తాడు. అందరూ కంగారు కంగారుగా కృష్ణ అంటూ ఉంటారు. భవాని కంగారుగా అదంతా చూస్తుంటుంది. ఇక కృష్ణ లేచి చూస్తుంది. సార్ మీరు అని కృష్ణ అంటే మురారి సార్ కాదు నీ ఏసీపీ సార్ అని అంటాడు. దీంతో కృష్ణతో పాటు అక్కడున్న మిగతా వాళ్లు చాలా సంతోషిస్తారు. ముకుంద, భవాని షాక్ అయిపోతారు.
కృష్ణ: సార్ అంటే మీకు గతం గుర్తొచ్చేసిందా
మురారి: అవును.. నా కళ్ల ముందు నా గతం కనపడుతుంది
కృష్ణ: అత్తయ్య మా ఏసీపీ సార్.. ఏసీపీ సార్‌కి గతం గుర్తొచ్చేసింది. నేను మీకు చెప్పాను కదా.. నా మాట నిజం అయింది చూశారా.. ఇక నందూ కృష్ణని తీసుకెళ్తుంది
మురారి: అమ్మా నాకు గతం గుర్తొచ్చేసింది. బాబాయ్, మధు, గౌతమ్ నాకు మీరందరూ గుర్తున్నారు. అమ్మా ఇక నీ తింగరి కోడలు నీతోనే ఉంటుంది అమ్మా.. ఇక మురారి భవానిని చూసి... పెద్దమ్మ గతం మర్చిపోయి మిమల్ని ఎంత ఇబ్బంది పెట్టానో నాకు తెలుసు సారీ పెద్దమ్మ
ముకుంద: మనసులో.. గతం గుర్తొచ్చి మమల్ని ఇబ్బంది పెట్టావు మురారి
మురారి: మీరు చాలా గొప్పవాళ్లు నేను ఎంత మారినా గానీ ఏ మాత్రం తేడా లేకుండా ఎంత బాగా చూసుకున్నారు.
భవాని: ప్రేమ ఆప్యాయతలకు రూపంతో పని లేదు నాన్న.. నీకు గతం గుర్తొచ్చింది అది చాలు.. కళ్లు తుడుచుకో..
ఇక మురారి వాళ్లు ఇంటికి వచ్చేస్తారు. కారు దిగడమే పరుగున ముకుంద ఇంటికి వెళ్తుంది. తాను అలా ఎందుకు వెళ్లిందా అని మధు అనుకుంటాడు. ఇక కృష్ణ మురారి పక్కనే ఉంటుంది. మురారి తన ఇంటిని కొత్తగా చూస్తూ ఉంటాడు. ఎందుకు నాన్న అలా చూస్తున్నావు అని తన తల్లి అడుగుతుంది.
మురారి: ఇంటినే కాదు మీ అందర్ని కూడా అలాగే చూసేదాన్ని అమ్మ ఒక్క కృష్ణని తప్ప.
భవాని: సరే పద నాన్న నీతో చాలా మాట్లాడాలి.
మురారి: అలాగే పెద్దమ్మ రేపటి వరకు మాట్లాడుకుందాం.
భవాని: కృష్ణ ఈరాత్రికి నువ్వు అవుట్ హౌస్‌లోనే ఉండు.. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం.. చెప్పాను కదా తీరికగా మాట్లాడుకుందాం.
కృష్ణ: ఏసీపీ సార్ పర్లేదు.. ఈ ఒక్క రోజు నేను అవుట్ హౌస్‌లోనే ఉంటాను.
ఇక మధు ముకుంద గదికి వచ్చి చూసేసరికి ముకుంద బెడ్ మీద పడి ఉంటుంది. పక్కనే ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి చూసి షాక్ అయిన మధు పరుగున భవాని వాళ్ల దగ్గరకు వచ్చి ముకుంద సూసైడ్ చేసుకుంది అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. కృష్ణ పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. ముకుందను లేపేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ముకుంద పక్కనే ఉన్న ట్యాబ్లెట్లు చూసి చావాలని డిసైడ్ అయిపోయిందా పిచ్చిది అనుకుంటుంది. ఇక మధుకి కొన్ని మందులు రాసిచ్చి తీసుకురమ్మని చెప్తుంది. భవాని గౌతమ్‌కి ప్రమాదం ఏం లేదు కదా అని అడుగుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.