Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు మే 08 ఎపిసోడ్)


రాజీవ్ బతికే ఉన్నాడని..శైలేంద్ర తనతోనే మాట్లాడాడు అని ధరణి కన్ఫామ్ చేయడంలో వసుధార ఆలోచనలో పడుతుంది. ఇంతలో అనుపమ వచ్చి  శైలేంద్ర‌, రాజీవ్ లాంటి దుర్మార్గుల‌తో పోరాడ‌టం రిస్క్ అంటుంది. 
వసు: ఆ రాక్ష‌సుల‌తో పోరాడ‌టంలో ఎంత రిస్క్ అయినా భ‌రిస్తాన‌ు. మనులాంటి వాళ్లు స్టేషన్లో కాదు సమాజంలో ఉండాలి. ఎలాగైనా తనని బయటకు తీసుకురావడమే నా పని..తీసుకొస్తాను..
నేను అదే పనిలో ఉన్నానమ్మా అని మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు... శైలేంద్ర, రాజీవ్ ఎన్ని కుట్రలు చేసినా నేను ఎంతవరకైనా వెళతాను.. అవసరమైతే వాళ్ల ప్రాణాలు తీసైనా మనుని కాపాడుకుంటాను...
వసు: అవును మావయ్య ఎంతైనా మీ కొడుకు కదా....
అనుపమ షాక్ అయి ఇద్దరి మొహాలు చూస్తుంది... వసుధార వెంటనే మీ కొడుకు లాంటివారు కదా అని కవర్ చేస్తుంది
మహేంద్ర: ఇప్పుడు మనం కలిసికట్టుగా మనుని కాపాడాలి...తక్కువ టైమ్ లోనే ఆలోచనలు వేగంగా కదులుతూ ఉంటాయి... రాజీవ్ బతికి ఉంటే వాడు ఎక్కడున్నా పట్టుకుని తీరాలి
వసు: నేను ఆ రాజీవ్ నంబర్ కనుక్కునే పనిలో ఉన్నాను..ఇప్పుడే ధరణి మేడంతో మాట్లాడాను...ఆ నంబర్ దొరికితే మనకు రాజీవ్ దొరికినట్టే 


Also Read: మను బయటకు రావాలంటే రిషి రావాల్సిందేనా - శైలేంద్రని టెన్షన్ పెట్టిన వసు ,గుప్పెడంత మనసు మే 07 ఎపిసోడ్!


శైలేంద్ర ఫోన్లో ఆ నంబర్ ఎలాగైనా తీసుకునేందుకు ధరణి ట్రై చేస్తుంది... శైలేంద్ర నిద్ర‌పోతున్న‌ట్లుగా న‌టిస్తుంటాడు. నిజంగానే నిద్రపోయాడు అనుకుని  శైలేంద్ర‌ ఫోన్ తీస్తుంది ధ‌ర‌ణి. ఇంతలో కళ్లు తెరిచిన శైలేంద్ర నా ఫోన్ తో పనేంటని ఫైర్ అవుతాడు... మాట మార్చేస్తుంది ధరణి
ధరణి: మీరు చాలా రోజులుగా ఎవ‌రో అమ్మాయితో సీక్రెట్‌గా మాట్లాడుతున్న‌ట్లు అనుమానం ఉంది..అందుకే ఫోన్ తీశాను.  ఆ అమ్మాయి ఎవ‌రో ఈ రోజే తెలుసుకుంటాన‌ు మ‌ర్యాద‌గా ఫోన్ ఇవ్వండి... ఫోన్ ఇవ్వకపోవడంతో  ఫ‌ణీంద్ర‌, దేవ‌యానిల‌ను  పిలుస్తుంది. కన్నీళ్లు పెట్టుకుని మరింత హడావుడి చేస్తుంది. శైలేంద్ర నాకు అన్యాయం  చేశాడని ...ఎవ‌రెవ‌రికో ఫోన్‌లు, మెసేజ్‌లు చేస్తున్నాడంటూ  ఫ‌ణీంద్ర‌కు కంప్లైంట్ ఇస్తుంది


