Telugu Bigg Boss 7 Finalists: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్‌లో ఎవరు విన్నర్ అవుతారు అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మిగతావారితో పోలిస్తే ‘స్పై’ బ్యాచ్‌కే ప్రేక్షకుల్లో ఎక్కువగా పాపులారిటీ ఉంది. వారితో పాటు అమర్‌దీప్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ బట్టి తనకు కూడా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో అసలు ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది, ఎవరికి తక్కువ ఓట్లు వచ్చి డేంజర్‌ జోన్‌లోకి వెళ్లే ఛాన్స్ ఉంది అనే విషయాలను ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. డేంజర్ జోన్‌లో ఎవరు ఉంటారు అనే ప్రశ్నకు ఎక్కువగా ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి.


ఓట్ల విషయంలో సస్పెన్స్..
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయినప్పటి నుంచి మొత్తంగా 13 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. సీజన్ 7లో 2.0 వర్షన్‌లో అయిదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా అందులో కూడా నలుగురు ఎలిమినేట్ అయిపోయి.. అర్జున్ మాత్రమే ఫైనల్‌కు చేరుకోగలిగాడు. మునుపెన్నడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 7లో రెండు వారాల ముందు నుండే విన్నర్స్ కోసం ఓటింగ్ మొదలయ్యింది. ఈ రెండువారాల ఓటింగ్ శాతాన్ని మొత్తం కలిపి విన్నర్ ఎవరు అని డిసైడ్ చేస్తారు మేకర్స్. బిగ్ బాస్ హౌజ్ నుంచి చివరివరకు వచ్చి ఫైనల్స్‌కు చేరలేకపోయారు గౌతమ్, శోభా శెట్టి. ఇక వారికి సపోర్ట్ చేసినవారి ఓట్లు కూడా ప్రస్తుతం టాప్ 6లో ఉన్న కంటెస్టెంట్స్‌కు పడే ఛాన్స్ ఉంది.


ఆ ఇద్దరి మధ్యే గట్టి పోటీ..
ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్‌ను బట్టి ఓటింగ్ శాతం పల్లవి ప్రశాంత్, శివాజీలకే ఎక్కువగా ఫేవర్ చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన కొన్నివారాల వరకు ఓటింగ్ విషయంలో శివాజీనే టాప్ స్థానంలో ఉన్నాడు. కానీ తను చేసిన కొన్ని తప్పుల వల్ల, తను అన్న కొన్ని మాటల వల్ల ప్రేక్షకుల్ సపోర్ట్ తగ్గుతూ వస్తోంది. అందుకే ఇప్పుడు ఓటింగ్ విషయంలో పల్లవి ప్రశాంత్ మొదటి స్థానానికి చేరుకొని, శివాజీ రెండో స్థానానికి పడిపోయినట్టు సమాచారం. కానీ పల్లవి ప్రశాంత్, శివాజీల మధ్య ఓటింగ్ శాతం చాలా దగ్గరగా ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న పోలింగ్ చూస్తే తెలుస్తోంది. అంటే వీరిద్దరిలో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి.


మిడ్ వీక్ ఎలిమినేషన్ ముప్పు..
మెసేజ్‌లు, మిస్డ్ కాల్స్ రూపంలో బిగ్ బాస్‌లోని కంటెస్టెంట్స్‌కు ఫ్యాన్స్ మద్దతునివ్వొచ్చు. మెసేజ్‌ల రూపంలో పల్లవి ప్రశాంత్, శివాజీలకు మద్దతు ఎక్కువ లభిస్తున్నా కూడా మిస్డ్ కాల్స్ రూపంలో వారికి వస్తున్న ఓటింగ్ చాలా వీక్‌గా ఉందని సమాచారం. కానీ ఆ విషయంలో అమర్‌దీప్ మాత్రమే టాప్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఓటింగ్‌లో శివాజీ, పల్లవి ప్రశాంత్‌లకు అమర్‌దీప్ కూడా గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు కాకుండా మిగిలిన యావర్, ప్రియాంక, అర్జున్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఒకవేళ ఫైనల్స్‌కు టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే వెళ్లాలి అనే రూల్ ఉంటే.. ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగడం ఖాయం. అందులో ప్రియాంక ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read: ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ To ‘స్క్విడ్ గేమ్ 2’ - 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే సిరీస్‌ల జాబితా ఇదే