Trinayani Today Episode :డమ్మక్క, పావనామూర్తిలు హాల్‌లో గాయత్రీ పాపని ఆడిపిస్తుంటారు. ఇంతలో హాసిని మల్లె పూలు పట్టుకొని వస్తుంది. దురంధర పెట్టుకుంటానని వాటిని అడుగుతుంది. దీంతో హాసిని ఇవి పెట్టుకోడానికి కాదు పెట్టడానికి అని అంటుంది. ఇంతలో తిలోత్తమ అక్కడికి వస్తుంది. హాసిని తిలోత్తమ మీద సెటైర్లు వేస్తుంది. ఇంతలో నయని పూల దండ పట్టుకొని వస్తుంది. 


డమ్మక్క: తిలోత్తమ అమ్మని రెచ్చగొట్టి మధ్యలో బలి కావొద్దని పావనామూర్తిని హెచ్చరిస్తున్నాను. 


సుమన: చెరో మూర మల్లె పూలు ఇవ్వకుండా ఈ పంతాలు పట్టింపులు ఎందుకు.


హాసిని: అమ్మవారికి వేద్దామని అనుకుంటే సింగారాల కోసం అడుగుతారెందుకు. 


నయని: తన వెంట తీసుకొచ్చిన దండను చూపించి అత్తయ్య ఈ దండ మూడు నిమిషాలు మీ మెడలో వేసుకోండి.


విశాల్: నయని ఈ పూల దండ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావ్. అమ్మ మెడలో వేసుకోమని అంటున్నావ్ ఎందుకు.


నయని: పంతులు గారు ఈ దండ ఇస్తూ మీ ఇంట్లో ఎవరికైనా బాలేకపోతే ఈ దండ వేసుకుంటే కోలుకుంటారని చెప్పారు.


తిలోత్తమ: నాకేమైంది బాగానే ఉన్నా కదా. 


హాసిని: అమ్మవారి గుడి నుంచి తీసుకొని దండ అది పట్టుకోవాలి అంటేనే ఎంతో అదృష్టం ఉండాలి అలాంటిది వేసుకోవాలి అంటే ఇంకెంత యోగం ఉండాలి. 


సుమన: నాకు ఇచ్చేయ్ అక్క నేను వేసుకుంటా.


నయని: బరువుని భరించాల్సింది నువ్వు కాదు సుమన అత్తయ్య.


తిలోత్తమ: అంత బరువు ఉంటే ఇంత సేపు నువ్వేలా పట్టుకుంటావ్. 


డమ్మక్క: నయనికి నీకు తేడా ఉంది కదా అమ్మ. 


దురంధర: అంటే మా బ్యాచ్ అంతా ఏజ్ బార్ అయిందనా.. ఇటు ఇవ్వు నయని నేను మూడు నిమిషాలు కాదు ముప్పై నిమిషాలు మోస్తా.


డమ్మక్క: ఆ దండ వేసుకునే అవకాశం, అదృష్టం ఇద్దరికే ఉంది. ఒకరు గాయత్రీ దేవి. ఇంకొకరు తిలోత్తమమ్మ. 


విక్రాంత్: ఆ రేంజ్‌లో చెప్తున్నారు అంటే నీ విలువ పెరిగినట్లే కదా అమ్మ.


తిలోత్తమ: అంతే అంటావా.


సుమన: హాసిని అక్క మూర మల్లెపూలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా ఈ పూల దండ వేసుకొని సాక్ష్యాత్తు అమ్మవారిలా కనిపించండి అత్తయ్య. 


తిలోత్తమ: మూడు నిమిషాలు అని అదే పనిగా చెప్తున్నావు ఏదీ ఆ దండ నా మెడలో వేయ్.


నయని: అలాగే..


డమ్మక్క: ఆగు నయని గుడి నుంచి తీసుకొచ్చిన పూల దండ నేరుగా నువ్వు వేయకూడదు. దేవుళ్లే మానవుల మెడలో వేయాలి.


దురంధర: ఇప్పుడు దేవుళ్లు ఎక్కడి నుంచి వస్తారు.


డమ్మక్క: గాయత్రీ ఉంది కదా.


సుమన: పసి పిల్ల దేవుడితో సమానం అని అందుకే ఆ పిల్లతో వేయమని అన్నారు కదా. సర్లే అత్తయ్య ఆ పిల్ల చిన్నప్పుడే మీకు సేవ చేస్తుందని అనుకొని వేయించుకోండి. 


విక్రాంత్: నీ బుద్ధి అలాంటిది కాబట్టి నీకు అలాంటి ఆలోచనలే వస్తాయి.


విశాల్: గాయత్రీ పాపతో దండ వేయించకండి. చిన్న పిల్ల పట్టుకోలేదు. నయని నువ్వే వేసే.


సుమన: భార్యని దేవతలా చూసుకుంటారు కాబట్టి నీకు దండ వేసే హక్కు ఉందని చెప్పకనే చెప్తున్నారు బావగారు. 


హాసిని: గాయత్రీ పాపతోనే దండ వేయిద్దాం విశాల్. ఎలాగూ టార్గెట్ అదే కదా అని హాసిని అంటే తిలోత్తమ అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో విశాల్ కవర్ చేస్తాడు. 


హాసిని పాపని ఎత్తుకుంటుంది. నయని దండ వేయిస్తుంది. దండ వేసుకోగానే గాలి వీస్తుంది. అందరూ ఆశ్చర్య పడతారు. అప్పటి వరకు బాగానే ఉన్న తిలోత్తమ ఒక్కసారిగా మెడ నెప్పి అని భారంగా ఫీలై ఇబ్బంది పడుతుంది. బరువు అని అరుస్తూ స్ఫృహ కోల్పోయి కింద పడిపోతుంది. అందరూ కంగారు పడతారు. ఇక నయని తిలోత్తమ ముఖానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతుంది. 


విక్రాంత్: అమ్మ మీద ప్రయోగమా వదినా.


నయని: కాదు బాబు మీ అమ్మ చేసిన ప్రయోగం గురించి తెలుసుకుందామని. 


డమ్మక్క: ఇప్పుడు నిజం చెప్తుంది అమ్మ.


విశాల్: దేని గురించి.


నయని: అమ్మగారు ఎంతో ప్రేమగా పెంచుకున్న వాయుని మీరేం చేశారు. తిలోత్తమ అత్తయ్య.


తిలోత్తమ: మత్తులో.. చంపేశాను. 


నయని: ఎలా చంపేశారు.


తిలోత్తమ: పూల దండకు విషం చల్లాను. వాయు మెడలో ఏ దండ వేసినా తనో నోటితో లాగేసుకొని తినేసే అలవాటు ఉంది. 


విశాల్: అమ్మ ఆ గుర్రం ఏం చేసిందమ్మా. దాన్ని చంపేశావ్.


తిలోత్తమ: అది నా పరువు తీసింది. 


విక్రాంత్: పరువు తీసిందా.. పెద్దమ్మ ప్రాణంగా పెంచుకున్న గుర్రాన్ని చంపేసి నీ పరువుని నీ మీద ఉన్న గౌరవాన్ని నువ్వే తీసేశావ్ అమ్మ.  


హాసిని: కోప్పడకు విక్రాంత్ ఇప్పుడు తనని తిట్టినా కొట్టిన తనకు ఏం తెలీదు.


సుమన: అత్తయ్య మీద ప్రయోగం చేసి ఏం చేయాలి అనుకుంటున్నారు. 


హాసిని: ముందు ఈ రాక్షసి ఏం చేసిందో తెలుసుకో.


దురంధర: వదినా నువ్వు వాయుని చంపేశావ్ అని గాయత్రీ వదినకు తెలీదా.


తిలోత్తమ: తెలియనివ్వలేదు.


ఇంతలో గాయత్రీ పాప వెళ్లి తిలోత్తమ గుండెల మీద కూర్చొని పూల దండలోని పువ్వులు తెంపుతుంది. విశాల్ పాపని తీసేస్తాడు.


నయని: ఏం చేసిందని మీ పరువు ఎలా పోయిందని గుర్రం ప్రాణం తీశారు.


ఇంతలో తిలోత్తమ స్ఫృహ కోల్పోతుంది. దీంతో తిలోత్తమ మెడలోని దండ తీసి గదిలోకి తీసుకెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాలికి గాయం, ఆందోళనలో ఫ్యాన్స్