Guppedantha Manasu November 21st Episode (గుప్పెడంతమనసు నవంబరు 21 ఎపిసోడ్)


జ‌గ‌తి మ‌ర్డ‌ర్ గురించి ఎంక్వైరీ చేయ‌డం మొదలుపెట్టిన అనుపమ... దేవయానిని కలిసిన తర్వాత  మహేంద్రని నిలదీస్తుంది. ఇంతలో రిషి, వసు అక్కడకు వస్తారు. మరోవైపు శైలేంద్ర దొంగచాటుగా వచ్చి వాళ్ల మాటలు వింటుంటాడు.  
అనుపమ:  నిన్ను న‌మ్మి జ‌గ‌తిని నీ చేతిలో పెడితే ఆమెను న‌డిరోడ్డు మీద ఎందుకు వ‌దిలేశావు అంటూ కోప్ప‌డుతుంది. పెళ్లైన త‌ర్వాత జ‌గ‌తిని దూరం పెట్టావు. ఆమె మ‌న‌సు అర్థం చేసుకోకుండా క‌ష్ట‌పెట్టావ‌ు. ప్రేమించిన జ‌గ‌తిని ఎలా దూరం పెట్టావు. జ‌గ‌తిని ఎందుకు వేధించావు. జ‌గ‌తి క‌ల‌ల్ని చిదిమివేసి ఆమె చ‌చ్చిపోయేలా చేశావు
మహేంద్ర: అనుపమ వరుస ప్రశ్నలకు మహేంద్ర ఫ్రస్ట్రేట్ అవుతాడు.
మీరెప్పుడు వచ్చారు మేడం అని రిషి అడుగుతాడు...ఇప్పుడే వచ్చానంటుంది
రిషి: అమ్మ ఎలా చనిపోయారో మీకు ఆల్రెడీ చెప్పాను కదా..
అనుపమ: వాళ్లిద్దరూ హ్యాపీగా ఉండాలని పెళ్లిచేశాను..ఇద్ద‌రు విడిపోయార‌ని తెలిసి చాలా బాధ‌ప‌డ్డాన‌ు, వాళ్ల‌ను క‌ల‌పాల‌ని అనుకున్నాన‌ు. మ‌హేంద్ర‌ను మాట అనోద్ద‌ని జ‌గ‌తి త‌న‌తో ఒట్టు వేయించుకుంద‌ని, అందుకే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండిపోయాన‌ు. జ‌గ‌తి లేన‌ప్పుడు ఆ ఒట్టుకు విలువ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు
కాఫీ - టీ ఏం తాగుతారని అడుగుతుంది వసుధార..భోజనం చేయమని అడగరా అని అనుపమ అంటుంది...
వారి మాటల్ని చాటుగా విన్న శైలేంద్ర అక్కడి నుంచి పారిపోతాడు...వెనుక నుంచి చూసిన వసుధార..తను శైలేంద్ర అనే డౌట్ తో ధరణికి కాల్ చేసి కనుక్కుంటే..ఇంట్లో లేడని తెలుస్తుంది. మరోవైపు ధరణి మాత్రం శైలేంద్ర మారిపోయాడని చెప్పి సంబరపడుతుంది...


ALso Read: అనుపమను దారి మళ్లించే ప్రయత్నంలో దేవయాని, రిషిధార ఎలా చెక్ పెడతారు!


మరోవైపు బండి స్టార్ట్ అవకపోవడంతో శైలేంద్ర బండి తోసుకుంటూ వెళతాడు. మెకానిక్ ఎదుర‌వుతాడు.బైక్ బాగు చేస్తానంటూ శైలేంద్ర వ‌ద్ద వెయ్యి రూపాయ‌లు తీసుకుంటాడు.డ‌బ్బులు తీసుకున్న త‌ర్వాత కీ ఆన్ చేసి స్టార్ట్ చేయ‌మ‌ని చెప్పి వెళ్లిపోతాడు. వ‌సుధార పెట్టిన టెన్ష‌న్‌లో తాను కీ ఆన్ చేయలేద‌నే విష‌యం గుర్తొచ్చి శైలేంద్ర స‌హించ‌లేక‌పోతాడు. 


