బాల్కనీలోకి రిషిని తీసుకెళ్లిన జగతి.. వసుధార విషయంలో క్లారిటీ ఇస్తుంది. వసుధారను ప్రేమిస్తున్నావని... ఆ విషయాన్ని ఎప్పుడో చెప్పానని గుర్తు చేస్తుంది. అప్పుడు చెబితే అలాంటిదేమీ లేదని నాపై అరిచావని... ఇప్పుడు మాత్రం కాదనలేవని అంటుంది జగతి. తన చేతిలో ఉన్న ప్రేమ లేఖను విప్పి చూపిస్తుంది. దాన్ని చూసి రిషి షాక్ అవుతాడు. ఈ ప్రేమలేఖలను కూడా కాదంటావా అని ప్రశ్నిస్తుంది జగతి. నిజాన్ని అబద్దం చేస్తావో.. నిజాన్ని ఒప్పుకుంటావో నీ ఇష్టమని చెబుతుంది. నీ మనసుకు నీవు అబద్దం చెప్పి నీకు నీవే మోసం చేసుకోకని చెప్పేసి వెళ్లిపోతుంది. 


ఆ లెటర్ పట్టుకొని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. లైటర్‌ తీసుకొని ఆ లెటర్‌ కాల్చేద్దామని చూస్తుంటాడు. కానీ ఆ పని లేకపోతాడు. వసుధారను అనవసరంగా తిట్టానా... తొందర పడ్డానా అని అనుకుంటాడు. 


సాక్షి గురించి ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తుంది. రిషికి ఎందుకంత కోపం వచ్చిందనుకుంటుంది. రిషి ఏదైనా మూడ్‌ ఆఫ్‌లో ఉన్నారేమో అనుకుంటుంది. అనవసరంగా తిట్టానే అని వచ్చినా వచ్చేస్తారని అనుకుటుంది. ఇంతలో కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి జగతి దిగుతుంది. రిషి సార్ అనుకున్నాను అంటుంది వసుధార. రిషి డిస్టర్బ్‌  అయ్యాడని... రిషి మనసు బాగాలేదని చెబుతుంది జగతి. ఈ వివరాలేవీ రిషిని అడగొద్దని రిక్వస్ట్ చేస్తుంది జగతి. ఎప్పటిలాగానే ఉండాలని చెప్పి ఇద్దరూ వెళ్లిపోతారు. 


కాలేజీకి వచ్చిన రిషికి ఆఫీస్‌ అసిస్టెంట్‌ కొరియర్ తీసుకొచ్చి ఇస్తాడు. మహేంద్ర వచ్చి కాఫీ తాగుదామా అంటాడు. వద్దని తనకు వచ్చిన కొరియర్‌ను జగతికి ఇమ్మని మహేంద్ర చేతిలో పెడతాడు. 


రిషి ఇంట్లో జరిగిన గొడవపై దేవయాని, సాక్షి డిస్కషన్ చేసుకుంటారు. రిషి మనసులో స్థానం లేనప్పుడు వెళ్లిపోతానంటుంది సాక్షి. రిషి మనసులో ఉన్న వ్యక్తిని పక్కకు జరిపి నీవు ఆ స్థానంలోకి వెళ్లాలని హితబోధ చేస్తుంది దేవయాని. నువ్వే గెలుస్తావని ధైర్యం నూరిపోస్తోంది. ఆ సీన్‌ను ధరణి చూస్తుంది. ఏంటి ఈమె ఆలోచనలు అనుకొని.. ఛీ ఛీ అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 


కొరియర్‌లో వచ్చిన స్కాలర్‌షిప్ ఎగ్జామ్‌ హాల్‌టికెట్‌ను వసుధారకు జగతి ఇస్తుంది. ఆ హాల్‌టికెట్ పట్టుకొని వచ్చి రిషికి చూపిస్తుంది. బాగా ప్రిపేర్‌ అవ్వమంటాడు... ఎప్పుడు వెళ్తున్నావని రిషి ప్రశ్నిస్తాడు. దీంతో షాక్‌కు గురైన వసుధార... మీరు రాకపోతే ఎలా అని అడుగుతుంది. ఈసారి నేను రావడం లేదని... కచ్చితంగా నీవు ఒంటరిగానే వెళ్తున్నావని చెప్పేస్తాడు రిషి. మీరు వస్తే నాకు ధైర్యంగా ఉంటుందని.. రావచ్చు కదా అని రిక్వస్ట్ చేస్తుంది. రిషిని ఒప్పించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంది. అయినా రిషి ఒప్పుకోడు. రాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే విషయాన్ని ఆలోచిస్తూ బయటకు వెళ్లిపోతుంది వసుధార. 


రిషి గురించి మాట్లాడుకుంటున్న టైంలో మహేంద్ర, జగతి వద్దకు వసుధార వస్తుంది. స్కాలర్‌ షిప్‌ ఎగ్జామ్‌ సెంటర్‌ వద్దకు రిషి రాను అన్న సంగతి వాళ్లకు చెబుతుంది. ఒంటరిగా వసుధార ఎలా వెళ్తుతుందని అనుకుంటారు. 



రేపటి ఎపిసోడ్‌


వసుధారని ప్రిపేర్ చేసి మహేంద్ర, జగతి ఎగ్జామ్‌కు పంపిస్తారు. కనీసం ఆల్‌ది బెస్ట్ అయినా చెప్పాలి కదా అని వసుధార ప్రశ్నిస్తుంది. వారికి తెలియకుండానే పక్కనే రిషి వచ్చి ఉంటాడు. ఎవరికీ తెలియకుండానే వసుధారను ఫాలో అవుతుంటాడు రిషి. ఇంతలో వసుధారను తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్ చేస్తారు.