Guppedantha Manasu Serial Today Episode : మనోని అందరూ తండ్రి ఎవరు అని ప్రశ్నించడం, నలుగురి ముందు మనో అవమానపడటాన్ని తలుచుకొని తలుచుకొని ఆనందిస్తూ ఉంటాడు శైలేంద్ర. నన్ను ఒకప్పుడు పురుగుని చూసినట్టు చూసాడు ఇప్పుడు నేను చేసిన పనికి వాడు మొహం ఎత్తుకోలేక పోయాడు. ఇప్పుడు వాడు కాలేజీ నుంచే కాదు ఈ ఊరి నుంచి కూడా  వెళ్ళిపోతాడు అని ఆనందిస్తూ ఉంటాడు. అప్పుడు  ఈ సామ్రాజ్యం నాది అంటూ ఎక్కడున్నాడో కూడా చూసుకోకుండా పిచ్చిపిచ్చిగా అరుస్తాడు. అప్పుడే కాలేజ్ కి వచ్చిన స్టూడెంట్స్ శైలేంద్ర ని చూసి ఏం జరిగింది సర్  అని ప్రశ్నిస్తారు, శైలేంద్ర చిరాగ్గా జవాబివ్వటంతో ఎందుకు సార్ పిచ్చిగా అరుస్తున్నారు అంత గొప్పగా ఏం సాధించారు మీరు అని అడుగుతారు. శైలేంద్ర  కోపంతో అందరినీ పంపించేస్తాడు. అప్పుడు ఆలోచించటం మొదలు పెడతాడు. నిజంగా తను మను మీద   గెలిచాడా లేక ఓడిపోయాడా అని, అసలు  బాబాయ్ ఎందుకు ఆ విధంగా మనో తండ్రిని అని చెప్పుకున్నాడు అని ఆలోచించడం మొదలుపెడతాడు. బయట నిలబడిన  మహేంద్రని అడుగుతుంది ఇలా ఎందుకు చేశారు మామయ్య అని ..


మహేంద్ర: చేయాల్సి వచ్చిందమ్మా 


వసుధార : ఎందుకు? 


మహేంద్ర: మను కోసం. చూశావు కదా, వాళ్ళు  మీటింగ్ లో మను కోసం ఎలా మాట్లాడుతున్నారు తనని ఎన్ని మాటలు అన్నారు అన్నది. వాళ్లు మాట్లాడే మాటలకి మను చాలా బాధపడుతున్నాడు.  తనని నిందిస్తుంటే అనుపమ చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. అను చాలా మంచి వ్యక్తి.  అలాంటి తనని అందరూ నిలదీస్తుంటే నేను చూడలేకపోయాను.  వాళ్లు ఒక్కొక్క మాట అంటూ ఉంటే నా రక్తం మరిగిపోయింది అందుకే మను కి,  అనుపమకి మేలు చేయాలని,  వాళ్ళకి ఎలాంటి అవమానాలు జరగకూడదని నేను అలా చెప్పాను.  అంతేకానీ మరేం లేదమ్మా. 


వసుధార : మీరు వాళ్ల కోసం బాధపడటం ఓకే మామయ్య ఎందుకంటే వాళ్ళని మనం కుటుంబ సభ్యులు లాగా భావిస్తున్నాం కాబట్టి కానీ అందుకోసం మీరు ఇలా చెప్పటం కరెక్ట్ కాదు కదా ఆ పరిస్థితిలో మీరు మనుకి మేలు చేయాలని తన తండ్రిని  అని చెప్పారు.  కానీ దాని పర్యవసానం ఎలా ఉంటుందో మీరు ఆలోచించలేదా మామయ్య . ఇంతకు ముందు చూశారు కదా దేవయాని మేడం మిమ్మల్ని ఎలా నిలదీస్తున్నారో. మీరు తప్పు చేయరు అని తెలిసి కూడా ఆవిడ ఎలా మాట్లాడుతున్నారో. తనే కాదు ఇలా చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా..


