Guppedantha Manasu December 27th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 27 ఎపిసోడ్)
శైలేంద్రను తీసుకుని మహేంద్ర ఇంటికి వెళతాడు ఫణీంద్ర. శైలేంద్ర మనసులో ఏదో టెన్షన్ పడుతుంటాడు. మహేంద్ర రిషి గురించి ఏమైనా తెలుసా?
మహేంద్ర: రిషి మిస్సింగ్‌పై కొన్ని క్లూలు దొరికాయని, త్వరలోనే అసలైన దోషిని పట్టుకుంటానని ముకుల్ చెప్పాడు
ఫణీంద్ర: శైలేంద్ర కూడా రిషిని వెతికే పనిలోనే ఉన్నాడు
మహేంద్ర: శైలేంద్ర అయితేనే కచ్చితంగా రిషిని వెతికి తీసుకురాగలడు. ఒకవేళ తీసుకురాకపోతే తను ఉండడు కదా అంటూ శైలేంద్రపై మహేంద్ర సెటైర్ వేస్తాడు.
ఫణీంద్ర: రిషి మిస్సింగ్ విషయంలో శైలేంద్రను అనుమానిస్తున్నావా. ఎలాంటి అనుమానం లేకుండా గన్ తీసుకొచ్చి శైలేంద్రను ఎందుకు షూట్ చేయబోయావు. నిజంగానే శైలేంద్రనే ఈ తప్పు చేశాడని తెలిస్తే నేను వాడిని షూట్ చేసి చంపేస్తాను. అప్పుడు జగతి, ఇప్పుడు రిషి విషయంలో శైలేంద్రపై అనుమానం రావడానికి కారణం ఏంటో ఎన్నిసార్లు అడిగినా మీరు చెప్పడం లేదు
అనుపమ: నిజా నిజాల సంగతి పక్కనపెట్టండి..చట్టం అసలైన దోషులను తేలుస్తుంది కదా...
ఫణీంద్ర: నేను అదే అనుకుంటున్నాను
వసు: అవును సార్ జగతి, రిషి విషయంలో మేం కూడా చట్ట ప్రకారమే వెళ్లాలి అనుకుంటున్నాం
ఫణీంద్ర: ఇంతకు ముందు వచ్చినప్పడు ఇంట్లో లేం ఎక్కడికి వెళ్లారు
మహేంద్ర: ఊరికే బయటకు వెళ్లొచ్చాం
శైలేంద్ర: రిషి గురించి వెళ్లొచ్చారు కదా బాబాయ్
అనుపమ: రిషిని వెతికే బాధ్యత మీ బాబాయ్ అప్పగించారు కదా నువ్వు కూడా అదే పనిలో ఉండు
శైలేంద్ర: అలాగే అంటాడు
బయలుదేరుతాం అని చెప్పి శైలేంద్రని తీసుకుని వెళ్లిపోతాడు ఫణీంద్ర...
శైలేంద్ర లాంటి దుర్మార్గుడు ఆయనకు కొడుకవడం ఆయన చేసుకున్న పాపం అనుకుంటారు వసుధార, మహేంద్ర....
Also Read: వసుధారా అంటూ ఉలిక్కిపడి లేచిన రిషి - వసుని కాపాడినోడు కూడా శైలేంద్ర మనిషే!
దేవయాని-శైలేంద్ర
రిషిని శైలేంద్ర కిడ్నాప్ చేసినట్లు వసుధార దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిసినప్పటి నుంచి దేవయాని కంగారు పడుతుంటుంది.
శైలేంద్ర: ఎందుకు టెన్షన్ పడుతున్నావ్
దేవయాని: నీకు కొంచెం కూడా భయం లేదా
శైలేంద్ర:అసలు నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్..ప్రశాంతంగా ఉండు
దేవయాని: ప్రశాంతంగా ఎలా ఉంటాను..అసలు ఉన్నాడో లేదో తెలియని రిషిని ఎలా తీసుకొస్తావ్..
శైలేంద్ర:నువ్వు బుర్రపోయేలా ఎందుకు ఆలోచిస్తావ్..నన్ను దెబ్బకొట్టాలని చూసిన వాళ్లు భూమ్మీదే లేకుండా పోయారు.
దేవయాని: నేను భయపడుతోంది వసుధార గురించో మహేంద్ర గురించో కాదు...మీ నాన్న గురించి. ఆయన కూల్ గా ఉన్నంతవరకే మన ఆటలు, ఒక్కసారి మన నిజస్వరూపం ఆయనకు తెలిస్తే ఆయన ఉగ్రరూపాన్ని చూడాల్సి వస్తుంది. రిషిని నువ్వు తీసుకురాకపోతే ఆయన బతకనిస్తారా...
శైలేంద్ర: కథ అంతవరకూ నేను తీసుకురాను..రిషి విషయం చిన్న గీత చేసేస్తే సరిపోతుంది కదా...మనం కూరుకుపోతున్న ఊబినుంచి బయటపడొచ్చు కదా. ఏం చేస్తానో చూడు ..నువ్వూ చూస్తూ ఉండు.. అంతా నీకే తెలుస్తుంది. నువ్వు కోరుకున్నట్లుగానే నీ కొడుకు డీబీఎస్‌టీ సామ్రాజ్యానికి కింగ్ అవుతాడు
Also Read: వసుధార, అనుపమలను కాపాడిన అజ్ఙాత వ్యక్తి – రిషి డెడ్ బాడీ హాస్పిటల్లో ఉందని ఫోన్ చేసిన వార్డు బాయ్
వసుధార ఫ్యామిలీకి దగ్గరై ఆమెను చంపాలనే ప్లాన్‌ను అమలు చేయడం మొదలుపెడతాడు భద్ర. అందులో భాగంగా ముందుగా మహేంద్ర ముందు మంచివాడిగా నమ్మించాలని ఫిక్స్ అవుతాడు. ఓ ప్లాన్ వేసి కారుకు అడ్డం వెళతాడు. తాను అనాథనని, పని కోసం వెతుకుతున్నానని చెప్పి మహేంద్రను నమ్మిస్తాడు. మహేంద్ర దగ్గర కారు డ్రైవర్‌గా పనిలో చేరుతాడు. నువ్వు మాతో పాటే మా ఇంట్లోనే ఉండాలని భద్రతో అంటాడు మహేంద్ర. ఇదంతా చాటుగా గమనించిన శైలేంద్ర...కచ్చితంగా వసుధార, రిషిలను చంపుతాడని ఫిక్సవుతాడు.
వసుధార-అనుపమ
ఊసరవెల్లిలా శైలేంద్ర రంగులు మారుస్తుంటే తనని ఏం చేయలేకపోతున్నామని బాధపడుతుంది వసుధార. ఎన్ని దారుణాలు చేసిన ఏ మాత్రం భయలేకుండా నటిస్తున్నాడని అనుపమతో అంటుంది. రిషి తిరిగి వచ్చే వరకే శైలేంద్ర ఆటలు సాగుతాయనిన అనుపమ బదులిస్తుంది. త్వరలోనే శైలేంద్ర నిజస్వరూపం బయట పెడతానంటుంది వసుధార. అప్పుడే భద్రను తీసుకుని మహేంద్ర వస్తాడు. ఇకమీదట భద్ర కూడా మనతో పాటే ఉంటాడని మహేంద్ర అంటాడు. ఇకపై అనుపమ, వసుధారలకు కాపాడే బాధ్యత నీదేనని భద్రతో అంటాడు మహేంద్ర.
Also Read: తప్పించుకున్న రిషి, వసుధారపై అటాక్ ను అడ్డుకున్న కొత్తవ్యక్తి ఎవరు!
శైలేంద్రకు భద్ర కాల్
శైలేంద్రకు కాల్ చేసిన భద్ర పనిలో చేరానని త్వరలోనే గుడ్ న్యూస్ వినిపిస్తానని చెబుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర..భద్ర మాటలు వింటాడు. ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతాడు. తన స్నేహితుడితో మాట్లాడుతున్నానని అబద్దం చెప్పి... నమ్మకం లేని చోట క్షణం కూడా ఉండనంటూ రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు. తమ ఇంట్లోనే షెల్టర్ ఇవ్వాలని అనుపమ, మహేంద్ర ఫిక్సవుతారు.
ఎపిసోడ్ ముగిసింది...