Guppedantha Manasu February 29th Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 29 ఎపిసోడ్)
వసుధారకు తెలియకుండా రిషికి మహేంద్ర చేత కర్మకాండల జరిపిస్తుంటారు దేవయాని అండ్ కో. మను ద్వారా సమాచారం తెలుసుకుని అక్కడకు వెళ్లిన వసుధార...తన ఫొటో కూడా అక్కజ పెట్టి నాక్కూడా కర్మకాండ జరిపించండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
వసు: రిషి సర్ చచ్చిపోయారంటే ఈ వసుధార కూడా చనిపోయినట్లే. మీరు నా నమ్మకాన్ని చెరిపివేశారంటే నేను బతికిలేనట్లే. రిషికి కర్మకాండలు జరిపిస్తున్న విషయం తండ్రి లాంటి మామయ్య తన దగ్గర దాచిపెట్టినప్పుడే నేను చనిపోయాను
మహేంద్ర సారీ చెప్పినా కానీ వసుధార కన్నీళ్లు ఆపదు
దేవయాని: ఏంటీ గొడవ..చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుంటే ఏందో ఘోరాలు జరుగుతున్నట్టు మాట్లాడుతావేంటి.. రిషిపై నీకు ఒక్కదానికే ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నావు
వసు: మేడం మీరు ఆపుతారా
దేవయాని: చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడుతావేంటి. నీకు రిషితో నాలుగైదేళ్ల పరిచయం మాత్రమే ఉంది. కానీ రిషిని చిన్నప్పటి నుంచీ పెంచింది నేను . నాకంటే ఎక్కువ బాధ ఉంటుందా నీకు. వాళ్ల నాన్నకన్నా, వాళ్ల పెదనాన్న కన్నా నీకు ఎక్కువ బాధ ఉంటుందా
వసుధార: మీరు ఇంక ఒక్కమాట కూడా మాట్లాడొద్దు...
ఫణీంద్ర: పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు
వసు: వయసు పెరిగినంతమాత్రాన సరిపోదు..బుద్ధి కూడా పెరగాలి
దేవయాని: చూశారు కదా మీ ముందే ఎలా మాట్లాడుతోందో...
ఫణీంద్ర: నీకు తెలిస్తే నువ్వు బాధపడతావనే ఇలా చేశాను మహేంద్ర తప్పేం లేదు
వసు: రిషి సర్ పై మీకు నా కన్నా ఎక్కువ ప్రేమ ఉందన్నారు కదా...మరి రిషి సర్ చనిపోయిన విషయాన్ని మీరెలా నమ్ముతున్నారు.
శైలేంద్ర: రిపోర్ట్స్ అన్నీ అవే చెప్పాయి కదా...
వసు: నేను బతికి ఉన్నానంటే రిషి సర్ బతికే ఉన్నారు
మను: రిషి చనిపోయింది ఎవరు చూడలేదు? కనీసం అతడి డెడ్‌బాడీ కూడా కనిపించలేదు. అలాంటప్పుడు చనిపోయింది రిషి అని ఎలా కన్ఫామ్ అవుతారు. ఒకవేళ రిషి బతికివస్తే అతడికి మీరు కర్మకాండలు జరిపించిన విషయం తెలిసి ఎంత బాధపడతాడు? నేను బతికి ఉన్నానని వసుధార చెప్పినా ఎందుకు నమ్మలేదని రిషి అడిగితే ఏమని సమాధానం చెబుతారు. వసుధార నమ్మకాన్ని గౌరవించి కర్మకాండలు జరిపించకపోతే ఏమవుతుందని మహేంద్ర, ఫణీంద్రలతో చెబుతాడు
దేవయాని: మను మాటలను దేవయాని కొట్టిపడేస్తుంది. ఆచారాల ప్రకారం రిషికి కర్మకాండలు జరిపించకపోతే తమ ఇంటికి కీడు జరుగుతుంది. ఇప్పటికే రోజుకో కష్టం, నష్టం తమ ఫ్యామిలీకి ఎదురవుతున్నాయి. కర్మకాండలు జరిపించకపోతే రిషి ఆత్మ శాంతించదు
వసు: ఆచారాలు, నమ్మకాలను అంతగా పట్టించుకున్నప్పుడు రిషి బతికి ఉన్నాడనే నా నమ్మకాన్ని ఎందుకు గౌరవించడం లేదు
దేవయాని: మధ్యలోనే కర్మకాండలు ఆపితే ఇంకా ఎంత అరిష్టం జరుగుతుందో ఏమో
Also Read: మను మామూలోడు కాదు..కానీ వసుకే అర్థం కావడం లేదు - శైలేంద్రకి మరో షాక్!