మహేంద్ర: కానీ అలా చేయాల్సి వచ్చిందమ్మా. ఇదేమి ఆవేశంలో అన్నది కాదు అంతా ఆలోచించే చెప్పాను. ఒకప్పుడు జగతి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను తెగించి నిజం చెప్పాను. అప్పుడు కూడా చాలామంది రకరకాలుగా అన్నారు. కానీ తర్వాత అందరూ అర్థం చేసుకున్నారు. విడివిడిగా ఉన్న మేం ఇద్దరం  ఒక్కటయ్యాము. ఇప్పుడు అనుపమ, మను అందరి ముందు అవమాన పడుతూ ఉంటే నేను చూడలేకపోయాను. మనుకి కన్న తండ్రి ఎవరో చెప్పలేక అనుపమ ఇబ్బంది పడుతోంది. తన తండ్రి గురించి అడుగుతున్న వాళ్లకు సమాధానం చెప్పలేక మనో మాట్లాడకుండా ఉండిపోయాడు. వాళ్ళిద్దరి కోసమే నేను ఇలా చెప్పాను. అది నిజం కాకపోవచ్చు కానీ నాకు నమ్మకం ఉంది దీని వల్ల ఎలాంటి అనర్ధాలు జరగవు అని. 


ఎంత చెప్పినా వసుధార మహేంద్ర వాదనను ఒప్పుకోదు. వాళ్ళకి సమస్య పెద్దది చేశారు తప్ప తగ్గించలేదని చెబుతుంది. 


మరోవైపు బాధతో ఆలోచనలో ఉన్న అనుపమ దగ్గరకి వచ్చిన దేవయాని వెటకారం చేయటం మొదలుపెడుతుంది. పాత కథ అంతా తవ్వి తీసి దెప్పిపడుస్తుంది. మహేంద్రకి, నీకు మధ్య .. అంటూ సాగదీస్తునడగానే అక్కడికి ఆవేశంగా వస్తుంది వసుధార.. మీరు వరెస్ట్ అని తెలుసు గాని మరీ ఇంత వరెస్ట్ అనుకోలేదు అంటూ గట్టిగా బుద్ధి చెబుతుంది. తానేమీ తప్పు మాట్లాడలేదని గట్టిగా చెబుతుంది దేవయాని. కానీ వసుధార మాత్రం మహేందకి, అనుపమకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. అవకాశం దొరికింది కదా అని వసుధారని కూడా నానా మాటలంటుది దేవయాని.  ఇదంతా మను గోడ వెనుక ఉండి వింటూ ఉంటాడు.  


ఆలోచనలో ఉన్న మహేంద్ర దగ్గరకి వస్తాడు మను. నేను చేసినపని కరెక్ట్ కాదు అని చెప్పడానికి వచ్చావా అంటాడు. నాకు తండ్రి అంటే నచ్చదు. ఇలా ఎందుకు చేశారు అని అడుగుతాడు. మాకు ఈ అవమానం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది మీకు ఇప్పుడు తెలిసింది అని చెబుతాడు మను. నా తండ్రి అంటే నాకు అసహ్యం  ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని చెబుతాడు.


ఇంట్లో శైలేంద్ర, దేవయాని మాట్లాడుకుంటారు. ఇంతచేసినా ఫలితం లేకుండా పోయింది అని బాధపడతారు. అయినా సరే మరో ప్రయత్నం చేసి అయినా మనో కాలేజీ నుంచి వెళ్లిపోయేలా చేద్దాం అనుకుంటారు. అందులో భాగంగా ఫణీంద్ర ముందు దీనిని ఒక పెద్ద విషయంగా చేయడానికి ప్లాన్ చేస్తారు. 


Also Read: ప్లాన్ మార్చిన దిల్ రాజు... ఈ నెలాఖరులోనే ఓటీటీలోకి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'?