అనుపమ-రిషి
రిషి: ఏంజెల్ నేను బెస్ట్ ఫ్రెండ్స్....
అనుపమ: నేను-మీ అమ్మ కూడా బెస్ట్ ఫ్రెండ్స్..మీ డాడీ కూడా బెస్ట్ ఫ్రెండే
రిషి:  నా కంటే మా డాడ్ గురించి మీకే బాగా తెలుసు కానీ మీరు అలా మాట్లాడ‌టంతో ఆయ‌న చాలా హార్ట్ అయ్యారు. కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల త‌ల్లికి త‌న తండ్రి దూర‌మ‌య్యారు..జగతి మేడం గురించి ప్రతిక్షణం ఆలోచించేవారు..తన బాధ చూడలేకే తిరిగి ఇంటికి తీసుకొచ్చాను..
అనుపమ: జ‌గ‌తిని రిషి మేడ‌మ్ అని పిలిచేవాడ‌ని దేవ‌యాని చెప్పిన విష‌యం అనుప‌మ‌కు గుర్తొస్తుంది. ఇదే విష‌యం రిషిని అడుగుతుంది.
రిషి: అవును అని అనిఒప్పుకున్న రిషి తాను తప్పుచేశానంటాడు. నేను చేసింది త‌ప్పే...అన్ని అర్థ‌మై హ్యాపీగా ఉంద‌మ‌ని అనుకునేలోపు మా అమ్మ న‌న్ను వ‌దిలేసివెళ్లిపోయింది 
అనుపమ: త‌ప్పు చేయ‌డం నీకు బాగా అల‌వాటు అనుకుంటా...జ‌గ‌తి విష‌యంలో ఇదొక్క‌టే త‌ప్పు చేశావా...ఇంకా ఏమైనా చేశావా 
రిషి: ప్ర‌శ్న‌ల‌కు రిషి షాక‌వుతాడు. మీ ప్ర‌శ్న‌లు చాలా క‌ఠినంగా ఉన్నాయ‌ని, మీ ప్ర‌శ్న‌ల‌తో మా నాన్న చాలా బాధ‌ప‌డి ఉంటాడ‌. మా నాన్న గురించి త‌ప్పుగా మాట్లాడొద్ద‌ని, అవ‌స‌ర‌మైతే ఆయ‌న్ని బాధ నుంచి బ‌య‌ట‌కు తీసుకుర‌ండి. మీరు న‌న్ను కూడా త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్ద‌ు.మా అమ్మను  మ‌ర్చిపోన‌ు, త‌న జ్ఞాప‌కాలు ప్ర‌తి క్ష‌ణం నా గుండెల్లో క‌ద‌లాడుతాయి


Also Read: బాధను ఒంటరిగా అనుభవించడం నేర్చుకున్నవాడే లైఫ్ లో పైకొస్తాడు, ఏమోషన్ పిండేసిన రిషి!
ముఖానికి రంగు పూసుకొని ఇంటికొచ్చిన శైలేంద్ర‌ను గుర్తుప‌ట్ట‌దు ధ‌ర‌ణి ఇంట్లోకి వ‌స్తుంటే అడ్డుకుంటుంది. కానీ ధ‌ర‌ణిని తోసేసి ఇంటి లోప‌లికి వ‌స్తాడు శైలేంద్ర‌.  దొంగ అనుకుని పొర‌ప‌డిన ధ‌ర‌ణి ఇళ్లు తుడిచే క‌ర్ర‌తో చావ‌బాదుతుంది. భార్య కొడుతున్న దెబ్బ‌ల‌ను భ‌రించ‌లేక ల‌బోదిబో మంటాడు శైలేంద్ర‌. శైలేంద్ర‌ గొంతు గుర్తుప‌ట్టి కొట్ట‌డం ఆపేస్తుంది ధ‌ర‌ణి. త‌ప్పైంద‌ని అంటుంది. మీరే స‌మాధానం చెప్ప‌కుండా లోప‌లికి రావ‌డంతో దొంగ అనుకొని కొట్టాన‌ని శైలేంద్ర‌తో చెబుతుంది ధ‌ర‌ణి. ఇన్ని రోజులు నిన్ను మాట‌ల‌ను మ‌న‌సులో పెట్టుకొని కొట్టావా అని ధ‌ర‌ణిని అడుగుతాడు శైలేంద్ర‌. మీరు మారిపోయిన త‌ర్వాత అలా ఎందుకు చేస్తాన‌ని అంటుంది 


ఏపిసోడ్ ముగిసింది....