ఎఫ్‌ఎమ్‌లో లవ్‌ డాక్టర్‌కు ఫోన్ చేసిన రిషి... తను ఓ అమ్మాయిని ప్రేమించడం లేదని కానీ కన్ఫ్యూజ్‌ అవుతున్నట్టు చెబుతాడు. అతను రకరకాలైన ప్రశ్నలతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని సర్టిఫై చేసి చెప్తాడు. 


మహేంద్ర కూడా ఆ లవ్‌ డాక్టర్‌, రిషి డిస్కషన్ వింటాడు. లవ్‌ డాక్టర్ పేరు అడిగితే మాత్రం కొందరు ప్రిన్స్ అంటారని.. మరికొందరు జంటిల్‌మెన్ అంటారని... సీరియస్‌ సింహం అంటారని చెప్తాడు. దీన్ని విన్న ఇది కచ్చితంగా రిషి వాయిస్‌ అనుకుంటాడు. అప్పుడే వచ్చిన జగతికి కూడా ఆ వాయిస్ వినిపిస్తాడు. చివరిగా ఏమైనా చెప్పాలా అని రిషిని ప్రశ్నిస్తాడు... దీంతో రిషి తన మనసులో మాట చెప్తాడు. ఆమె దగ్గరుంటే హాయిగా ఉంటుందని... కానీ ప్రేమించడం లేదని... చెప్తాడు. రిషి మాటల విన్న ఎఫ్‌ యాంకర్‌... మీరు ప్రేమలో ఆఖరి దశలో ఉన్నారంటూ చెప్తాడు. ఇదే చివరి కాల్ అని మీ మనసులో మాట మొహంమాట లేకుండా చెప్పేయమంటాడు. ఆ డిస్కషన్ వసుధార కూడా వింటుంది. రిషి లాంటి వాళ్లు చాలామందే ఉన్నారంటుంది. 


రిషికి ఆ ఎఫ్‌ఎమ్‌ యాంకర్ చెప్పిన సంగతులే గుర్తుకు వస్తుంటాయి. మహేంద్ర, జగతి కూడా రిషి గురించి డిస్కషన్ చేస్తుంటారు. సాక్షి ఇండియాకు వచ్చి రిషికి మేలు చేసిందంటాడు మహేంద్ర. రిషి ప్రేమలో ఉన్నాడని... త్వరలోనే వసుధార తన మనసులో మాట చెప్పేస్తాడని మహేంద్ర అంచనా వేస్తాడు. కానీ జగతికి ఎక్కడో అనుమానంగా ఉంటుంది. రిషి చెప్పకపోతే ఏంటని జగతి ప్రశ్నిస్తుంది. తన వద్ద సెకండ్ ప్లాన్ ఉందని మహేంద్ర చెప్తాడు. 


ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద వసుధార కోసం సాక్షి వెయిట్ చేస్తుంటుంది. వసుధార అడ్డు తొలగించుకునేందుకు ఎత్తులు వేస్తుంటుంది. దేవయాని ఇచ్చిన బూస్టింగ్‌తో ఏదైనా చేయాలని అనుకుటుుంది. 


పరీక్షకు రెడీ అవుతున్న వసుధార రూమ్‌కి రిషి వస్తాడు. తర్వగా రెడీ అవ్వమని తొందరపెడతాడు. నేరుగా వచ్చి వసుధార బెడ్‌పై కూర్చుంటాడు. ఇంతలో వసుధార పట్టు తప్పి రిషిపై పడుతుంది. రిషి ఒడిలో వసుధార పడిన తర్వాత కాసేపు ఒకర్ని ఒకరు చూసుకుంటారు. వసుధార లేచే సరికి రిషి మెడలోని చైన్‌...వసుధార చున్నీకి చుట్టుకుంటుంది. కాసేపటికి తేరుకొని వసుధార సారీ చెబుతుంది. రిషి తనదే తప్పంటాడు. కాసేపు ఇద్దరి మధ్య సారీలు నడుస్తాయి. తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి బయల్దేరుతారు. 


హాల్‌లో ఒంటరిగా ఉన్న దేవయాని వద్దకు వచ్చిన మహేంద్ర గుడ్‌ న్యూస్ అంటూ బాంబు పేలుస్తాడు. మీ ఫోన్‌కో ఫొటో పంపించాను అంటాడు. అందులో సాక్షి, రిషిల వెడ్డింగ్ కార్డు ఉంటుంది. అది చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబు అవుతుంది. దాన్ని జగతి చూపించి మరింత ఆనందపడుతుంది దేవయాని. జగతికి ఇదేమీ అర్థం కాదు. మహేంద్ర ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తుంది జగతి. ఎందుకు కుళ్లు కుంటావని అంటుంది దేవయాని. ఇంతలో ఆ ఫొటోను రిషికి పంపిస్తుంది దేవయాని.


వసుధార, రిషి ఇద్దరూ ఎగ్జామ్‌ హాల్‌కు వస్తారు. వసుధారకు ఆల్‌ది బెస్ట్ చెప్పి పంపిస్తాడు రిషి. మీరు వచ్చారు కాబట్టి నేను ఎగ్జామ్‌ చాలా బాగా రాస్తానంటుంది వసుధార. నాకు కూడా సంతోషంగా ఉందంటాడు రిషి. ఎందుకో అంటుంది వసుధార. చాలా సేపు మాట్లాడాలని... చాలా అందమైన టాపిక్ రెడీగా ఉందని ఆనందంగా ఉంటుందని... ఎగ్జామ్‌ బాగా రాసిన తర్వాత చెప్తాని అంటాడు. రాగానే ఓ గిఫ్ట్‌ కూడా రెడీగా ఉంటుంది చెప్తాడు. వసుధార చేయిని తీసుకొని ఇవాళ మనకు చాలా ముఖ్యమైన రోజని ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటాడు. తనతో తీసుకొచ్చిన పెన్ వసుధారకు ఇస్తాడు. 


రేపటి ఎపిసోడ్‌
ఎగ్జామ్ సెంటర్‌లో ఏదో ప్లాన్ చేసిన సాక్షి... వసుధారకు పక్కనే ఉండి సైలెంట్ వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో పెద్దమ్మ పంపించిన వెడ్డింగ్ కార్డు చూసి షాక్ అవుతాడు రిషి.