ఎప్పటిలా ఫణీంద్ర కొడుకుపై ఫైర్ అయితే...దేవయాని మాత్రం వెనకేసుకొస్తుంది...
ధరణి: మీరు అత్త‌లా కాదు అమ్మ‌లా ఆలోచించిండి 
దేవయాని: ఏ అమ్మాయితో ఎఫైర్ సాగిస్తున్నావో  చెప్ప‌మ‌ని కొడుకును నిల‌దీస్తుంది.
శైలేంద్ర ఎంత చెప్పినా ఫ‌ణీంద్ర‌, దేవ‌యాని  న‌మ్మ‌రు. 
ధరణి: మీరు చెబుతుంది నిజ‌మే అయితే మీ ఫోన్ చూపించండి 
ఫణీంద్ర: నువ్వు త‌ప్పు చేశావు కాబ‌ట్టే ఫోన్ చూపించ‌డం లేద‌ు
ధ‌ర‌ణి ఎంత‌కు ప‌ట్టువీడ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు శైలేంద్ర ఫోన్ చూపిస్తాడు. కానీ రాజీవ్‌తో మాట్లాడిన కాల్స్‌, పంపించిన మెసేజ్‌ల‌ను శైలేంద్ర అప్పటికే  డిలీట్ చేస్తాడు.
ధరణి: అది గమనించిన ధరణి... మ‌రో అమ్మాయితో మాట్లాడిన కాల్స్‌, పంపించిన మెసేజ్‌ల‌ను   డిలేట్ చేశాడ‌ంటూ మరింత హడావుడి చేస్తుంది
 శైలేంద్ర త‌ప్పు చేశాడ‌ని ఫిక్సైపోయిన ఫ‌ణీంద్ర‌, దేవ‌యాని ... ధ‌ర‌ణికి అన్యాయం చేస్తే ఊరుకోమ‌ని వార్నింగ్ ఇస్తారు. ఇలా సైలెంట్ గా సీక్రెట్ గా ఫోన్లు మాట్లాడడాలు చేస్తే అస్సలు బావోదని ఫణీంద్ర అంటే...నువ్వు ఇంత దిగజారిపోతావ్ అనుకోలేదని దేవయాని ఫైర్ అవుతారు...మీరు ఇంకోసారి ఇలాచేస్తే నేను ఊరుకోను అని మాస్ వార్నింగ్ ఇస్తుంది ధరణి.. అసలేం జరుగుతోందో అర్థంకాక శైలేంద్ర తలపట్టుకుంటాడు...


Also Read: అక్షయతృతీయ రోజు బంగారం కొనేవాళ్లంతా ఇది తెలుసుకోండి!


మహేంద్ర-వసుధార
ధరణి ఏమీ చేయలేదమ్మా అని మహేంద్ర అంటే...ఈ మధ్యకాలంలో ఆమె ధైర్యంగా ఉంటున్నారని వసుధార బదులిస్తుంది. అదే నిజమైతే మంచిదే కానీ తను కనుక్కోలేకపోయినా పర్వాలేదు కానీ ధరణి మాత్రం శైలేంద్రకి దొరక్కూడదు అంటాడు మహేంద్ర. ఇంతలో ధరణి నుంచి కాల్ వస్తుంది
ధరణి: నేను చాలా ట్రై చేశాను..నిద్రపోయారు అనుకుని ఫోన్ తీసుకున్నాను కానీ అదే టైమ్ కి ఫోన్ లాక్కున్నారు నేను దొరికిపోయాను..
వసు: మిమ్మల్ని ఏమైనా అన్నారా
ధరణి: నేను మేటర్ డైవర్ట్ చేశానంటూ జరిగింది చెబుతుంది
అదంతా విని వసుధార, మహేంద్ర నవ్వుకుంటారు...
ధరణి: తనకు అనుమానం వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు.. కానీ ఓ మాట కచ్చితంగా చెబుతున్నాను..మా ఆయన మాట్లాడేది రాజీవ్ తోనే అని క్లారిటీ ఇస్తుంది...
మహేంద్ర: రాజీవ్ బతికే ఉన్నాడని నిరూపించేందుకు మనుకున్న దారేంటి?...అసలేంటి ఇదంతా...ఎంత ఆలోచించినా ఏమీ అర్థంకావడం లేదు
వసు: రాజీవ్-శైలేంద్ర చేసిన పని ఇది...కానీ వాళ్ల రాక్షసత్వం బయటపడుతుంది...
రాజీవ్ బతికే ఉన్నాడని ప్రూవ్ అవ్వాలి కదా అని మహేంద్ర అంటే...మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అంటుంది వసుధార...