Guppedantha Manasu December 9th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 9 ఎపిసోడ్)


ఆ కానిస్టేబుల్ రోడ్డుపై వెళుతుంటే..ఓ కారు కనిపిస్తుంది. అది రిషి సార్ దే అని పోల్చిన కానిస్టేబుల్ ముకుల్ కి కాల్ చేసి చెబుతాడు. ఏమైనా అనుమానాస్పదంగా ఉందా? కిడ్నాప్ జరిగినట్లు ఏమైనా కనపడిందా అని ముకుల్ అడిగితే,తెలియడం లేదు అంటాడు. దీంతో ముకుల్  ఆ కారు ఫోటోలు, ప్లేస్ అడిగి తెలుసుకుంటాడు.


ఆ తర్వాత శైలేంద్ర తన రూమ్ లో ఉండగా దేవయాని వచ్చి..ముకుల్ వస్తున్న సంగతి చెప్పి కంగారుపడుతుంది. అప్పుడే వస్తున్నాడా అని ఆశ్చర్యపోతాడు.
దేవయాని: ‘ అప్పుడే ఏంటి..? వీళ్లు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారంట. వచ్చాడంటే మళ్లీ నీ ఆడియో ప్లే చేసి, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతావు? ఎలా ఎస్కేప్ అవుతావ్?’
శైలేంద్ర: ఎన్ని అడిగినా ఫేస్ చేస్తాను..తప్పించుకోగలను
దేవయాని: ఏదో ఒకటి చేద్దాం అంటావేంటి నాన్న,  నాకు అయితే కాళ్లు, చేతులు ఆడటం లేదు. ఆ ముకుల్ నిన్ను ఊరికే వదిలిపెట్టడు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడతాడు’ ఓ పక్కన వసుధార తోక తొక్కిన పాములా , నిన్ను, నన్ను ఎప్పుడు దొరుకుతామా అని ఎదురుచూస్తోంది. మరోవైపు మహేంద్ర కూడా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. వీరిద్దరికి తోడు అనుపమ కూడా ఉంది. వీళ్లంతా కలిసి నిన్ను దోషిలా నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు నాన్న. మళ్లీ అవకాశం రాదని ఇప్పుడే ఇరికించేద్దాం అనుకుంటున్నారు నాన్న
శైలేంద్ర: మామ్ నువ్వు ఎక్కువగా  టెన్షన్ పడి, నన్ను టెన్షన్ పెట్టకు, నన్ను ఆలోచించుకోనివ్వు’ 
ఇంతలో కారు వస్తుంది....ధరణి వచ్చి ముకుల్ వచ్చారని చెబుతుంది..
దేవయాని: వాడిప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చాడు...ఇప్పుడేం మాట్లాడతాడని ధరణిని పంపించేస్తుంది.  గోడదూకి పారిపోవడానికి కూడా నువ్వు నడిచే పరిస్థితిలో లేవు. నువ్వు ఇక్కడే ఉండు. నేనుఏదో ఒకటి చేసి ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తాను అని చెప్పి బయటకు వెళుతుంది...


Also Read: దేవయానిపై చేయెత్తిన వసు - శైలేంద్ర గురించి అనుపమకి తెలిసిపోయింది!


అప్పటికే  అందరూ హాల్లో కూర్చుని ఉంటారు..
దేవయాని: ఏంటండి మీరు, నా కొడుకు మనిషి అనుకుంటున్నారా? పశువు అనుకుంటున్నారా? ఎప్పుడుపడితె అప్పుడు వచ్చి ఇంటిరాగేషన్ చేస్తానంటారేంటి?’ 
ముకుల్: ఏంటి మేడమ్.. హాస్పిటల్ లో  చేస్తాం అంటే వద్దు అన్నారు.. ఇప్పుడు మళ్లీ ఇలా మాట్లాడుతున్నారు.’
దేవయాని: నా కొడుకును రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నారని సీరియస్ అవుతుంది.
ముకుల్ : కూల్ గా రెస్ట్ కావాలంటే తీసుకోమనండి..ఓ గంట అయినా ఎదురుచూస్తాను
దేవయాని: మీకు కాఫీలు, టీలు ఇస్తూ కూర్చోవాలా? రెండు, మూడు రోజులు ఆగి రావచ్చు కదా అంటుంది.
ముకుల్ : అన్ని రోజులు  వెయిట్ చేయను..మాకూ డ్యూటీ రూల్స్ ఉంటాయని, ఇప్పటికే చాలా ఎక్కువ సమయం ఇచ్చాం
ఫణీంద్ర కూడా ముకుల్ కి సపోర్ట్ చేస్తాడు
అనుపమ: హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినవాడు.. బెడ్రూమ్ నుంచి హాల్ లోకి రాలేడా అనిఅడుగుతుంది. వీల్ చైర్ లోనే కదా వచ్చేది అంటుంది. పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా.. గాయలకు ఏమైనా అవుతుంది అనడానికి అని అంటూ క్లాస్ వేస్తుంది..
వసుధార: శైలేంద్ర బయటకు రాలేకపోతే, ముకుల్ గారే ఆ గదిలోకి వెళ్లి ఇంటిరాగేట్ చేస్తారేమో.? ఏమంటారు సర్ అంటుంది. 
ముకుల్: అలా అయినా ఒకే అంటాడు. 
ఫణీంద్ర: వద్దులే.. శైలేంద్రే ఇక్కడికి వస్తాడు అని చెప్పి, దేవయానిని తీసుకురమ్మని చెబుతాడు. 
మహేంద్ర: దేవయాని నక్క బుద్ది చూపించి, ఏదైనా ప్లాన్ చేసి శైలేంద్రను తప్పిస్తుందే మో అనుకుంటూ తానే తీసుకొస్తాను అని  చెప్పి వెళతాడు. 
మహేంద్ర శైలేంద్ర గదికి వెళతాడు. అక్కడ ‘బాబు శైలేంద్ర... ముకుల్ పిలుస్తున్నాడు పదా, పోలీస్ ఆఫీసర్ ముకుల్ వచ్చినిలుచున్నాడు యముడిలాగా, ఆలోచించి టైమ్ వేస్ట్. వెళ్లక తప్పదు. నిన్ను నేను వీల్ చైర్ లో తీసుకొని వెళతాను’ అని హాల్ లోకి తీసుకుని వస్తాడు. 


Also Read: కొనసాగుతున్న రిషి మిస్సింగ్ సస్పెన్స్ - వసు అన్వేషణ - రంగంలోకి ముకుల్!


రాగానే ముకుల్.. కాసేపు యోగక్షేమాలు అడుగుతాడు. శైలేంద్ర కాస్త ఓవర్ చేసి, మీకు సహకరిస్తాను అని చెబుతాడు. శైలేంద్రను ఏ ప్రశ్న అడిగినా, దేవయాని సమాధానం చెప్పడానికి ముందుకు వస్తూ ఉంటుంది. ఏం జాబ్ చేస్తున్నారు అని ముకుల్ అడిగే, నా కొడుక్కి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? మా కాలేజ్ ఉంటే అంటుంది. దానికి శైలేంద్ర వాళ్ల అమ్మను కాస్త ఆగమని చెబుతాడు.
శైలేంద్ర: కాలేజీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాను
ముకుల్: లైఫ్ లాంగ్ ఇదే పని చేస్తారా? లేక ఏవైనా గోల్స్ ఉన్నాయా? ఐమీన్.. కాలేజీలో నే పై స్థాయి ఏమైనా కోరుకుంటున్నారా ’
శైలేంద్ర: మనసులో మాత్రం శైలేంద్ర తాను ఏకంగా ఎండీ సీటు కోరుకుంటున్నానని అనుకుంటాడు. పైకి మాత్రం ‘నాకంటూ ప్రత్యేకించి కోరికలు ఏమీ లేవు. మా అమ్మనాన్న ఏ పని చేయమంటే అది చేస్తాను’
వసుధార: ‘కానీ ఒకసారి మీరు ఎండీ పదవి తీసుకుంటాను అనిఅన్నారు కదా. సర్.. మీకు కూడా చెప్పారు కదా అని ఫణీంద్రకు గుర్తు చేస్తుంది.
ఫణీంద్ర: జగతి చనిపోయిన తర్వాత ఓ డిస్కర్షన్ లో అన్నాడని కానీ, నేనే వద్దు అన్నాను అని ఫణీంద్ర
ముకుల్: సారధి మీ ఫ్రెండే కదా అని అడుగుతాడు. అవును అంటాడు.  తర్వాత ‘మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో రిషి ఫ్రాడ్ చేశాడని ఇష్యూ చేసింది అతనే కదా? కానీ, వసుధార చెప్పినట్లు, జగతి మేడమ్ ని ఎవరో బ్లాక్ మెయిల్ చేయడం వల్లే, రిషి మీద నింద వేశారు. ఆ బ్లాక్ మెయిల్ చేసింది సారధి అని మీరు నమ్ముతారా?’ అంటాడు. దానికి శైలేంద్ర తనకు తెలీదంటాడు, 
వసు: సారధి కాకుంటే, వెనక ఇంకెవరో ఉండి ఉండొచ్చు కదా ’
ముకుల్ మాత్రం సారధి పరారీలో ఉన్నాడని, మీకు అతని ఇన్ఫర్మేషన్ తెలుసా అని శైలేంద్ర అడుగుతాడు. MSR కూడా మీ ఫ్రెండే కదా.. తను కూడా కాలేజీ ఫ్రెండేనా అనిఅడుగుతాడు. కాదని, ఫ్రెండ్ ద్వారా జస్ట్ పరిచయం అని శైలేంద్ర చెబుతాడు. ‘అతను కూడా మీ కాలేజీ పై కన్నేశాడని, అలాంటి వ్యక్తి దగ్గర మీరు అప్పు ఎందుకు తీసుకున్నారు?’ అని ప్రశ్నించగా, దానికి శైలేంద్ర దగ్గర సమాధానం ఉండదు. 


Also Read:  రిషి పెద్ద టిస్ట్ ఇవ్వబోతున్నాడా - అనుపమ కథను ఎలాంటి మలుపు తిప్పబోతోంది!
దేవయాని: వీళ్ల ఎవరి వల్లా కానిది నా కొడుకు చేశాడు అని గర్వంగా చెబుతుంది.
ముకుల్: అప్పు తేవడం తప్పు కాదు అప్పూ తీర్చకపోతే కాలేజీ ఇస్తానని చెప్పడం తప్పు అని చెప్పి, శైలేంద్ర కుట్ర బయటపెడతాడు.
శైలేంద్ర: ‘డబ్బు తీసుకురావాలనే కంగారులో అగ్రిమెంట్ చూడలేదు’
అనుపమ:‘ ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నావ్? అగ్రిమెంట్ చూడాలి కదా?’
దేవయాని: హడావుడిలో చూడలేదు అంటుంటే మళ్లీ చూడాలి అంటావేంటి...
ముకుల్: ‘కాలేజీ అనేది లేకపోతే, మీరు ఏ పని చేయగలరు శైలేంద్ర’ 
దేవయాని:అడుక్కు తింటాడు.. అసలు మీకెందుకు..పది నిమిషాలు అని చెప్పి.. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు?’ 
ముకుల్: మొన్న విన్న వాయిస్ లో తన వాయిస్ పోల్చుకోవాలి కదా...అని మళ్లీ వాయిస్ వినిపిస్తాడు ముకుల్...
అయితే తాను వాయిస్ పోల్చుకుంటున్నానని ముకుల్ చెప్పగానే ఆమె షాక్ అవుతుంది 
మళ్లీ వాయిస్ ప్లే చేస్తాడు ముకులు...అది విని అనుపమ, ధరణి షాకౌతారు. వెంటనే ధరణి కి గతంలో శైలేంద్ర ఎవరో రౌడీతో మాట్లాడిన విజువల్స్ గుర్తుకు వస్తాయి. 
అచ్చం నా వాయిస్ లానే ఉందని శైలేంద్ర అంటే...కాదు వంద శాతం మీ వాయిసే అంటాడు ముకుల్...
ఎపిసోడ్ ముగిసింది...