రిషి బతికి ఉన్నాడని తాను నిరూపిస్తానని ఫణీంద్ర, మహేంద్రలతో చెబుతుంది వసుధార. నిరూపించడం కాదు మూడు నెలల్లోనే రిషిని అందరి ముందుకు తీసుకొస్తానని ఛాలెంజ్ చేస్తుంది. రిషి రాడు అంటూ శైలేంద్ర ఆవేశపడతాడు. వసుధార ఆవేశం పట్టలేక కొట్టబోతుంది. కానీ ఆ పనిని ఫణీంద్ర చేస్తాడు.
ఫణీంద్ర: రిషి బతికి ఉన్నాడని వసుధార బలంగా నమ్ముతుంది..తన మాట నిజమైతే అంతకంటే ఆనందం ఏమి ఉండదు. నిజంగానే రిషిని వసుధార తీసుకొస్తుందని అనిపిస్తుంది.
శైలేంద్ర: అసలు రిషి బతికి లేడు
శైలేంద్ర : రిషికి కర్మకాండలు జరిపిద్దామనే ఐడియా ఇచ్చింది నువ్వే కదా...అప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు వసుధార చెప్పింది సరైంది అనిపిస్తుంది. సతీ సావిత్రి యముడితో పోరాడినట్టు వసుధార కూడా రిషిని తీసుకొస్తుంది అనిపిస్తోంది. వసుధార మాటలు నిజమని అందరూ నమ్మి తీరాల్సిందే. వసుధార నిజంగానే రిషిని తిరిగి తీసుకొస్తుందని అనిపిస్తుంది
ఫణీంద్ర: కర్మకాండలు మధ్యలోనే ఆపేయమని పంతులతో చెబుతాడు ఫణీంద్ర. దేవయాని కలుగజేసుకొని మధ్యలో కర్మకాండలు ఆపితే అరిష్టం అని అంటుంది. అలాంటిదేమీ లేదని, శాంతి పూజ జరిపిస్తే సరిపోతుందని పంతులు అంటాడు. ఇక నుంచి రిషి బతికి ఉన్నాడని అందరం నమ్ముదామని ఫణీంద్ర అంటాడు. రిషి చనిపోయాడని తన మనసును మరోసారి మార్చే ప్రయత్నం చేయవద్దని అంటాడు. మహేంద్రకు క్షమాపణలు చెబుతాడు ఫణీంద్ర
Also Read: టామ్ & జెర్రీ లా వసు , మను - రిషి కర్మకాండలు జరగకుండా మను అడ్డుకోగలడా!
మనుకి శైలేంద్ర వార్నింగ్
ప్లాన్ చెడిపోవడానికి కారణమైన మనుపై కోపంతో రగిలిపోతాడు శైలేంద్ర. మను వెళ్లిపోతుండగా ఆపిన శైలేంద్ర... నా ఫ్యామిలీ విషయంలో నీ జోక్యం ఎక్కువైంది. ఇకపై రెచ్చిపోతే ఊరుకోను. ఇక నీ కార్యక్రమాలు బంద్ అయిపోవాలి. లేదంటే బొంద పెట్టేస్తానంటాడు. నువ్వుం ఏం చేస్తావో చేసుకో..నేను చేసేది చేస్తాను. కుక్క మోరిగిందని నా పనులు ఆపుకోనని రివర్సవుతాడు శైలేంద్ర. ఈ క్షణం నుంచి నా టార్గెట్ నువ్వే.. ఎలా చనిపోయావో తెలుసుకునే లోపే నీ ప్రాణాలు గాలిలో కలిపేస్తానునని భయపెట్టాలని చూస్తాడు శైలేంద్ర. రిషి ఫొటో చూపించి నా తమ్ముడికి నా గురించి పూర్తిగా తెలియదు. తెలుసుకునేలోపు వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయంటాడు. నువ్వు ఇంతకుముందు ఎన్ని వెధవవేషాలువేశావో నాకు అవసరం . అప్పుడు నేను లేను. ఇప్పుడు నేను వచ్చాను. నువ్వు ఏ మాత్రం తోక జాడించిన లెక్కవేరుగా ఉంటుందని శైలేంద్రకు రివర్స్ వార్నింగ్ ఇస్తాడు మను.
Also Read: రోజుని ఇలా ప్లాన్ చేసుకోండి.. మీ ఎదుగుదలని ఎవరు ఆపుతారో చూద్దాం - చాణక్య నీతి!
గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది...