Guppedantha Manasu January 30th Episode:  (గుప్పెడంతమనసు జనవరి 30 ఎపిసోడ్)


రిషి కాలేజీకి రాకపోవడంతో ఆవేశంగా ఇంటికెళ్లిన వసుధార..శైలేంద్ర నిజస్వరూపం బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంది
వసు: వీడు దుర్మార్గుడ‌ని, ప‌ర‌మ‌నీచుడు , వీడే రిషిని ఏదో చేశాడు..ఇలాంటి రాక్ష‌సుడు మీ క‌డుపున పుట్టినందుకు మీరు బాధ‌ప‌డ‌తార‌ని ఇన్నాళ్లు నేను, మ‌హేంద్ర సర్.. శైలేంద్ర చేసిన కుట్ర‌ల‌ను దాచిపెట్టాం
ఫణీంద్ర: నేను బాధపడను అసలు నిజం ఏంటో చెప్పండి...
వసు: జ‌గ‌తి మేడంని భ‌య‌పెట్టి రిషి ఇళ్లు వ‌దిలిపెట్టి వెళ్లిపోయేలా చేసింది శైలేంద్ర‌నే...చివ‌ర‌కు ఎండీ సీట్‌కు అడ్డుగా ఉంద‌ని జ‌గ‌తి మేడంని చంపింది కూడా ఈ దుర్మార్గుడే .  జ‌గ‌తి చ‌నిపోయిన త‌ర్వాత కూడా ఎండీ ప‌ద‌వి త‌మ‌కు ద‌క్క‌క‌పోవ‌డంతో నన్ను, రిషిని ప‌గ ప‌ట్టి శైలేంద్ర వెంటాడుతున్నాడ‌ు
నా కొడుకు అలాంటివాడు కాదని దేవయాని అడ్డపడుతుంది కానీ...ఫణీంద్ర ఆపుతాడు...
శైలేంద్ర‌కు ఎంతో మంది రౌడీల‌తో ప‌రిచ‌యం ఉంది, వాళ్ల‌కు డ‌బ్బులు ఇచ్చి ఎన్నో దారుణాలు దుర్మార్గాలు చేశాడ‌ు
ధరణిని.. కళ్లతోనే భయపెడతాడు శైలేంద్ర..కానీ ధరణి మాత్రం తగ్గదు
ధరణి: వ‌సుధార చెప్పింది నిజ‌మే
శైలేంద్ర: తాను డ‌బ్బులు ఇచ్చిన వాళ్లు రౌడీలు కాద‌ని ప్లేట్ ఫిరాయిస్తాడు. వాళ్ల పేరు ఊరు తెలుసా, డెలివ‌రిబాయ్‌, ఫ్లంబ‌ర్‌ల‌ను చూసి మీరు రౌడీలు అంటూ పొర‌ప‌డితే ఎలా
వసు: నువ్వు మాట‌లు మార్చ‌డం, మ‌నుషుల్ని మ్యానేజ్ చేయ‌డంలో దిట్ట అని నాకు తెలుసు . నువ్వు రిషిని కిడ్నాప్ చేస్తే క‌ష్ట‌ప‌డి కాపాడి ఇంటికి తీసుకొచ్చాన‌ు..కానీ ఇప్పుడు రిషి  సర్ కనిపించలేదు
శైలేంద్ర: ఏంటి రిషిని కాపాడుకున్నావా...రిషి మీకు దొరికిడా . రిషి ఎక్క‌డున్నాడో తెలిసి మా ద‌గ్గ‌ర ఇన్నాళ్లు ఎందుకు దాచిపెట్టార‌ు. వాళ్లే రిషిని ఏదో చేసి త‌ప్పును నా మీద నెడుతున్నార‌ని తండ్రి  ద‌గ్గ‌ర మంచివాడుగా నటించే ప్రయత్నం చేస్తాడు.
దేవయాని; నా కొడుకు త‌ప్పు చేశాడ‌ని నిరూపిస్తే ఇక్క‌డే ఉరి వేసుకొని చ‌నిపోతా . నీ ద‌గ్గ‌ర సాక్ష్యాలు ఉన్నాయా...నిరూపిస్తావా 
వసు: రిషి సర్ ని నీ కొడుకే కిడ్నాప్ చేశాడ‌ని నా ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయ‌ంటూ..వీడియో చూపించాలి అనుకుంటుంది.  కానీ ఫోన్‌లో ఆ వీడియో క‌నిపించ‌దు. 
శైలేంద్ర: ఇదో కొత్త నాటకమా
వసు: శైలేంద్ర డిలీట్ చేసి ఉంటాడేమో...
దేవయాని: నీ ఫోన్ నీ ద‌గ్గ‌రే ఉంటే నా కొడుకు వీడియోను ఎలా డిలీట్ చేస్తాడు. వాడికి ఏమైనా మాయ‌లు, మంత్రాలు వ‌చ్చా 
ఇంతలో ముకుల్ ఎంట్రీ ఇస్తాడు
వసు: శైలేంద్ర‌నే క‌దా రిషిని కిడ్నాప్ చేసింది మీరైనా వ‌చ్చి నిజం చెప్ప‌మ‌ని ముకుల్‌ను రిక్వెస్ట్ చేస్తుంది
ముకుల్: అలాంటి ఆధారాలేవి మ‌న ద‌గ్గ‌ర లేవ‌ని వ‌సుధార‌తో అంటాడు ముకుల్‌. ఈ రోజు రిషి మిస్స‌వ‌డంతో శైలేంద్ర ఇన్‌వాల్వ్‌మెంట్ ఏం లేద‌ని తేలింది
ముకుల్ స‌మాధానంతో దేవ‌యాని, శైలేంద్ర రెచ్చిపోతారు. అస‌లైన నేర‌స్తుడు దొర‌క్క‌పోవ‌డంతో మీకు అనుమానం ఉన్న‌వారిపై నింద‌లు మోపుతారా అంటూ ఫైర్ అవుతారు. ఎందుకు నాపై నీకు క‌క్ష‌, నేనేమైనా నీ ఎండీ ప‌ద‌వికి అడ్డొస్తున్నానా, ఎండీ సీట్ మీద ఇంట్రెస్ట్ లేద‌ని నాన్న‌కు లెట‌ర్ రాసి నీకు ఇచ్చాను అని చెబుతాడు.


Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మరోసారి రిషి కిడ్నాప్ - స్పృహ తప్పి పడిపోయిన వసుధార


ఫణీంద్ర: నువ్వే సాక్ష్యం ఉంది అన్నావు. ఇప్పుడు ఆ వీడియో క‌నిపించ‌డం లేద‌ని అంటున్నావు. నీ మాట‌లు న‌మ్మే స్థాయి నుంచి, సాక్ష్యాలు ఉంటే కానీ న‌మ్మ‌ని స్థాయికి తీసుకొచ్చావు. శైలేంద్ర‌ను మీరు ఎందుకు నిందిస్తున్నారో నాకు అర్థం కావ‌డం లేద‌ు. వాడు త‌ప్పు చేశాడు అని తెలిస్తే కొడుకు అని చూడ‌కుండా కొట్టి అవ‌తల పారేస్తాను. కానీ నిజానిజాలు తెలియ‌కుండా ఊరికే ఇలాంటి గొడ‌వ‌లు వ‌ద్దు 
అన్న‌య్య‌కు సారీ చెప్పి వ‌సుధార‌ను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి మ‌హేంద్ర సిద్ధ‌మ‌వుతాడు. 
వసుధార: సాక్ష్యం లేదు కాబ‌ట్టి ఈ రోజు త‌ల‌దించుకుని వెళుతున్నాను. అదే సాక్ష్యం ఉంటే ఈ రోజు నీ చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్లేదానిని. రిషికి ఏదైనా అయితే నిన్ను బ‌త‌క‌నివ్వ‌ను . ఈ మాట‌లు గుర్తుపెట్టుకో


శైలేంద్రతో పాటూ మరొకరు
మ‌హేంద్ర, వ‌సుధార‌తో, అనుప‌మ, ముకుల్ అంతా రిషి కనిపించకపోవడంపై డిస్కస్ చేసుకుంటారు. రిషి కిడ్నాప్ వెనుకున్నది శైలేంద్ర కాకపోవచ్చని అనుపమ అంటుంది కానీ మహేంద్ర మాత్రం బలంగా వాదిస్తాడు. ముకుల్ కూడా అనుప‌మ మాట‌ల‌ను స‌మ‌ర్థిస్తాడు. 
ముకుల్: ఈ రోజు రిషి క‌నిపించ‌కుండా పోవ‌డం వెనుక శైలేంద్ర ఇన్‌వాల్వ్‌మెంట్ లేద‌ని మాకు బ‌ల‌మైన ఇన్ఫ‌ర్మేష‌న్ దొరికింది. రిషి క‌నిపించ‌కుండాపోవ‌డం వెనుక శైలేంద్ర‌తో పాటు మ‌రో ప‌ర్స‌న్ ఎవ‌రో ఉన్నారు. శైలేంద్ర మీ ఇంటికి వ‌చ్చి ఫోన్ డిలేట్ చేయ‌లేదంటే మీకు తెలిసిన ఎవ‌రో ఈ ప‌ని చేశార‌ు. తను ఎవ‌రో తెలిస్తేనే అన్ని నిజాలు తెలుస్తాయి


Also Read: మీ కెరీర్ కి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు, జనవరి 30 రాశిఫలాలు


శైలేంద్ర-భద్ర
వ‌సుధార‌కు తెలియ‌కుండా ఆమె ఫోన్‌లో ఉన్న వీడియోను భ‌ద్ర డిలీట్ చేస్తాడు. త‌న‌ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డ‌కుండా చేసిన భ‌ద్రని మెచ్చుకుంటాడు శైలేంద్ర. నీకు ప‌ని అప్ప‌గించినందుకు ఇప్పుడు రిలీఫ్‌గా ఫీల‌వుతున్నా అంటాడు. వ‌సుధార‌, మ‌హేంద్ర‌, అనుప‌మ చాలా ముదుర్లు అని, వాళ్ల క‌ళ్లు గ‌ప్పి ఈ ప‌నులు చేయ‌డానికి ఎంతో ప్లానింగ్ చేయాల్సి వచ్చిందని అంటాడు. రిషి భ‌ద్ర ద‌గ్గ‌ర లేడంటే కచ్చితంగా రాజీవ్ ద‌గ్గ‌రే ఉండి ఉంటాడ‌ని శైలేంద్ర అనుకుంటాడు. 
గుప్పెడంత మ‌న‌సు ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...